పళ్ళు పీకమంటే చాలు.. పేరు మోసిన దంత వైద్యుడిలా పీకి చేతిలో పెడుతుందా చిలుక..! పీకవే చిలుకా.. ! అంటే చాలు ఆలస్యం చేయకుండా దంతాలను తీసేస్తుంది. అమెరికాలోని వాషింగ్టన్ లో చాలా మంది ఈ డెంటిస్టు పారెట్ కోసం క్యూ కడుతున్నారట. వివరాలివి. ఇది డెంటిస్టు ప్యారెట్. అనగా.. పళ్లు పీకే రామచిలక. అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన ఆంటన్ ఆండ్రోషుక్ అనే కుర్రాడి పెంపుడు చిలక ఇది. నేర్పుగా దంతాలను పీకటంలో ఎక్స్‌పర్ట్. ఎంచక్కా, తన యజమాని భుజాలపై వాలి తన ముక్కుని అతగాడి నోట్లోకి దూర్చి.. కదులుతున్న పన్ను ఏదైనా ఉంటే దాన్ని గుర్తించి, నెమ్మదిగా పీకేస్తుంది. అందుకే.. ఆంటన్ ఇప్పటికే దీని సాయంతో ఆరుసార్లు పళ్లు పీకించుకున్నాడు. రెండోసారి అది పన్ను పీకుతున్నప్పుడు వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టాడు. ఆ వీడియోకి హిట్లే హిట్లు.
మరిన్ని విశేషాల కోసం :