Pages

రానా తో నిత్యామీనన్ రొమాన్స్- నెక్స్ట్ సినిమాలో నిత్యాకు చాన్స్


తెలుగు చిత్ర పరిశ్రమలో ఆరడుగుల అందగాడు దగ్గుబాటి రానా. ప్లేబాయ్‌గా పేరున్న ఈ యంగ్ హీరో ఎప్పటికప్పుడు హీరోయిన్లతో ప్రేమాయణం నడుపుతుంటాడు. తాజాగా రానా మలయాళ కుట్టి నిత్యామీనన్‌పై మనసు పడ్డాడని టాలీవుడ్ టాక్. ఆమె ఇటీవల నటించిన ఓకే బంగారం సినిమాలో చేసిన రోమాన్స్ అట. మొన్నటి వరకు తెరపై పద్దతిగా కనిపించిన ఈ బ్యూటీ మణిరత్నం సినిమాలో మాత్రం తెగ రెచ్చిపోయింది. దాంతో ఇప్పుడు రానా మనసు ఆమెపై పడిందని సమాచారం. 

ప్రస్తుతం 'బెంగుళూర్ డేస్' రీమేక్‌లో బిజీగా ఉన్న రానా ఆ తర్వాత సొంత బ్యానర్‌లో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో నిత్యామీనన్‌ను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు సమాచారం. 

ఈ సినిమాలో వీరిద్దరూ ఎలా రోమాన్స్ చేస్తారో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.