Pages

షేర్ మార్కెట్ లోకి బాహుబలి 2 సినిమా షేర్లు

ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం ‘బాహుబలి 2’ సినిమాను నిర్మిస్తున్న ఆర్కా మీడియా సంస్థ తమ సంస్థకు సంబంధించిన షేర్లను విడుదల చేసి ఆ షేర్లను స్టాక్ ఎక్స్ చేంజ్ లలో కూడ లిస్టు చేయించడానికి ప్రయత్నాలను ఆ సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ చేస్తున్నట్లుగా అ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. 
bahubali 2 కోసం చిత్ర ఫలితం
అయితే ఈ వివరలాను ఈ సినిమా నిర్మాతలు అదేవిధంగా దర్శకుడు రాజమౌళి చాల గోప్యంగా ఉంచినట్లు టాక్. 500 కోట్ల కలక్షన్స్ మార్క్ ను దాటి సంచలనాలు సృస్టించిన ‘బాహుబలి’ క్రేజ్ తో ఈ సినిమాను తీసిన నిర్మాణ సంస్థ షేర్ మార్కెట్ లోకి ప్రవేశిస్తే భవిష్యత్ లో తాము తీయబోయే భారీ సినిమాలకు పెట్టుబడులకు సంబంధించి ఎటువంటి కొరత ఏర్పడకుండా చేయడమే కాకుండా ‘బాహుబలి’ సినిమా క్రేజ్ తో తమ షేర్ విలువ పెంచుకోవచ్చు అనే ఎత్తుగడ కూడ ఉంది అని అంటున్నారు.
bahubali 2 కోసం చిత్ర ఫలితం
అయితే రాజమౌళి మాత్రం మీడియాతో మాట్లాడుతూ ‘బాహుబలి 2’ బిజినెస్ కు సంబంధించి ఎన్నో ప్రతిపాదనలు మరెన్నో ఆలోచనలు ఈసినిమాను తీసిన నిర్మాతల ముందు ఉన్నాయనీ అయితే ఆ విషయాలను బయటకు చెప్పడానికి తన నిర్మాతలు ప్రస్తుతానికి ఇష్ట పడటం లేదని అంటున్నాడు. దీనిని బట్టి చూస్తూ ఉంటే భవిష్యత్ లో పెద్దపెద్ద కంపెనీ షేర్లులా ‘బాహుబలి 2’ షేర్లు కూడ ట్రేడ్ అయ్యే ఆవకాశం కనిపిస్తోంది..