కవల పిల్లలైనా, అంతకంటే ఎక్కువ మందైనా ఒకే మారు పుట్టడానికి అండాల విడుదలే కారణం. సాధారణంగా అమ్మాయి రసజ్వల అయినప్పటి నుంచి బహిస్టు అయిన ప్రతి నెల ఒక అండం విడుదల అవుతుంది.
అదే సమయంలో మగవారిలోని వీర్య కణాలతో కలసి ఫలదీకరణం చెంది పిల్లలు పుడుతారు. సాధారణ పరిస్థితులలో ఇలా జరుగుతుంది. అండం విడుదల అనేది ఒక్క నెల ఎడమ అండాశయం నుంచి విడుదలైతే, మరో నెల కుడివైపు అండాశయం నుంచి జరుగుతుంది.
ఇది ఒక్కొక్కమారు రెండు అండాశయాల నుంచి అండాలు విడుదల అవుతాయి. ఈ అండాలను రెండు వీర్యకణాలు వేర్వేరుగా కలవడం వలన రెండు ఫలదీకరణాలు జరుగుతాయి. ఫలితంగా కవలలు జన్మిస్తారు.
ఇక్కడ ఇద్దరు మగ లేదా ఇద్దరు ఆడ లేదా ఒక ఆడ, ఒక మగ పుడుతారు. కవలలు జన్మనివ్వడమనేది వంశపారంపర్యంగా కూడా జరిగే అవకాశం ఉంటుంది.
అండం ఫలదీకరణం చెందినా రెండు భాగాలుగా విడిపోతుంది. అపుడు కూడా ఇద్దరు పిల్లలు పుడుతారు.
ఈ సందర్భంలో ఇద్దరు పిల్లలు పుడితే దాదాపుగా ఒకే పోలికలు కలిగి ఉంటారు. ఈ సందర్భంలో పుడితే ఇద్దరూ ఆడ లేదా ఇద్దరూ మగ పిల్లలు పుడతారు.
కాబట్టి అందరు దంపతులకు కవలపిల్లలు పుట్టరు. కవలలు వంశానుగతం అని నమ్మలేం.
మీకు కవలలను గర్భం దాల్చే పరిస్థితులు, లక్షణాలు ఉన్నప్పటికీ కవలలు పుట్టకపోవచ్చు. మీరు ఈ విషయాన్నీ అల్ట్రా సౌండ్ ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు.