Pages

ఉమ్మ నీరు ఎక్కువగా ఉంటె ప్రమాదమా...?

ఉమ్మనీరు ఎక్కువైతే...

గర్భిణీల్లో ఉమ్మనీరు ఎక్కువైతే ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. వీరిలో ఉమ్మనీరు ఎక్కువవడాన్ని పాలిహైడ్రామినెస్‌ అని అంటారు. గర్భిణీల్లో ఉమ్మనీరు ఎక్కువైతే పుట్టబోయే బిడ్డతో పాటు తల్లికి సైతం పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీన్ని దృష్టిల్లో పెట్టుకొని గర్భిణీలు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

గర్భిణీ మహిళల్లో ఉమ్మనీరు 200మి.లీ.ల కంటే ఎక్కువగా ఉంటే పలు సమస్యలు ఎదురవుతాయి. పాలిహైడ్రామినెస్‌ వ్యాధిగా పేర్కొనే ఈ వ్యాధి నేడు మహిళల్లో 0.5 నుంచి ఒక శాతం వరకు కనిపిస్తుంది. ఇక ఈ వ్యాధి మొదటి ప్రెగ్నెన్సీ కంటే రెండవ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా కనిపిస్తుంది. గర్భిణీల్లో తయారైన ఉమ్మనీరు కంటే గ్రహించే ఉమ్మనీరు తక్కువైనప్పుడు పాలిహైడ్రామినెస్‌ ఏర్పడుతుంది. 


ఆరోగ్య సమస్యలు... 
గర్భిణీల్లో ఉమ్మనీరు ఎక్కువైనప్పుడు పుట్టబోయే శిశువుపై ప్రభావం పడుతుంది. వారికి పుట్టే పిల్లలు అవయవ లోపాలతో జన్మించవచ్చు. పిల్లలకు వెన్నుముక, తలలో సమస్యలు ఉండవచ్చు. శిశువు పేగులు కూడా మూసుకుపోయి ఉండే అవకాశాలు ఉంటాయి. గర్భిణీలకు మాయలో సమస్య ఉంటే ఉమ్మనీరు ఎక్కువగా ఉంటుంది. గర్భిణీలకు కవలలు పుడుతుంటే వారికి ఉమ్మనీరు ఎక్కువగా ఉంటుంది. తల్లికి షుగర్‌ ఉంటే ఉమ్మనీరు ఎక్కువగా ఏర్పడుతుంది. కాలేయం, గుండె సమస్యల ఉన్న వాళ్లకి కూడా పాలిహైడ్రామినెస్‌ రావచ్చ

ఎలా తెలుసుకోవచ్చు... 
ఉమ్మనీరు ఎక్కువైనప్పుడు గర్భిణీల్లో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. పొట్టసాగడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. గర్భిణీలకు గుండెల్లో దడ కూడా ఉంటుంది. కాళ్లవాపులు కూడా వస్తాయి. కాళ్ల నరాలు కూడా ఉబ్బుతాయి. పైల్‌‌స కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గర్భిణీలకు బిపి కూడా ఉండవచ్చు. ఉమ్మనీరు ఎక్కువైనప్పుడు పొట్ట ఉబ్బినట్టు ఉంటుంది. పొట్టపై చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అబ్డామిన్‌ కొలతలు బాగా పెరుగుతాయి. 

పరీక్షలు... 
గర్భిణీలకు అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేస్తే కడుపులో ఉమ్మనీరు లెవెల్‌‌స తెలుస్తాయి. దీంతో పాటు పుట్టబోయే బిడ్డకు వెన్నెముక, గుండె సంబంధిత సమస్యలు కూడా తెలుసుకోవచ్చు. వీరు షుగర్‌ టెస్‌‌ట చేసుకోవాలి. ఓవరీన్‌ సిస్‌‌ట ఉంటే పొట్ట పెద్దగా ఉంటుంది. స్కాన్‌ చేసినప్పుడు వెంటనే తెలిసిపోతుంది. 

డెలివరీ సమయంలో... 
ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే కాన్పు సమయంలో తల్లికి ఫిట్‌‌స రావచ్చు. బిపి కూడా వస్తుంది. కొన్నిసార్లు బేబీ అడ్డంగా మారడం, తలపైకి ఉండడం జరుగుతుంది. ఉమ్మనీరు ఎక్కువైతే కొన్నిసార్లు నెలలు నిండకముందే డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాన్పు సమయంలో బ్లీడింగ్‌ కూడా అవుతుంది. వాటర్‌ లీక్‌ కూడా అవ్వచ్చు. శిశువు పేగు బయటకు రావచ్చు. గర్భాశయం తొందరగా మూసుకోదు. డెలివరీ సమయంలో నొప్పులు సరిగా రాకపోవచ్చు. లోపల మాయ ఉండిపోవడం జరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు కూడా వస్తాయి. రక్తహీన…త ఏర్పడుతుంది. శిశువు అవయవాల లోపంతో పుట్టే అవకాశాలు ఉన్నాయి. 

జాగ్రత్తలు... 
పాలిహైడ్రామినెస్‌ను రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి మైల్‌‌డ కాగా రెండవది సీరియస్‌గా పరిగణిస్తారు. సీరియస్‌గా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి అవసరమైతే ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది. పేషెంట్‌కు విశ్రాంతి అవసరం. బిపి, షుగర్‌ కంట్రోల్‌ చేయాల్సి ఉంటుంది. తొమ్మిది నెలలు నిండితే వెంటనే డెలివరీ చేయాలి. బేబీకి అవయవాల లోపం ఉంటే నెలలు నిండకముందే అబార్షన్‌ చేయాల్సి ఉంటుంది. కాన్పు జరిగే సమయంలో తొందరగా నీరు పోకుండా చూసుకోవాలి. పేగు జారకుండా, బ్లీడింగ్‌ కాకుండా జాగ్రత్త పడాలి. ఉమ్మనీరు ఎక్కువైతే కొన్నిసార్లు నీరు తీసివేసి కాన్పు చేస్తారు.