Pages

200 కోట్లు : తెలుగులో 'బాహుబలి' ఇండస్ట్రీ రికార్డ్!

బాహుబలి కోసం చిత్ర ఫలితం

'బాహుబలి' సినిమా రిలీజైతే టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలవుతాయని అంతా ముందే ఊహించారు. ఎట్టకేలకు ఈ సినిమా సోమవారం(4వ రోజు).... 82 సంవత్సరాల టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం రూ. 83 కోట్లతో టాపులో ఉండేది. 

బాహుబలి చిత్రం కేవలం 4 రోజుల్లోనే ఈ రికార్డును బద్దలు కొట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు కలిపి 'బాహుబలి' 200 కోట్ల క్లబ్బులో చేరింది. తెలుగు వెర్షన్ 83 కోట్లకు పైగా వసూలు చేసింది. సినిమా బిజినెస్ మొత్తం పూర్తయ్యే వరకు వసూళ్లు భారీగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. 2009కి ముందు మహేష్ బాబు నటించిన 'పోకిరి' సినిమా ఇండస్ట్రీ రికార్డుగా ఉండేది.

2009లో వచ్చిన 'మగధీర' చిత్రం 9 రోజుల్లో ఆ రికార్డును బద్దలు కొట్టింది. తర్వాత 'అత్తారింటికి దారేది' చిత్రం మగధీర రికార్డు బద్దలు కొట్టడానికి దాదాపు 25 రోజుల సమయం తీసుకుంది. తాజాగా బాహుబలి కేవలం 4 రోజుల్లోనే 'అత్తారింటికి దారేది' రికార్డును బద్దలు కొట్టడం గమనార్హం. తొలి మూడు రోజుల్లో దాదాపు 160 కోట్లు వసూలు చేసిన 'బాహుబలి'.... సోమవారం(4వరోజు) ముగిసే సరికి 200 కోట్ల క్లబ్ లో చేరింది. విడుదలైన ప్రతి చోట బాహుబలి అంచనాలకు మించి వసూలు చేస్తోంది. 

బాహుబలి ఇందీ డబ్బింగ్ చిత్రం విడుదల రోజైన శుక్రవారం రూ. 5.15 కోట్లు వసూలు చేసింది. శనివారం ఏకంగా 7.09 కోట్లు, ఆదివారం 10.11 కోట్లు వసూలు చేసింది. హిందీ వెర్షన్ మొత్తం కలిపి రూ. 7.5 కోట్లు మించవని అనుకున్నారు. కానీ మూడు రోజుల్లోనే రూ. 22.35 కోట్లు వసూలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.