Pages

దేవాలయానికి వెళ్ళేటప్పుడు, దేవాలయంలో చేయకూడని పనులు ఏమిటి?




దేవాలయానికి వెళ్ళేటప్పుడు, దేవాలయంలో

చేయకూడని పనులు ఏమిటి?

Here are some tips visitors and worshipers Do’s and Don’ts for visiting temples indian hindu culture, Hinduism Temple Rules


మనం పుణ్యం కోసం, పుణ్యక్షేత్రాలని దర్శిస్తూ ఉంటాము. ఆలయ సందర్శనం ద్వారా పుణ్యం సంపాదించటం మాట అటుంచితే, పాపం పొందకుండా ఉంటే అంతే చాలును. ఇదేదో వింతగా ఉంది అని అనుకుంటున్నారా ! ఇది పరమసత్యమని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఆలయానికి వచ్చినవారు తమకి తెలియకుండానే కొన్ని దోషాలు చేస్తుంటారట…అవేవో మనం కూడా కొన్నిటిని తెలుసుకుందాము….


Here are some tips visitors and worshipers Do’s and Don’ts for visiting temples indian hindu culture, Hinduism Temple Rules


ఆలయ సమీపమువరకు వాహనము పై రాకూడదు.
చెప్పులు దూరంగా వదిలి, కాలినడకనే వెళ్ళాలి.

పెద్దలకి మరియు భగవంతునికి ఒంటి చేతితో నమస్కరించకూడదు

అలాగే కొంతమంది ఆత్మ ప్రదక్షిణ అని చెప్పి, భగవంతుని ఎదుటే ప్రదక్షిణ చేస్తారు… కాని అలా చేయకూడదు… ఆలయం చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేయాలి…



చాలామంది దర్శనానంతరం భగవంతుని ఎదురుగా, కాళ్ళుచాపి కూర్చుంటారు… అలా కూర్చోవటం మహాపాపం.
భగవంతుని ఎదుట ఎత్తైన ఆసనాలపై కూర్చోవటం మహాపాపం.

ఆలయంలో నిద్రించకూడదు మరియు భోజనం చేయకూడదు.
భగవంతుని ఎదుట మన కస్టాలు చెప్పుకుని కంటనీరు పెట్టకూడదు.

ఆలయంలో ఉన్న సమయంలో ఎవరిమీద కోపగించకూడదు.
 


ఎవరైనా మనల్ని సాయమడిగితే… నేనున్నానని చెప్పి... కాపాడేవారి వలే అభయమివ్వకూడదు… ఎందుకంటే అందరిని కాపాడేది ఆ భగవంతుడే కదా.
కోర్కెలు సిద్ధించటం కోసం పూజలు చెయ్యకూడదు.

ఏ కాలంలో వచ్చే పండ్లని ఆ కాలంలో భగవంతునికి సమర్పించకుండా ఉండకూడదు.

భగవంతునికి వెనుదిరిగి కూర్చో కూడదు
భగవంతుని ఎదుట యితరులకు నమస్కరించకూడదు మరియు ఇతర దేవతలని నిందించకూడదు.