యాగాలు ఎన్ని రకాలు ?
యాగాల్లో రకాలు...
అశ్వమేధ యాగం,
సర్ప యాగం,
రాజసూయ యాగం,
పుత్రకామేష్టి యాగం,
శ్వజిత్ యాగం, వరుణయాగం.
యజ్ఞం లేదా యాగం ఒక విశిష్టమైన హిందూ సంప్రదాయం. భారతదేశంలో పురాణకాలం నుంచి వివిధ రకాలెైన యజ్ఞాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించం యజ్ఞం లక్ష్యం. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం యజ్ఙంలో ఒకటి గాని అంతకంటే ఎక్కువగా గాని హోమాగ్నులు ఉంటాయి. ఆ అగ్నిలో నెయ్యి,పాలు ధాన్యం, వంటివి పోస్తుంటారు.
అశ్వమేధ యాగం : అశ్వమేధ యాగం వేద కాలం నుంచి వస్తున్న రాజ సాంప్రదాయాలలో అతి ముఖ్యమైనది. ఈ యాగము వివరముగా యజుర్వేదములో చెప్పబడినది. ఋగ్వేద ములో గురప్రు బలి గురించి, శ్లోకాలలో కొంత ప్రస్తావన ఉన్నా, యజుర్వేదములో చెప్పినంత వివరముగా చెప్పబడిలేదు. గాయత్రీ పరివార్ 1991 నాటి నుంచి జంతు బలి లేకుండా, అశ్వ మేధ యజ్ణాన్ని ఆధునిక శెైలిలో నిర్వహిస్తున్నారు. అశ్వమేధ యాగాన్ని కేవలం రాజ వంశానికి చెందిన వారు మాత్రమే చేయాలి. ఈ యాగం ఉద్ధేశ్యం ఇరుగు పొరుగు దేశాల రాజ్యాల పెై ఆధిపత్యాన్ని తెలుపడం తమ రాజ్యం యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం. ఈ యాగంలో దృడంగా ఉండే 24 నుంచి 100 సంవత్సరాల మధ్య వయసు గల మేలు జాతి మగ గుర్రాన్ని మాత్రమే వాడతారు. గుర్రాన్ని మంత్ర జలంతో శుద్ధి చేశాక, ఋత్వికులు దాని చెవిలో మంత్రాలను పఠిస్తారు. ఎవరెైనా ఈ గుర్రాన్ని ఆపబోయే వారికి శాపాలను ఇస్తూ, ఒక కుక్కను చంపి సంకేతికంగా శిక్షను తెలియచేస్తారు. ఆ తర్వాత గుర్రాన్ని ఒక సంవత్సరరకాలం (కొంతమంది అర్థ సంవత్సర కాలమని చెపుతారు) యధేచ్చగా తిరగడనికి ఈశాన్య దిశగా వదిలేస్తారు. ఈ గుర్రాన్ని సూర్యునితోనూ, సూర్యుని సాంవత్సరిక గమనముతోనూ పోలుస్తారు. అశ్వము శత్రు రాజ్యంలో సంచరిస్తే నిర్వాహకుడు ఆ శత్రు రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. గుర్రాన్ని ప్రతీ ఆపద, ఇబ్బందుల నుంచి కాపాడడానికి తోడుగా రాజ కుమారులు కాని సేనాధిపతులు గాని ఉంటారు. నిర్వాహకుని ఇంట్లో ఈ గుర్రం తిరిగే కాలంలో యజ్ణ యాగాదులు జరుపుతారు.
గుర్రం తిరిగి వచ్చాక మరికొన్ని ఆచారాలను పాటిస్తారు. మరి మూడు గుర్రాలతో ఈ అశ్వాన్ని బంగారు రథానికి కాడి వేసి కట్టి ఋగ్వేదాన్ని పాటిస్తారు. ఆ తర్వాత గుర్రాన్ని స్నానమాడించి, మహారాణీ, తన పరిచారకులు గుర్రాన్ని నేతితో అభ్యంగనమాచరిస్తారు. మహారాణీ ముందు కాళ్లను, పరిచారకులు కడుపు భాగాన్ని, వెనుక కాళ్లను అభ్యంగనమాచరిస్తారు. అశ్వము తల, మెడ, తొకలను బంగారు ఆభరణములతో అలంకరిస్తారు. నిర్వాహకుడు గుర్రానికి రాత్రి నెైవేద్యాన్ని సమర్పిస్తాడు. ఆ తర్వాత గుర్రాన్ని, ఒక కొమ్ములులేని మగ మేకను, ఒక గోమృగాన్ని (అడవి బర్రె)ని అగ్ని గుండానికి దగ్గరగా బలి పీఠానికి కట్టి వేస్తారు. ఇంకా 17 జంతువులను గుర్రానికి కడతారు. ఇంకా చాలా పెంపుడు అడవి జంతువులను (ఒక వ్యాఖ్యాత ప్రకారం మొత్తం 609 జంతువులు) వేర్వేరు బలి పీఠాలకు కట్టి వేస్తారు.అప్పుడు ఆ గుర్రాన్ని బలి చేస్తారు. మహారాణీ మిగతా రాణులను ఆచార బద్ధంగా ఏడవడానికి పిలుస్తుంది. రాణులు మంత్రాలు చదువుతూ గుర్రం శవం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. తతిమ్మా రాణులు అశ్లీలాను ఉచ్చరిస్తూ ఉంటే మహారాణీ గుర్రం శవంతో భోగించినట్లుగా అనుకరణ చేస్తుంది. మరుసటి రోజు పొద్దున, ఋత్వికులు మహరాణీను రాత్రి గుర్రంతో గడిపిన ప్రదేశం నుంచి అశ్లీల పదాలను శుద్ధి చేసే దధిక్ర శ్లోకాలతో లేపు కొస్తారు. ముగ్గురు రాణులు ఒక వంద బంగారు, వెండి, రాగి సూదులతో గురప్రు శరీరంపెై కోయవలసిన భాగాలపెై గురుతులుగా గీతలు గీస్తారు. గుర్రాన్ని కోసి మంసాన్ని కాలుస్తారు. గుర్రం యొక్క వివిధ అంగాలు వేర్వేరు దేవుళ్లకు నెైవేద్యంగా స్వాహా అంటూ అగ్ని గుండంలో వేస్తారు. ఆ తర్వాత ‘అశ్వస్తుతితో’ యాగం ముగుస్తుంది.
సర్పయాగం :మహాభారతంలో జనమేజయుడు చేసిన యాగం పేరు సర్పయాగం. దీని ముఖ్య ఉద్ధేశం ప్రపంచంలోని పాములను అగ్నిలో కాల్చి చంపడం. పాండవుల అనంతరం పరీక్షిత్తు జనమేజయుడు చక్రవర్తులయ్యారు. అయితే మహాభారతం కథ ఆరంభంలో ఆది పర్వములోనే సర్పయాగం ఉదంతం వస్తుంది. నెైమిశారణ్యంలో సూతుడు శౌనకాది మునులకు సర్పయాగం గురించి చెప్పాడు. ఉదంకోపాఖ్యానంతో ఈ వృత్తాంతం ప్రాంభమవుతుంది.పెైలుడు అనే మహర్షి శిష్యుడు ఉదంకుడు. అతను ఒకమారు గురుపత్ని కోరికపెై మహిమాన్విత కుండలాలు తీసుకొని వెళుతుండగా వాటిని తక్షకుడు అపహరించాడు. అందువలన అతను తక్షకుని పట్లా, నాగజాతిపట్లా కుపితుడయ్యాడు. జనమేజయుని వద్దకు వెళ్లి సర్పయాగం చేయమని ప్రోత్సహించాడు. జనమేజయుని తండ్రి పరీక్షిత్తు తక్షకుని విషాగ్నికి బలి అయిన సంగతి గుర్తు చేశాడు. జరిగిన వృత్తాంతం సాక్ష్యాలతో సహా తెలుసుకొన్న జనమేజయుడు సర్పయాగానికి ఆజ్ఞ ఇచ్చాడు. (ఇక్కడ భారతంలో గరుత్మంతుని వృత్తాంతం కూడా చెప్పబడింది.)
సర్పయాగం తీవ్రంగా సాగింది. హోతలు మంత్రోచ్ఛారణ చేస్తుంటే ఎక్కడెక్కడి నాగులు హోమంలో తగులబడిపోసాగాయి. కాని తక్షకుడు ఇంద్రుని ఆశ్రయించి ఉన్నాడు. సహేంద్ర తక్షక స్వాహా అని హోతలు విధివిహితంగా మంత్రోచ్ఛారణ చేయగానే తక్షకునితోపాటు ఇంద్రుడు కూడా యజ్ఞగుండం వెైపు జారిపోనారంభించాడు. వాసుకి సోదరి జరత్కారువు. ఆమె భర్త జరత్కారుడు. వారికి ఆస్తీకుడనే బిడ్డ నాగజాతి రక్షణార్ధం కారణజన్ముడెై జన్మించాడు. సరిగా తక్షకుడు మంటలలో పడబోయే సయానికి ఆస్తీకుడు అక్కడికి వెళ్లి, జనమేజయుని మెప్పించి, దక్షిణగా యాగాన్ని నిలుపు చేయమని కోరాడు. సత్యదీక్షాపరుడెైన జనమేజయుడు యాగాన్ని ఆపించేశాడు. మహాభారతంలో ఈ యాగసందర్భంగా చెప్పబడిన సుపర్ణుని (గరుత్మంతుని) కధ విన్నవారికి శ్రీ సంపదలు కలుగుతాయని, పాపము నశిస్తుందని, సర్ప-రాక్షస బాధలు తొలగుతాయని ప్రతీతి. అలాగే ఆస్తీకుని కధ విని, ఆస్తీకుని స్మరిస్తే వారికి నాగజాతివలన ఎటువంటి ప్రమాదమూ కలుగదని, విషజ్వరాధికాలు సోకవని వాసుకి ఆస్తీకునికి వరమిచ్చాడు. ఈ సర్పయాగం కధ ఆ సమయంలో కురువంశపు రాజులకు, నాగజాతి వారికి జరిగిన సంఘర్షణకు కధాకల్పితరూపమని కొందరి అభిప్రాయం.
పుత్రకామిష్టి యాగం : నాడు దశరత మహారాజు ఈ యగా ఫలంగానే శ్రీరాముడుచ లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నలను ఆధర్శ సంతానంగా పొందినట్లు రామాయణం చెబుతున్నది. ఈ యాగంలో బలమైన వేదమంత్రాలు, వెైదిక విధానం ఈ సౌమ్యయాగంలో అంతర్లినంగా ఉంటాయి. క్రతువులో పాల్గొనే దంపతులకు ఋత్విక్కులు యజ్ఙద్రవ్యం ఇచ్చి వేదమంత్రాలు చదువుతారు. ఆ యజ్ఙద్రవ్యాన్ని హోమగుండంలో వెయిస్తారు. యజ్ఙద్రవ్యం ప్రసాదం భర్త చేతి నుంచి భార్యకు ఇప్పిస్తారు. భార్య నమలకుండా దాని అలాగే మింగివేయాలి. ఇలా చేసిన వారికి అనారోగ్యాల బారిన పడకుండ ఉండవచ్చు. సంతాన ప్రాప్తి కలుగుతుంది. రామాయణంలో దశరతుడు జరిపిస్తాడు. విశ్వమిత్రుని తండ్రి కుశనాభుడు పుత్రకామిష్టియాగ ఫలితంగా జన్మించాడు.
రాజాసూయయాగం : ద్వాపర యుగంలో ధర్మారాజు రాజాసూయయాగాన్ని జరిపిస్తాడు.అతనికి సహాయంగా వెళ్లిన కృష్ణుడు బీమునితో తన శత్రువు జరాసందుని చంపిస్తాడు. దాంతో ధర్మరాజు ద్విగిజయంగా యాగాన్ని జరిపిస్తాడు. ఖాండవ ప్రస్థాన్ని యముడు అతిలోక సౌందర్యంతో తీర్చిదిద్దాక, రాజ్యం సుభిక్షంగా వర్ధిల్లుతూండగా, యదిష్టురుడు రాజాసుయయాగం చేస్తాడు.
విశ్వజిత్ యాగం : ఒక్క రొజులో పూర్తి కావలిసిన యాగం. ఇందులో యజమాని తన మొత్తం ఆస్తిని దానం చేయవలసి ఉంటుంది.ప్రహ్లదుని మనుమడు వరోచనుడు అ వరోచనుని కుమారుడు బలి. గురువెైన శంకరచార్యుల వారి బలి చేత ‘విశ్వజిత్’ అనే యాగం చేయించాడు. ఈ విశ్వజిత్ యాగాన్ని సాధారణంగా చాలా తక్కువగా నిర్వహిస్తుంటారు.
వరుణయాగం : సాధారణంగా ఈ యాగం వర్షాలు పడనప్పుడు ఎక్కువగా ఇలాంటి యాగాలు చేస్తుంటారు. చేసిన తరువాత వర్షాలు వస్తాయనేది ఒక నమ్మకం. పూర్వకాలంలో ఋషులతో రాజులు ఎక్కువగా చేయిస్తుండేవారు. వర్షాలు రానప్పుడు జపాలు చేయడం అనేది అనవాయితీగా మారింది. చాలా సార్లు ఇలా చేసినప్పుడు వర్షం రావడంతో వరుణ దేవుడు యాగంతో కరుణించి వర్షాన్ని పంపించాడు అనేది నమ్మకం రాజాశేఖర్‌రెడ్డి కాలంలో వర్షాలు రానప్పుడు రాష్ట్ర ముఖ్యమ్రంతిగా వరుణయాగం జరిపించాడు. జరిపించిన అనంతరం వర్షాలు రావడం పలువురిని అశ్చర్యనికి గురి చేసింది.