తాప్సీ గతకొద్ది కాలంగా మాథ్యూబో అనే వ్యక్తితో చాలా సన్నిహితంగా వుంటుంది. వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని వార్తలొస్తున్నాయి. ఇందులో భాగంగానే తాప్సీ-మాథ్యూబో లకు మగబిడ్డ పుట్టాడని సోషల్ మీడియాలో తెగ వార్తలొస్తున్నాయి.
అంతేకాదు తాప్సీ తల్లి అయ్యిందని తెలిసి, మాథ్యూ బో బాడ్మింటన్ పోటీల నుంచి తప్పుకొని తాప్సీ, బిడ్డల కోసం తన సమయాన్ని కేటాయిస్తున్నాడంటూ వార్తలొచ్చాయి. దీంతో ఈవార్తలు విన్న తాప్సీ ఒక్కసారిగా ఖంగుతిందట.
అయితే ఈ వార్తలపై తాప్సీ ఓ క్లారిటీ ఇచ్చేసింది. తనకు తెలియకుండానే తనకు బిడ్డ ఎలా పుడతాడని తాప్సీ ప్రశ్నిస్తుంది. తాను తల్లినయ్యానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. మాథ్యూబో తాను మంచి స్నేహితులం మాత్రమేనని, అయితే బిడ్డ పుట్టింది మాథ్యూబో స్నేహితుడికి అంటూ తాప్సీ క్లారిటీ ఇచ్చేసింది.
మరి ఇప్పటికైనా ఈ వార్తలు ఆగుతాయో లేదో చూడాలి. తాప్సీ ప్రస్తుతం హిందీలో పలు చిత్రాల్లో నటిస్తుంది. అలాగే తమిళంలో కూడా వచ్చిన సినీ ఆఫర్లను బాగానే చేజెక్కించుకుంటుంది. ఇటీవలే ఈ అమ్మడు ప్రారంభించిన వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ బాగానే కొనసాగుతుంది.