Pages

ఇంట్లో బీరువా ఏ వైపు పెట్టుకోవాలి?






ఇంట్లో బీరువా ఏ వైపు పెట్టుకోవాలి?


వట్టి తీగ కదిపి చూడు స్వరములేవి వినపడవు

వీణకు బిగించి మీటు స్వరధారలు ఆగవు
పంచభూతములు చూడగ సాధారణమనిపించును
ఒక రూపము దాల్చినవా రోబోలై విజృభించును!

వాయవ్యం గదిలో మూడవ సంతానం నిద్రించడం 
ఉత్తరం గదిలో పిల్లలు పడుకోవడం
ఉత్తమ ప్రగతికి చేరడం
ఆనంద జీవితాన్ని అనుభవించడం!

ఇంట్లో బీరువా ఏ వైపు పెట్టుకోవాలి? దానిపై వేరే సామాన్లు పెట్టుకోవచ్చా?:- ఠాకూర్ స్వరూప్, కొడంగల్
బీరువాల అవసరం అనేక విధాలుగా వుంటుంది. డబ్బులు, ఆభరణాలు, డాక్యుమెంట్లు మొదలైన విలువైన వస్తువులు దాచడానికి, వాడుకోవడం లేదా బట్టలు పెట్టుకోవడం వగైరా... విలువైన ధన సంబంధ బీరువాను నైరుతి గదిలో దక్షిణ నైరుతికి చేర్చి ఓపేన్ చేస్తే ఉత్తరం ముఖం చూసేలా పెట్టాలి. లేదా పడమర నైరుతి చేర్చి తూర్పు వైపు తెరుచుకునేలా బీరువా పెట్టుకోవచ్చు. పోతే, దక్షిణ, పడమరలో పూర్తిగా ‘ఉడ్’తో సెల్ఫ్ చేసుకుంటున్నారు. అలాగే పడమర వైపు గోడను పూర్తిగా సెల్ఫ్‌గా వాడుకుంటున్నారు. అయితే, వీటిల్లానే నైరుతి భాగంలో బీరువా వచ్చే విధంగా లేదా దానిలో ఒక భాగాన్ని చెక్కతోనే నైరుతిలో ప్రధాన వస్తువులకు వాడుకొని మిగతా వాటికి ఇతర సెల్ఫ్‌లను వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా పడక చెడకుండా మంచం జరపకుండా గదికి అమరేటట్టు కట్టుకుంటే మంచిది. విశాలతను, ప్రశాంతతను పడకగది కోల్పోవద్దు.

ఉత్తరం నుండి దక్షిణానికి మా ఇంటికి మెట్లు ఉన్నాయి. ఆ పైన దక్షిణం నుండి ఉత్తరానికి మెట్లు వున్నాయి. కానీ, తూర్పునుండి పడమరకు వెళ్ళే విధంగా మెట్లు వుండాలంటున్నారు. ఏది నిజం?:- ఎస్. లక్ష్మణరావు, కరీంనగర్
మీరు కట్టుకున్న మెట్లు తప్పుకాదు. ఇంటికి మెట్లు వేసే చోటును బట్టి అవి దక్షిణ, పడమర దిశలు మారుతూ వుంటాయి. తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేస్తే ఉత్తరం నుండి దక్షిణం వెళ్ళి ల్యాండింగ్ మీద దక్షిణం నుండి ఉత్తరానికి తిరుగుతాయి. ఉత్తరం ఇంటికి వాయవ్యంలో మెట్లు వేస్తే తూర్పు నుండి పడమరకు వెళ్లి ల్యాండింగ్ మీద పడమర నుండి తూర్పునకు ప్రయాణిస్తాయి. ఇవి సవ్యమైన మెట్లు ఏ చోట వేసినా ఇదే విధానం. అన్ని చోట్లా తూర్పునుండి పడమరకే ఎక్కాలి అంటే రావు. వాస్తులో చాలా మూలాలు వున్నాయి. అందరూ ‘ఈశాన్యం బాయి, నైరుతి బెడ్ ఆగ్నేయం పొయ్యి’ వీటినే వాస్తు సమస్తం అనుకుంటారు. కొన్ని కీటకాలకు ఏ వాస్తు చూసినా డాట్‌లాగా కనబడతాయి. త్రీడైమెన్షన్ విజన్ వుండదు. ఆ కీటక జాతులు అదే నిజమనుకుంటాయి కదా!

మా స్థలానికి నైరుతి వీథిపోటు వుంది? ఆ స్థలాన్ని మా అన్నదమ్ములం ఎలా పంచుకోవాలి? :- కృష్ణ, వరంగల్
మీ స్థలం కొలతలు రాయలేదు. అయితే మీ ప్లానులో చూపినట్టు మీ స్థలానికి దక్షిణ నైరుతిలో కోణంగా వీథిపోటు వుంది. అది అనేక అకాల సమస్యలకు మూలమౌతుంది. తల్లిదంవూడులు దూరమౌతారు. ఆపరేషన్లు, కొన్ని భయానక సంఘటనలకు మూలమౌతుంది. ఇందులోని గృహసభ్యులు వేగం కలిగిన, బింకం కలిగిన మొండితనంతో వ్యవహరిస్తూ ఉంటారు. తద్వారా పాటుపడటం, అపసవ్య నిర్ణయాలు తీసుకోవడం, ఫెయిల్ కావడం జరుగుతుంది. ముందుగా నైరుతి వీథిపోటు పడే భాగాన్ని ఒక గదిగా చేసి వీథి వెడల్పులో సమంగా వేరు చేయాలి. దానిని ప్రజా సంబంధ గుడిగానో, బస్‌స్టాప్‌గానో ధారాదత్తం చేయాలి. అప్పుడు ఉత్తరం వైపు వున్న ఖాళీ స్థలానికి దక్షిణ ఆగ్నేయం నుండి గోడ పెట్టుకొని ఆ ఖాళీ స్థలానికి తూర్పు ఒక రోడ్డు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అంటే తూర్పు వీథి కలిగిన స్థలంగా మార్చి అప్పుడు ఆ స్థలాన్ని మీ అన్నదమ్ములు వరుసగా దక్షిణం నుండి పెద్దవారుతో మొదలుపెట్టి పంచుకోవచ్చు. అందరికీ తూర్పు నడకలు వచ్చే మంచి గృహాలు నిర్మించుకోవచ్చు. లేదా తూర్పు ఈశాన్యం దారి వాడుకోవచ్చు.

మాకు ఆగ్నేయంలో ఖాళీ స్థలం వుంది. అక్కడ మరొక ఇల్లు కట్టుకోవచ్చా?:- పి. వెంకట రాములు, వెంకటాపురం
ఉన్న ఇల్లు ఇరుకు అవడంగానో, పాత ఇల్లు కావడం వల్లనో మరొక ఇంటి నిర్మాణం కోరుకుంటూ వుంటారు. అయితే, మనం ఉన్న ఇల్లు మన చేతిలోనే ఉండాలంటే ఉన్న ఇంటికి ఖాళీ స్థలం తూర్పు వైపున ఉండాల్సి వస్తుంది. కానీ, మీకు ఖాళీ స్థలం ఆగ్నేయంలో వుంది. ఆ చోట ఇల్లు కడితే ఉన్న ఇంటికి అది ఆగ్నేయ గృహం అవుతుంది. అప్పుడు ఆగ్నేయ, వాయవ్య నడకలు వంకరగా వచ్చి అపసవ్యత ఏర్పడుతుంది. అయితే, ఒక మార్గముంది. మీ స్థలానికి ఉత్తరం రోడ్డు ఉంది. కాబట్టి, ఉన్న ఇంటిని వదిలి తిరిగి దానిని వాడకుండా అవసరమైతే అమ్మకానికి పెట్టి ఆగ్నేయం భాగంలో మరొక ఇల్లు కట్టుకోవచ్చు. అయితే పాత ఇల్లు వాడకూడదు. అప్పుడు ఉత్తర ఈశాన్యంలో నడక వచ్చి మంచి గృహం నిర్మితమౌతుంది.