Pages

‘ధనలక్ష్మి తలుపు తడితే’ మీరేం చేస్తారు?




DTT Contest

ధనలక్ష్మి తమ తలుపు తట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకొంటారు, కలలుగంటారు? అనూహ్యరీతిలో ఆ అద్భుతం ఆవిష్కారమైతే మీరేం చేస్తారో అత్యంత ఆసక్తికరంగా ఓ రెండు వాక్యాల్లో వివరించి` ‘ధనలక్ష్మి తలుపు తడితే’ ఆడియో ఫంక్షన్‌కు గెస్ట్‌ అయ్యే ఛాన్స్‌ను సొంతం చేసుకోమంటున్నారు చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. ఈనెల 5 సాయంత్రం హైద్రాబాద్‌లోని తాజ్‌ బంజారాలో ఈ వేడుక అత్యంత సందడిగా, పలువురు సెలబ్రిటీల సమక్షంలో జరగనుంది. ఆసక్తిగలవారు contest.dtt@gmail.com కు ‘ధనలక్ష్మి తలుపు తడితే’ మీరేం చేస్తారన్నది క్లుప్తంగా రెండే రెండు వ్యాక్యాల్లో కుదించి పంపించండి.

మీ పేరు, అడ్రెస్‌, ఫోన్‌ నెంబర్‌ జోడిరచడం మర్చిపోకండి. జూన్‌ 5 మధ్యాహ్నం 3 గం॥ల వరకు ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్నవారి నుంచి ఓ నలుగురిని ఎంపిక చేసి, వారికి మెయిల్‌ మరియు సెల్‌ఫోన్‌ ద్వారా ఆహ్వానం పంపిస్తారు.
మరెందుకాలశ్యం..? ‘ధనలక్ష్మి తలుపు తడితే’ మీరేం చేస్తారో వెంటనే మెయిల్‌ చేయండి మరి!!