ఫినాయిల్ వాడితే నేలపై ఉన్న క్రిములు నశిస్తాయి కాని వాటిలో ఉన్న రసాయనాలు పసి పిల్లల ఆరోగ్యానికి హాని చేయవచ్చు . కాలి పగుల్ల వంటి చర్మ సమస్యలు రావోచు, అది గాక ఖరీదయిన టైల్స్ కూడా రసాయనాల కారణంగా పాడయే అవకాశం ఉంది అలా కాకుండా పర్యావరణ హిటంగా ఉండే ఫినాయిల్ వాడకానికి ఇపుడు గిరాకి పెరుగుతోంది. వీటిని ఆస్పత్రుల్లో , అతిది భవనాలు, పాటశాలలు, ప్రబుత్వ ఆఫీసులు, హాస్టళ్ళ వంటి వాటికి సరఫరా చేయవచ్చు ఈ రకం ఫినాయిల్ లో ముడి పదార్థంగా వేపనూనె , మంచి నీళ్ళు , సిట్రొనెల్లా నూనె, కొన్ని సహజ రంగులు. |
ఉత్పతి సామర్త్యం: |
రోజుకి 200 లీటర్ల ఫినాయిల్ తాయారు చేసుకోవచు, లీటర్ ముడి పదార్థానికి అయ్యే ఖర్చు రూ. 9.35 వరకు ఉంటుంది |
స్తిర వ్యయాలు : |
పరిశ్రమ ప్రారంభించడానికి 500 చ. అడుగుల స్తలాన్ని కెటాయించుకొవాలి |
ఫినాయిల్ తయారికి ఉపయోగించే మిక్సర్ కం ఏమల్సి ఫెయిర్ పరికరం ఖరీదు రూ. 1,00,000. ద్రవాలు కొలిచే పరికరాలకు రూ.10,000 అవుతుంది. ఇవి కాకుండా ప్లాస్టిక్ డ్రమ్ములు |
ఇతర పాత్రలు, టేబుళ్ళ కోసం 10,000 రూ. ఖర్చు పెట్టవలసి ఉంటుంది . |
విద్యుత్ బిగింపు , ఫర్నిచర్ కోసం 30,000 రూ . అవుతుంది. మొత్తం స్తిర వ్యయాల కోసం 1,50,000 రూ . ఖర్చు రావచ్చు. |
నెల వారిగా వ్యయాలు: |
ముందుగా ముడి పదార్తాలకు అయ్యే ఖర్చు ఏంటో చూద్దాం రోజుకి 200 లీటర్ల చొప్పున సెలవు దినాలు పోను 25 పని దినాలు ఉంటాయి . లీటర్ 9.35 చొప్పున లెక్కిస్తే పాతిక రోజుల్లో అయ్యే ఖర్చు 200Xరూ. 9.35X25 రోజులు = రూ . 46,750 . ప్యాకింగ్ చేయడానికి ఒక లీటర్ సామర్త్యం ఉండే పెట్ సీసాలు , లేబుల్లకు కలిపి ఒక్కో సీసాకు నాలుగు రూపాయల వంతున ఖర్చు వస్తుంది. ఆ లెక్కన 200X25Xరూ 4 = 20,000 రూ అవుతుంది. |
పాకింగ్ చేసిన బాటిల్లను అట్ట పెట్టెలలో పెట్టాలి కావున ఒక్కొక్కటి 20 రూ చొప్పున 250 * రూ. 20 = 5,000 రూ అవుతుంది. ప్యాకింగ్ టేపులు, ఇతర ఖర్చులు కలిపి 1,000 రూ ఉంటాయి. అంటే మొత్తం ప్యాకింగ్ ఖర్చు 26,000 రూపాయలు జీతాల కింద ఇద్దరికీ నెలకు అయ్యే ఖర్చు 12,000 రూపాయలు . ఇవాన్ని కలిపి మొత్తం ఉత్పత్తి ప్రచారానికి అయ్యే ఖర్చు రూ. 10,000, రవాణా కి అయ్యే ఖర్చు రూ. 10,000 , విద్యుత్ , ఇతర నిర్వహణ ఖార్చులు 10,000 మొత్తం నెల వారి వ్యయాలు రూ . 1,14,750. అవుతుంది. |
రెండు నెలల వర్కింగ్ కాపిటల్ చేతిలో ఉంచుకోవాలి కాబట్టి అందుకు అయ్యే మొత్తం రూ .2,30,000 |
మొత్తం పరిశ్రమా వ్యయం: |
స్తిర వ్యయాలు , రూ . 1,50,000 వర్కింగ్ కాపిటల్ రూ. 2,30,000 లతో కలిపి మొత్తం పరిశ్రమ వ్యయం రూ. 3,80,000 అవుతుంది . |
లాభ నష్టాల అంచనా: |
100 శాతం వినియోగ సామర్త్యం పైన సంవస్తర అమ్మకం ఆదాయం ఎంతో చూద్దాం. |
200లీ x 300 రోజులు అంటే సంవస్తరానికి 60,000 లీటర్లు తయారవుతుంది. లీటర్ 35 రూ చొప్పున అమ్మితే వచ్చే ఆదాయం 21,00,000 రూపాయలు . |
సంవస్తారానికి అయ్యే వ్యయం : |
ఉత్పత్తి వ్యయం : రూ 1,14,750 x 12 = రూ.13,77,000 |
తరుగు దల: రూ.22,500 , వడ్డీ రూ.53,200 ఇవన్ని కలుపుకుంటే సంవస్తారానికి రూ.14,52,700 అవుతుంది. |
లాభం: మొత్తం ఆదాయం రూ.21,00,000 నుంచి ఖర్చులు రూ. 14,52,000 పోను లాభం రూ. 6,47,000 అంటే నెలకు వచ్చే ఆదాయం రూ. 53,750 వస్తుంది. |
Pages
▼