Pages

ఇంటి ఆవరణంలో తులసి మొక్క ఎక్కడుండాలి..?




ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కలలో ముందుగా చెప్పుకోవాల్సింది తులసి. గృహనికి చుట్టూ స్థలాన్ని ఏర్పాటు చేసుకొని పుహరాలు కట్టుకొన్న తర్వాత ఇంటికి ఆగ్నేయంలో, దక్షిణ నైరుతిలో, పశ్చిమ నైరుతిలో, పడమరలో, ఉత్తర వాయవ్యంలో తులసి కోటను కట్టుకోవచ్చు. దీనికి ఒక ప్రత్యేక స్థానం కల్పించాలి. ఉత్తరం, ఈశాన్యం లేదా ఇంటికి తూర్పు వైపుగా ఈ మొక్కను నాటుకోవచ్చు 

1. ఎంతో పవిత్ర మైన మొక్కగా భావించే తులసిని ఎక్కడ పడితే అక్కడ నాటడం సరికాదు. అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా వుండేలా మొక్కలను నాటకూడదు. వీటి వల్ల కూడా కుటుంబంలో లాభ నష్టాలు సంభవించే అవకాశం వుంది. అందుకే వీటిని సరైన స్థానాల్లో వుంచాలి. 

2. పెద్ద పెద్ద చెట్లు నాటుకోవాలనుకునేవారు ఇంటికి దక్షిణం లేదా పశ్చిమం వైపుగా నాటుకోవాలి. పొడువుగా ఏపుగా పెరిగే చెట్లను ఉత్తరం, ఈశాన్యం లేదా తూర్పు వైపుగా నాటడం మంచిది కాదు. దీని వల్ల కుటుంబంలో ప్రతికూల ప్రభావాలు కలిగే అవకాశం ఎక్కువగా వుంటుంది. 

3. అలాగే పొడుగ్గా పెరిగే చెట్లు నివాస భవనానికి దగ్గరగా వుండకూడదు. ఈ చెట్లు సూర్యుని నుండి వచ్చే కిరణాలను భవనంపై పడకుండా కప్పేస్తాయి. దీని వల్ల ఇంట్లో నివసించే వారికి కీడు జరిగే అవకాశం వుంటుంది. అందుకు కాస్త దూరంగానే వుంచాలి. చెట్టు నీడ భవనంపై పడకుండా జాగ్రత్తగా వుండాలి. 

4. అలాగే పెద్ద పెద్ద చెట్లను కూడా ఇంటికి దగ్గరగా వుండేలా వేయకూడదు. వీటి వేర్లు ఇంటి కాంపౌండ్‌ గోడ, భవన పునాదులకు నష్టం కలిగిస్తాయి. వీటితో పాటు ఈ చెట్లు సూర్యుని నుండి వచ్చే కిరణాలను అతి తొందరగానే గ్రహించి వేస్తాయి. వీటి వల్ల భవనానికి మంచి చేసే సూర్యుని కిరణాలు దానికి చేరకుండా పోతాయి. చెట్టు కొమ్మలు నివాసం వుంటున్న భవనానికి తగల కుండా జాగ్రత్త తీసుకోవాలి. 

5. ముళ్ళజాతి మొక్కలు అంటే నాగజెముడు, కలబంద వంటి మొక్కలు ఇంటికి సమీపంగా పెట్టకూడదు. కాక్టస్‌ జాతి మొక్కలు కూడా ఇంటికి దగ్గరగా నాటకూడదు. ముళ్లు కలిగిన మొక్కలు వ్యతిరేక ఫలితాలను కలిగించడంలో ముందుంటాయి. అందుకే వీటిని నాటుకోకపోవడమే మంచిది. ఒకవేళ వాటిని పెంచుకోవాలంటే ఇంటికి కాస్త దూరంగా ప్రత్యేక ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ పెంచుకోవాలి.