Pages

వెంట్రుకలు - నమ్మకాలు



ఎన్నో నమ్మకాలమధ్య, అంధవిశ్వాసాలమధ్య భారతీయులు పెరుగుతారు. తరతరాల నుంచి ఈ నమ్మకాలూ, విశ్వాసాలు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతున్నాయి. కొన్ని సైంటిఫిక్ గా నిరూపితమైతే మరికొన్ని కేవలం అంధవిశ్వాసాలుగానే మిగిలి ఉన్నాయి. కొని కేవలం అపోహలుగానే మిగిలాయి. అయినా ఆచారాలలో వీటిని పాటించడాన్ని అలవాటు చేశారు కాబట్టి అపోహలైన పాటించాల్సి వస్తోంది.
దేశం ఆధునీకరణ వల్ల కొత్త తరం కొన్నిటిని విశ్వాసాలను అంధ విశ్వాసాలుగా కొట్టిపారేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా కొన్ని విశ్వాసాలు అలాగే ఉన్నాయి.
వాటిని తప్పకుండా పాటించాలి అన్న రూల్ సైంటిఫిక్ గా లేకపోయినా కొన్ని విశ్వాసాలు మనల్ని కొంచెం గందరగోళం కలిగిస్తాయి. వాటిని పాటించకపోతే 'అయ్యో ఏమవుతుందో' అనే భావనను కలిగిస్తాయి.
అటువంటి ఒక విశ్వాసం కురులకు సంబంధించినది. సూర్యాస్తమయంలో శిరోజాలను దువ్వకూడదని తల్లులెప్పుడూ తమ కుమార్తెలకు చెప్తూ ఉంటారు. చాలా మంది మహిళలు సూర్యాస్తమయం తరువాత తమ శిరోజాలను విప్పరు. ఈ విశ్వాసంతో పాటు మరెన్నో విశ్వాసాలు జుట్టుకు సంబంధించినవి ఉన్నాయి.
సూర్యాస్తమయం తరువాత కురులను ముట్టుకోకూడదని ఎందుకంటారో తెలుసుకుందాం. అలాగే జుట్టుకు సంబంధించిన మరికొన్ని విశ్వాసాల గురించి కూడా తెలుసుకుందాం.
సూర్యాస్తమయం తరువాత కురులను దువ్వకూడదు 
చెడు శక్తులు బయట సంచరిస్తూ ఉంటాయి కాబట్టి సూర్యాస్తమయం తరువాత శిరోజాల్ని దువ్వకుడదని అంటారు. ఈ సమయంలో చెడు శక్తులకి శక్తి ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. అందమైన, పొడవాటి కురులు కలిగిన మహిళలను అవి లక్ష్యంగా చేసుకుంటాయని నమ్ముతారు.
జుట్టు విప్పుకుని ఉండకూడదు 
మహిళలు జుట్టు విప్పుకుని ఉండకూడదని అంటారు. మహిళలు గట్టిగ జడవేసుకుని ఉండాలని సూచిస్తారు. సూర్యాస్తమయం తరువాత జుట్టు విప్పుకుని ఉండకూడదని మహిళలకు సూచిస్తారు. అలాగే, పూజ చేసే సమయంలో కూడా మహిళలు కురులు విప్పుకుని ఉండకూడదు. మహిళలు జుట్టు విప్పుకుని ఉండడాన్ని చెడు శకునంగా భావిస్తారు.
ఊడిపోయిన కురులను జాగ్రత్తగా పారవేయడం
కురులను దువ్వుకుని జడ వేసుకున్న తరువాత చేతిలోకి వచ్చిన జుట్టును పారవేసే ప్రదేశం గురించి కూడా రకరకాల నమ్మకాలూ ఉంటాయి. కురులను జాగ్రత్తగా సరైన ప్రదేశంలో పారవేయాలని అంటారు. ఆ కురులు గనక చెడు ఉద్దేశ్యం కలిగిన వ్యక్తుల చేతులలో పడితే మీరు వారి చెడు చేష్టలకు బలవుతారు.
పౌర్ణమి నాడు కురులను దువ్వకూడదు 
పౌర్ణమి రాత్రి నాడు కురులను దువ్వుకోకూడదని అంటారు. పౌర్ణమి రాత్రినాడు కిటికీ పక్కగా నిల్చుని కురులను దువ్వుకోవడాన్ని తమను వశంచేసుకోమని చెడు శక్తులకు ఆహ్వానం పలకడమేనని అంటారు.
బహిష్టున్న మొదటి రోజు కురులను కడగడం 
బహిష్టు సమయంలో మొదటి రోజున తలస్నానం చేయకూడదు. అలా చేస్తే పిచ్చెక్కుతారని అంటారు. అలాగే బహిష్టు సమయంలో రాత్రి పూట తలస్నానం చేస్తే అధికంగా రక్తాన్ని కోల్పోతారు. తద్వారా చాలా నీరసంగా ఉంటారు. అనారోగ్యంగా వెంటాడుతుంది.
దువ్వెన జారిపోవడం 
కురులను దువ్వేటప్పుడు దువ్వెన చేయి జారి కిందపడిపోతే ఏదో ఒక పెద్ద నిరాశాజనకమైన వార్తని వింటారని అంటారు.
ఇంట్లో కురులు పడి ఉండడం 
జడ వేసుకున్నతరువాత చిక్కును తీసుకుని బయట జాగ్రత్తగా పడేయాలి. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వెంట్రుకలు పడి ఉంటే ఇంట్లో వాళ్ళ మధ్య కొట్లాటలు జరుగుతాయని అంటారు.