Pages

ఒంటిమిట్ట ( ఏకశిలా నగరము ) Vontimitta



ontimitta కోసం చిత్ర ఫలితం

ఒక మిట్ట పైన ఈ రామాలయం నిర్మించబడింది. అందుకని ఒంటిమిట్ట అని గ్రామానికి పేరు వచ్చింది.
త్రేతాయుగంలో ఈ ప్రాంత పరిసరములందు మునులు తపస్సులు, యాగములు నిర్వహిస్తూ ఉండేవారు. వారిలో మృకుండమహర్షి, శృంగి మహర్షి యాగం నిర్వహిస్తున్నప్పుడు రాక్షసులు యాగం జరగకుండా ఆటంకపరిచారు. అప్పుడు ఆ మహర్షులు రాములవారిని గూర్చి ప్రార్థించగా, ఆయన పిడిబాకు, కోదండములతో ఇక్కడికి వచ్చినారు. కావున ఇచ్చట రాములవారికి కోదండరామస్వామి అని పేరు వచ్చింది.
ఇమాంబేగ్ బావి కోసం చిత్ర ఫలితం

ఈ పరిసరప్రాంతాల్లో వన్యప్రాణులకు మరియు జంతుజాలములకు నీళ్లు లేవని , రాములవారు సీతాదేవికి దాహంగా ఉందని గ్రహించి రాములవారు బాణం వేయగా ఇచ్చట నీళ్లుపడినవి. ఆ నీళ్ళు పడినచోట "రామతీర్థము అనియు, లక్ష్మణుడు బాణం వేయగా పడిన తీర్థమునకు లక్ష్మణతీర్థము అని పేరువచ్చినవి. అవి ఇప్పటికీ ఉన్నాయి

ontimitta కోసం చిత్ర ఫలితం
అలాగే ఒంటిమిట్టకు సమంధించిన మరొక కథ కూడా ప్రచారం లో ఉంది 
ఒకప్పుడు  ఈ ప్రాంతంలో ఒంటోడు , మిట్టడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ పరిసరగ్రామాల్లో దోపిడిలు చేసి తెచ్చిన వస్తువులను ఇచ్చట ఉన్న గుహల్లో దాచేవారు. అప్పుడు ఆ గుహలో ఏకశిలపై ఉన్న సీతారామలక్ష్మణులు వారికి హితోపదేశం చేసి నిజాయితీగా బ్రతకమని ఆదేశించారు. అప్పుడు వారికి మనస్సు మారి ఆ ఇద్దరు అన్నదమ్ములు ఆ విగ్రహాలకు గర్భగుడి అంతరాలయము నిర్మించారు. ఆ కారణం చేత ఆ దొంగల పేరు మీద ఈ గ్రామానికి "ఒంటిమిట్ట" అని పేరు స్థిరపడినది. 
ఈ దేవస్థానము 3 దఫాలుగా నిర్మించినట్లు తెలుస్తుంది. గర్భగుడి అంతరాలయము ఒకసారి, ముఖమండపము ఒకసారి, గాలిగోపురం ఒకసారి ఈ విధంగా నిర్మించినట్లు దేవస్థాన శాసనాల ద్వారా తెలుస్తుంది. 
ontimitta కోసం చిత్ర ఫలితం
మొదటి శాసనం క్రీ.శ. 1555 సంవత్సరములో కల్లూరి లింగయ్య అనే గ్రామాధికారి వేయించారు. ఇందులో విజయనగర పాలకుడైన వీరసదాశివ దేవరాయల సామంతుడు మండలాధీశుడైన ఎత్తి తిరుమలయ్య దేవమహారాజు పులపుత్తూరు గ్రామాన్ని, కంచిరాజు మాత్రజయ్య బోగేపల్లి గ్రామాలను కొన్ని వరిమళ్లను దేవాలయానికి దానం చేశారు.
క్రీ.శ. 1558లో రెండవ శిలాశాసనం సీమాధికారిద్వారా వేయించబడింది. దీని ప్రకారం ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయ గోపుర ప్రాకార నిర్మాణాలకు, రథం బ్రహ్మోత్సవాల నిర్వహణకు గుత్తి యెర తిరుమల రాజయ్య, జాబిక్రాజి కుమారుడైన నాగరాజయ్య దేవమహారాజులు ఒంటిమిట్ట గ్రామాన్ని ఈ గ్రామమునకు చెందే పల్లెలను, చతుస్సీమలకు లోనైన పొలాలన్నీ దానంగా ఇచ్చారు
ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. ఇమాంబేగ్ 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నభీకాన్ ప్రతినిథి. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా? అని ప్రశ్నించాడు. చిత్తశుద్ధి తో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానమివ్వగా, ఆయన మూడు సార్లు రాముని పిలిచాడు. అందుకు ప్రతిగా మూడు సార్లు ఓ అని సమాధానం వచ్చింది. ఆయన చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. స్వామి భక్తుడిగా మారిపోయాడు. అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించడం జరిగింది. ఆయనపేరు మీదుగానే ఈ బావిని ఇమాంబేగ్ బావిగా వ్యవహరించడం జరుగుతుంది.

క్రీ.శ. 1652 సం||లో ఫ్రెంచి యాత్రికుడు టావర్నియర్‌ ఒంటిమిట్టని దర్శించారు
తాళ్ళపాక అన్నమాచార్యుల కోసం చిత్ర ఫలితం

తాళ్ళపాక  అన్నమాచార్యులవారి జన్మస్థానమునకు ఒంటిమిట్ట 30 కి.మీ. దూరము.

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కోసం చిత్ర ఫలితం
 శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు శ్రీకోదండరామస్వామిని దర్శించి స్వామివారి కృపకు పాత్రులైనారు.