Pages

సాయిబాబా తొమ్మిది గురువారాల వ్రతం ?

సాయిబాబా తొమ్మిది  గురువారాల వ్రతం ?
సారుుబాబా సద్గతులు కలగజేసే దేవదేవుడు. ఆయన అనుగ్రహం పొందిన భక్తుల జన్మ చరితార్థం. మహాసమాధిలో ఉన్నా సారుు అని కష్టాలలో ఉన్న భక్తుడు దీనంగా వేడుకున్నా...వెంటనే లేచివచ్చి మరో మనిషి ఆ భక్తునికి సాయమందించేలా చేస్తాడు బాబా. విజయదశమి బాబా పుణ్యతిధి. సారుుని నవ గురువారాల వ్రతంతో మరింత ప్రసన్నం చేసుకోవచ్చు. ఆ వివరాలు ఇవిగో... 

నవ గురువార సాయిబాబా వ్రత ఆచరణ నియమాలు. 1). ఏ భక్తుడైనా స్ర్తీ పురుష బేదము లేకుండా ఈ వ్రతమును ఆచరించవచ్చును. 2). ఏ కులము వారైనా సరే, ఏ మతము వారైనా సరే ఈ వ్రతమును ఆచరించవచ్చును. 3). ఈ వ్రతమును సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితోను ఆచరించినచో మహత్వపూరితమైన ఫలము ప్రాప్తించును. 4). ప్రార్థనలు ఫలించాలంటే, కోర్కెలు తీరాలంటే భక్తి పూరితముగా సాయి భగవానుని ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతమును ప్రారంభించాలి. 5). ఉదయం సమయమైనను, సాయంత్రం సమయమైననూ ఈ పూజలు ఆచరించవచ్చును.

సింహాసనంపై సాయి: ఒక పలకను సింహాసనముగా అమర్చి ఒక వస్తమ్రును దానిపై పరిచి దానిపై సాయినాధుని పటమును గానీ విగ్రహముం గానీ ప్రతిష్టించి సాయినాథుని నుదిటిపై చందనం మరియు తిలకం దిద్దాలి. పూలమాలను గానీ పసుపు పుష్పములను గానీ సాయినాథునికి సమర్పించాలి. దీపస్తంభంలో సాయిజ్యోతిని వెలిగించి సాంబ్రాణి, అగరు ధూపములను సమర్పించాలి. పవిత్ర ఆహార రూపంలోనున్న చక్కర లేదా మిఠాయి, ఫలములు గానీ నైవేద్యముగా సమర్పించాలి. వ్రతములో కూర్చున్నవారికి పవిత్ర ప్రసాదమును సమంగా పంచి భుజించాలి. 6). పాలుగాని, కాఫీగాని , టీగాని లేక మిఠాయిలనుగాని, ఫలములనుగాని ఆహారముగా సేవించో లేక వ్రతమును ఆచరించు భక్తుడు ఒకే పూట (మద్యాహ్నం/రాత్రి) ఆహారం సేవించిగానీ వ్రతమును ఆచరించాలి. ఆకలి కడుపుతోను లేదా పూర్తి ఉపవాసంతోను ఈ వ్రతమును ఆచరించ రాదు. 7). వీలైనచో 9 గురువారములు సాయి మందిరమునకు వెళ్లి ప్రార్థించాలి. సాయిబాబా మందిరం దగ్గరలో లేని పక్షంలో గృహం లోనే అత్యంత భక్తితో పూజను ఆచరించాలి.

కోకిల వారికి 9 గురువారాల సారుుబాబా వ్రతమును గూర్చి వివరించింది. ఆత్మవిశ్వాసం మరియు సహనంతో సారుుబాబాను ప్రార్ధించినచో వారి పిల్లల చదువులలో ప్రగతి చూపునని వారికి సలహా ఇచ్చినది. కోకిల యొక్క బావ భార్య వారికి వ్రతం యొక్క వివరణలను చెప్పమని కోరగా తొమ్మిది గురువారములు ఫలములు పానీయములు తీసుకుని గానీ ఒక పూట ఉపవాసము ఉండి గానీ తొమ్మిది వారములు సారుు మందిరంలో సారుు నాథుని దర్సనం చేసుకోవాలి. 


8). భక్తులు వేరే గ్రామానికి వెళ్ళిన సమయంలో కూడా ఈ వ్రతమును కొనసాగించవచ్చును. 9). ఈ 9 గురువారాలు స్ర్తీలు మైలపడితే లేక మరో కారణం చేత గాని పూజలను ఆచరించనిచో ఆ గురువారం వదిలివేయవచ్చును. ఈ వదిలివేయబడిన గురువారం లెక్కించరాదు. మరియు రాబోవు గురువారం ఈ పూజను ఆచరించి 9 గురువారాలు పూర్తిచేయాలి. 
ఉద్యాపాన (వ్రతం పూర్తిచేయు) విధానం మరియు నియమాలు:
1). తొమ్మిదవ గురువారం 5 మంది బీదలకు అన్నదానం చేయాలి.
2). ఈ వ్రతం యొక్క శక్తిని ప్రజలకు తెలియ జేయడానికి ఈ సాయిబాబా వ్రతం పుస్త్తకములను ఉచితంగా (5, 11, లేదా 21) పంచవలెను.
3). తొమ్మిదో గురువారం నాడు ఈ పుస్త్తకములను పూజ గృహమునందు ఉంచి పూజించి ఇతరులకు పంచితే పుస్త్తకం ప్రసాదముగా అందుకొనే వారికి దైవానుగ్రహం లభించును.
పైైన చెప్పిన నియమాలతో ఈ వ్రతమును ఆచరించి ఈ దానములు గావించినచో సాయిబాబా కృపతో భక్తుని కోర్కెలు, ప్రార్థనలు నెరవేరును.

ఒక పలకను సింహాసనముగా అమర్చి ఒక వస్తమ్రును దానిపై పరిచి దానిపై సారుునాధుని పటమును గానీ విగ్రహముం గానీ ప్రతిష్టించి సారుునాథుని నుదిటిపై చందనం మరియు తిలకం దిద్దాలి. పూలమాలను గానీ పసుపు పుష్పములను గానీ సారుునాథునికి సమర్పించాలి. దీపస్తంభంలో సారుుజ్యోతిని వెలిగించి సాంబ్రాణి, అగరు ధూపములను సమర్పించాలి. పవిత్ర ఆహార రూపంలోనున్న చక్కర లేదా మిఠారుు, ఫలములు గానీ నైవేద్యముగా సమర్పించాలి.

సాయిబాబా వ్రత గాథ: కోకిల అను సాధువైన స్ర్తీ తన భర్త మహేష్‌తో ఒక నగరంలో నివిసిస్తోంది. పరస్పర ప్రేమానురాగాలతో, అన్యోన్యంగా వారు సంసారం సాగిస్తున్నారు. అయితే మహేష్‌ది దెబ్బలాడు స్వభావం మరియు అతని మాటలతో, భాషలలో సభ్యత అను హద్దులే ఉండేవి కావు. ఇరుగు పొరుగు వాళ్లకు మహేష్‌ స్వభావం చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ కోకిల చాలా శాంత స్వభావురాలైన భక్తురాలు. అపారమైన విశ్వాసంతో ఆమె సహృదయంతో... సహనంతో అన్నీ కష్టాలు సహిస్తూ వస్తుండేది. కాలక్రమంగా ఆమె భర్త యొక్క వాపారము దెబ్బతినగా సంసారం సాగడమే కష్టంగా ఉండేది. కాని మహేష్‌ పొద్దస్తమానం ఇబ్బందులకు గురవుతూ చీటిమాటికి భార్యతో పోట్లాడుతూ ఉండేవాడు. ఒక రోజు మధ్యాహ్నం ఒక సాధువు వారి గృహమునందు నిలిచాడు. ఆ సాధువు కోకిల వదనం చూసి బియ్యం మరియు పప్పు భిక్షం అడుగుతూ �సాయిబాబా నిన్ను అనుగ్రహించు గాక� అని కోకిలను దీవించాడు. కోకిల చాలా బాధపడుతూ ఈ జీవితంలో తనకు సంతోషనేది రాయబడిలేదంటూ తన విషాద గాథను చెప్పుకుంది.

కోకిల అను సాధువైన స్ర్తీ తన భర్త మహేష్‌తో ఒక నగరంలో నివిసిస్తోంది. పరస్పర ప్రేమానురాగాలతో, అన్యోన్యంగా వారు సంసారం సాగిస్తున్నారు. అరుుతే మహేష్‌ది దెబ్బలాడు స్వభావం మరియు అతని మాటలతో, భాషలలో సభ్యత అను హద్దులే ఉండేవి కావు. ఇరుగు పొరుగు వాళ్లకు మహేష్‌ స్వభావం చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ కోకిల చాలా శాంత స్వభావురాలైన భక్తురాలు. అపారమైన విశ్వాసంతో ఆమె సహృదయంతో... 

9 గురువారాల వ్రతం: ఆ సాధువు ఆమెను సాయిబాబా వ్రతమును 9 గురువారములు ఆచరించమని ఉపదేశించినాడు. వ్రత సమయమునందు పళ్ళు పానీయములు లేక ఒక పూట ఆహారము మాత్రమే భుజించాలని ఆదేశించాడు. సాధ్యమైతే సాయిబాబా మందిరానికి వెళ్లి ప్రార్థించాలని లేదా గృహంలో సాయి పూజను ఆచరించి 9 గురువారాలు తన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా నిర్దేశించబడిన నియమాలను అనుసరించి బీదలకు అన్నదానం గావించి 5 మందికి లేక 11 మందికి శ్రీ సాయి వ్రత పుస్తకాలను ఉచితంగా వితరణ గావించాలి. ఈ వ్రత ఆచరణ చాల మహత్వపూరితమైనది. మరియు కలియుగానికి చాల యుక్తమైనది. ఈ వ్రతము భక్తుని కోర్కెలను తీర్చును. కానీ భక్తునికి సాయినాథునిపై ప్రగాఢ విశ్వాసం మరియు భక్తి కలిగి ఉండాలి. 

ఏ భక్తుడైతే ఈ వ్రతమును నియమానుసారంగా భక్తిశ్రద్ధలతో ఆచరించునో అతని సమస్త కోరికలు ప్రార్థనలు సాఫల్యం గావించును అని సాధువు కోకిలకు చెప్పెను. కోకిల గూడా ఈ నవ గురువార వ్రతమును ఆచరించాలన్న దీక్షను గైకొని నిర్దేశించబడిన సమయానుసారంగా బీద సాదలకు అన్నదానం గావించి సాయివ్రత పుస్త్తకములను తొమ్మిదవ గురువారం ఉచితంగా వితరణ గావించి వ్రత దీక్షను పూర్తిగావించినది. అలా కొన్ని రోజులు గడిచిన పిమ్మట ఆమె కష్టాలన్నీ మాయమైనవి. గృహంలో సుఖ శాంతి వెలిసినది. మహేష్‌ యొక్క కలహ స్వభావం శాశ్వతంగా అంతరించినది. అతని వ్యాపారం సజవుగా కొనసాగింది. వారి జీవనం వృద్ది చెందింది మరియు ఆనందముతో జీవనం కొనసాగించడం మొదలుపెట్టారు.

ఈ విధముగా సాయివ్రతం చేయాలని కోకిల వారికి వివరించిన కొన్ని దినముల తరువాత సూరత్‌లో ఉన్న అక్క బావల నుండి కోకిలకు ఉత్తరం వచ్చింది. ఆమె పిల్లలు సాయివ్రతం ప్రారంభించినారనియు, ఇప్పుడు పిల్లలు బాగా చదువుతున్నారనియు తాము సహితం వ్రతము ఆచరించి సాయివ్రతం పుస్తకములను ఉచితంగా పంచినామని ఆ ఉత్తరం ద్వారా తెలియజేసారు. ఈ వ్రతం ఆచరించడం ద్వారా ఆమె స్నేహితురాలు యొక్క కుమార్తెను ఒక చక్కని అబ్బాయితో వివాహం నిశ్చయమైనదనియు పక్కింటామె నగల పెట్టె కనపడకపోగా వారు సాయివ్రతం ఆచరించిన 2 నెలలకు పోగుట్టుకున్న నగల పెట్టెను ఎవరో ఆగంతుకుడు వారికి పంపాడని ఆ ఉత్తరం ద్వారా తెలియజేసింది. ఇంత అద్భుతమమైన అనుభవాలను ఉత్తరం ద్వారా కోకిలకి తెలియజేసింది. కోకిల భగవానుని శక్తిని సాయివ్రత మహిమను తెలుసుకొనినది. దీనితో ఆమెకు సాయినాధుని మీదున్న భక్తి మరీ ఘాడమైనది. ఓ సాయినాథ! మమ్ము దీవించుము. మాపై నీ కరుణాకృపను జూపుము. 

అన్నివర్గాలవారూ ఆచరించదగిన వ్రతం:
ఆ తరువాత కొద్ది రోజుల పిమ్మట ఒక దినం సూరత్‌ నుండి కోకిల యొక్క బావ అతని భార్యతో కోకిల ఇంటికి విచ్చేసారు. వారు తన పిల్లలు చదువుల్లో బాగా వెనుకంజ వేసారని, పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేదని వాపోయారు. కోకిల వారికి 9 గురువారాల సాయిబాబా వ్రతమును గూర్చి వివరించింది. ఆత్మవిశ్వాసం మరియు సహనంతో సాయిబాబాను ప్రార్ధించినచో వారి పిల్లల చదువులలో ప్రగతి చూపునని వారికి సలహా ఇచ్చినది. కోకిల యొక్క బావ భార్య వారికి వ్రతం యొక్క వివరణలను చెప్పమని కోరగా తొమ్మిది గురువారములు ఫలములు పానీయములు తీసుకుని గానీ ఒక పూట ఉపవాసము ఉండి గానీ తొమ్మిది వారములు సాయి మందిరంలో సాయి నాథుని దర్సనం చేసుకోవాలి. ఏ భక్తుడైనా స్ర్తీ పురుష బేధం లేకుండా ఈ వ్రతమును ఆచరించవచ్చును. 

ఏ కులము వారైనా సరే, ఏ మతము వారైనా సరే ఈ వ్రతమును ఆచరించ వచ్చును. ఈ వ్రతమును సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితోను ఆచరించినచో మహత్యపూరితమైన ఫలము ప్రాప్తించును. ప్రార్థనలు ఫలించాలంటే, కోర్కెలు తీరాలంటే భక్తిపూరితముగా సాయి భగావానుని ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతమును ప్రారంభించాలి. ఉదయమైనను, సాయంత్రం సమయమైనా ఈ పూజలు ఆచరించవచ్చును. ఒక పలకను సింహాసనముగా అమర్చి ఒక వస్తమ్రును దానిపై పరిచి దానిపై సాయినాధుని పటమును గాని విగ్రహమును గాని ప్రతిష్టించి సాయినాథుని నుదిటిపై చందనం మరియు తిలకం దిద్దాలి. పూలమాలను గాని పసుపు పుష్పములను గాని సాయినాథునికి సమర్పించాలి. దీపస్తంభంలో సాయిజ్యోతిని వెలిగించి సాంబ్రాణి, అగరు ధూపములను సమర్పించాలి. పవిత్ర ఆహార రూపంలోనున్న చెక్కర హాని, మిఠాయి గాని ఫలములు గాని నైవేద్యముగా సమరించాలి. 

వ్రతములో కూర్చున్నవారికి పవిత్ర ప్రసాదముని సమంగా పంచి భుజించాలి. పాలుగాని, కాఫీగాని , టీగాని లేక మిఠాయిలను గాని ఫలములను గాని ఆహారముగా సేవించో లేక వ్రతమును ఆచరించు భక్తుడు ఒకే పూట (మధ్యాహ్నం/రాత్రి) ఆహారం సేవించి వ్రతమును ఆచరించాలి. ఆకలి కడుపుతోగాని లేదా పూర్తి ఉపవాసంతో గాని ఈ వ్రతమును ఆచరించ రాదు. వీలైనచో 9 గురువారములు సాయి మందిరమునకు వెళ్లి ప్రార్థించాలి. సాయిబాబా మందిరం దగ్గరలో లేని పక్షంలో గృహంలోనే అత్యంత భక్తితో పూజను ఆచరించాలి. భక్తులు వేరే గ్రామానికి వెళ్ళిన సమయంలో కూడా ఈ వ్రతమును కొనసాగించవచ్చును. ఈ 9 గురువారాలు స్ర్తీలు మైల పడితే లేక మరో కారణం చేత గాని పూజలను ఆచరించనిచో ఆ గురువారం వదిలివేయ వచ్చును. ఈ వదిలివేయబడిన గురువారం లెక్కించరాదు. మరియు రాబోవు గురువారం ఈ పూజను ఆచరించి 9 గురువారంలు పూర్తిచేయాలి.ఎవరైతే వారి జీవితములో అహంకారమును విడిచెదరో వారికి నేను మిక్కిలి సహాయ పడేదను.

నా నామమును ప్రేమతో ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చెదను.వారి భక్తి పెంచెదను.వారిని అన్ని దిశలనుండి కాపాడెదను.
ఎవరైతే శరణాగతి వేడెదరో , నన్ను భక్తి విశ్వాసములతో పూజించెదరో , నన్నే స్మరించెదరో, నా ఆకారమును మనస్సున నిలిపెదరో వారిని బంధనముల నుండి తప్పించుట నా ముఖ్య లక్షణము.
నా కథలను భక్తితో వినినచో అవి సకల రోగములను నివారించును.
సాయి,సాయి అను నామము జ్ఞప్తియందు ఉంచుకున్నంత మాత్రమున, పలుకుటవలన , వినుటవలన పాపములు తొలగిపోవును.
మీరెక్కడ ఉన్నపటికి, ఏమి చేయుచున్నపటికి నాకు తెలియచుండును.
ఈ జగత్తును నడిపించువాడను నేనే. నేనే జగన్మాతను.త్రిగుణములను సరిజూచువాడను నేనే.బుద్దికి తోచునట్లు చేయువాడను నేనే.సృష్టి,స్థితి ,లయకారకుడను నేనే. ఎవరైతే వారి దృష్టి నాపై నిలిపెదరో వారికి ఏ హాని గాని, బాధ గాని కలుగదు.

నా భక్తుని ఇంట్లో అన్నా వస్తమ్రులకు లోటు వుండదు.
నా యందే మనస్సు నిలిపి, భక్తి శ్రద్దల తో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములు నేను చూచెదను.

ప్రపంచమున పేరు సంపాదించుట యత్నించుట మాని , భగవంతుని కరుణా కటాక్షములు పొందుటకు, భగవంతునిచే గౌరవమందుటకు ప్రయత్నిమ్పుము.మానవులచే గౌరవము పొందుట అనెడి భ్రమను విడువుము.