Pages

అమ్మాయి రమ్మంది కదా అని వెలితే ?

ammayi కోసం చిత్ర ఫలితం
వరంగల్ లోని ఓ ముఠా.. ఇలా మీడియా ముసుగులో ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున సొమ్ము గుంజుతోంది. అందుకు కొందరు అమ్మాయిలను వాడుకుంటున్నారు. ముందుగా కొందరు ప్రముఖులను సెలక్ట్ చేసుకుంటారు. 

వారి ఫోన్ నంబర్లకు అమ్మాయిలతో ఫోన్ చేయిస్తారు. అలా అమ్మాయిలతో పరిచయం  పెరిగేలా చేసి.. రాసలీలలకు ఉసికొల్పుతారు. ప్రముఖుల ఇంటికి అమ్మాయిలను పంపడం కానీ.. లాడ్జిలకు కానీ పిలిపిస్తారు. 

అమ్మాయిలతో ప్రముఖులు రాసలీల మొదలుపెట్టగానే కెమేరాలతో నకిలీ మీడియా రంగప్రవేశం చేస్తుంది. ప్రముఖుల, అమ్మాయిల దృశ్యాలు, మాటలు రికార్డు చేస్తారు. 

ఆ తర్వాత అవన్నీ మీడియాలో ఇస్తాం.. లేకుండా అడిగినంత ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. పరువుకు భయపడిన ప్రముఖులు వారు అడిగినంత ముట్టజెప్పుకుని బయటపడతారు.