Pages

ప్లాస్టిక్‌ కిచెన్‌వేర్‌ తయారి పరిశ్రమ


ఆధునిక మహిళలు ఇంటిని, మరీ ముఖ్యంగా వంటింటిని అందంగా ఉంచడానికి ఇష్టపడుతున్నారు. 

అందుకోసం ఆకర్షణీయమైన డిజైన్లు, రంగులతో అందంగా కనిపించే ప్లాస్టిక్‌ కిచెన్‌వేర్‌, 
టేబుల్‌వేర్‌ ను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. 

కప్పులు, సాసర్లు, మూతలుగా ఉంచే ప్లేట్లు, బౌల్స్‌, స్పూన్లు, గరిటెలు, ఆహారం వడ్డించడానికి 
ఉపయోగించే పాత్రలు, డిన్నర్‌ సెట్లు వివిధ ప్లాస్టిక్‌ ఉత్పత్తుల వినియోగం ఇటీవల గణనీయంగా పెరుగుతన్నది.



మెలమైన్‌ పోమ్‌అల్‌ డిహైడ్‌ అనే థర్మో సెట్టింగ్‌ ప్లాస్టిక్‌ ముడి పదార్థంతో తయారుచేస్తున్న వివిధ రకాల కిచెన్‌వేర్‌, టేబుల్‌వేర్‌ ఉత్పత్తుల మార్కెట్‌ బాగా వృద్ధి చెందుతున్నది.

మిలమైన్‌ మౌల్డెడ్‌ ఉత్పత్తులు

- కేటరింగ్‌ ఉత్పత్తులు: ఆహారం వడ్డించడానికి ఉపయోగించే డిష్‌లు (పాత్రలు), పరికరాలు (ప్లేట్లు, స్పూన్లు, గరిటెలు మొదలైనవి)

- అవుట్‌డోర్‌ డైనింగ్‌: ప్లేట్లు, కప్పులు, పాత్రలు, ఇతర పరికరాలు.

- పిల్లల డైనింగ్‌ ఉత్పత్తులు: బౌల్స్‌, చిన్న ప్లేట్లు, కప్పులు.

- సంస్థలు ఉపయోగించే ఉత్పత్తులు: ఆస్పత్రులు, జైళ్లు, సైనిక దళాలు ఉపయోగించే టేబుల్‌వేర్‌, సర్వింగ్‌ డిష్‌లు, పాత్రలు

మిలమైన్‌ కిచెన్‌ టేబుల్‌వేర్‌ ప్రయోజనాలు

- అన్‌ బ్రేకబుల్‌ (త్వరగా పగలవు)

- వాసన ఉండదు

- వేడిని, విద్యుత్‌ షాకును తట్టుకోగలవు.

- గీతలు పడే అవకాశం ఉండదు.

- బరువు తక్కువగా ఉంటాయి.

- టాక్సిక్‌ లక్షణాలుండవు.

- రంగులు పోకుండా ఉండి, అనేక ఆకర్షణీయమైన రంగుల్లో తయారీ సాధ్యం.

- ఆకర్షణీయమైన డిజైన్లలో తయారీ సాధ్యం.

- స్టీల్‌, గాజు ఉత్పత్తులతో పోలిస్తే ధర కూడా తక్కువగా ఉంటుంది.
పై అనుకూల కారణాల వల్ల నేడు సంప్రదాయ కిచెన్‌, టేబుల్‌వేర్‌ స్థానంలో ప్లాస్టిక్‌తో చేసిన 
అందమైన ఉత్పత్తుల వాడకానికి ఇష్టపడుతున్నారు.

అవసరమైన యంత్ర పరికరాలు
ప్రత్యేక పద్ధతిలో తయారుచేసే ఈ ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీ పరిశ్రమకు అవసరమైన యంత్ర 
పరికరాలు- హైడ్రాలిక్‌ ప్రెస్‌, మోల్డ్‌లు, ఇమ్‌ప్రిగ్‌నేషన్‌ యూనిట్‌, ఎలక్ర్టిక్‌ ఓవెన్‌, తూనిక 
యంత్రాలు, స్ర్కాప్‌ గ్రైండర్‌, బఫ్పింగ్‌ మిషన్‌, ఇతర పరికరాలు


ముడి పదార్థాలు

మిలమైన్‌ పోమ్‌అల్‌ డిహైడ్‌, ఫిల్లర్స్‌, అడెటివ్స్‌, ప్యాకింగ్‌ మెటీరియల్స్‌.


మార్కెట్‌ అవకాశాలు

దేశీయ కిచెన్‌, టేబుల్‌వేర్‌ ఉత్పత్తుల మార్కెట్‌ 2008లో రూ.1086 కోట్లు ఉండగా, దానిలో మిలమైన్‌

 ఉత్పత్తులు 13 శాతం వాటా కలిగి ఉండి రూ.141 కోట్ల విలువ గల మార్కెట్‌ ఉన్నది.

ఇది ప్రతి సంవత్సరం 12 శాతం వరకు వృద్ధి చెందుతూ ప్రస్తుతం రూ.280 కోట్లకు పెరిగింది. 
దీనిలో దాదాపు 25 శాతం మార్కెట్‌ను అవ్యవస్థీకృత రంగంలో ఉన్న తయారీ సంస్థలు తమ 
వాటాగా కలిగి ఉన్నాయి. 

విద్యావంతులైన గృహిణుల సంఖ్యలో వృద్ధి, ప్రజల ఆదాయంలో వృద్ధి, రిటైల్‌ స్టోర్స్‌లో ఉత్పత్తుల 
లభ్యతలో వృద్ధి వంటి అనేక కారణాల వల్ల వివిధ డిజైన్లతో కూడిన, ఆకర్షణీయమైన మిలమైన్‌ 
కిచెన్‌, టేబుల్‌వేర్‌ ఉత్పత్తుల వినియోగం పెరుగుతున్నది. సృజనాత్మకత ఉన్న యువతీ
 యువకులకు ఈ ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీ ఒక మంచి స్వయంఉపాధి అవకాశం అవుతుంది.


పరిశ్రమ వ్యయం



- కేవలం 12 మిల్స్‌ ప్లేట్స్‌ తయారీ పరిశ్రమ

ఉత్పత్తి సామర్థ్యం: నెలకు 10వేల ప్లేట్లు (250 గ్రా. బరువు)
పరిశ్రమ వ్యయం: రూ.18.00 లక్షలు

- ప్లేట్లు, బౌల్స్‌, గరిటెలు, స్పూన్‌లు తయారుచేసే
సమగ్ర పరిశ్రమ

ఉత్పత్తి సామర్థ్యం: రోజుకు 300 కేజీలు

పరిశ్రమ వ్యయం: రూ.60.00 లక్షలు