బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రఘుబాబు
ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఎలుకా మజాకా.
ఇది గమ్మత్తైన కథతో రూపొందుతుంది. ఎలుక పాత్రలో బ్రహ్మానందం
నటన ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది అన్నారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ నా దర్శకత్వంలో
సినిమా వచ్చి ఏడు సంవత్సరాలైంది. తెలుగు సినీ పరిశ్రమలో సాంకేతికంగా చాలా మార్పులు
వచ్చాయి. వాటితో పోటీపడి సినిమాలు చేయలేకపోయాను.
మురళీమోహన్‌రావు రచించిన ఎలుక వచ్చే
ఇల్లు భద్రం అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. తప్పకుండా విజయాన్ని
సాధిస్తుందనే నమ్మకముంది అన్నారు. దర్శకుడిపై ఉన్న నమ్మకంతో ఈ సినిమాలో నటించానని బ్రహ్మానందం
చెప్పారు.
మీరు మెచ్చిన మరిన్ని పోస్టులు :