Pages

ఏ చిత్రపటాలు ఇళ్లల్లో ఉంచాలి ?


గృహంలో శుభఫలితాలు అందించే దేవతామూర్తుల పటాలను, ప్రతిమలను మాత్రమే ఉంచాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. శాంతిమూర్తులైన దేవతల బొమ్మలను గృహమునందుంచితే అషై్టశ్వర్యాలు, సుఖ సంతోషాలు చేకూరుతాయని వారు చెబుతున్నారు. సరస్వతీ దేవి, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి చిత్రాలను గృహంలో ఉంచితే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా ఇంట్లోని దేవుని పటాలకు గానీ, ప్రతిమలకు గానీ ప్రతినిత్యం లేదా వారానికి రెండు సారై్లనా కర్పూర హారతులు సమర్పించుకోవాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలాగాకుండా ఎక్కడపడితే అక్కడ దేవుని పటాలను తగిలించి, పూజగదిలోని విగ్రహ, పటాలకు మాత్రమే పూజచేయడం కూడదని వారు సూచిస్తున్నారు. అలాగే అద్దం పగిలిన ఫ్రేములు, విరిగిపోయిన లేక జీర్ణమయిన రాతి శిల్పాలు...తుప్పు పట్టిన లేక చెదలుపట్టిన ఫొటోలు ఇళ్లల్లో ఉంచకూడదు. ఒక వేళ వాటన్నింటినీ పారవేయాలంటే దగ్గరలో ఉన్న ఏదైనా తటాకమునందుగానీ, ప్రవహించే నదీ జలాలలోగానీ సంస్కారం చేయాలి. అలా కుదరకపోతే దగ్గరలో ఉన్న గుడి ప్రాంగణంలో ఏదైనా చెట్టుకింద వదిలిపెట్టి రావాలి. ఇకపోతే.. కాళిమాత వంటి సంహార దేవతల బొమ్మలను గృహము నందు ఉంచకూడదు. అదేవిధంగా ఉగ్రరూపం దాల్చిన దేవతల పటాలు ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అలాగే నెమలి వాహనంపై సుబ్రహ్మణ్యస్వామి విహరించే బొమ్మను, సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉన్న వేలాయుధం ఆయన భుజానికి పైన ఉండే ఫోటోలను ఇంట్లో తగిలించకండి