బాహుబలి@500 కోట్లు.. బాలీవుడ్@100 కోట్లు
టాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ సినిమాగా తెరకెక్కి...బాలీవుడ్ చిత్రాలకు ధీటుగా వసూలు సాధించిన చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం ఇప్పటి వరకూ రూ.500 కోట్లు వసూలు చేసిందని..బాలీవుడ్‌లో రూ.100 కోట్ల మార్కు దాటిన తొలి దక్షిణాది సినిమాగా రికార్డులు క్రియేట్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే...దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించాడు. దీంతో జక్కన్నకు బాలీవుడ్ నుండి ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా కరణ్ జోహార్ రూ.20 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలిసింది. కరణ్‌తో పాటు బాలీవుడ్ దిగ్గజాలు కొందరు రాజమౌళితో సినిమా చేసేందుకు ఊవ్విలూరుతున్నారట.
కానీ జక్కన్న వీటన్నంటిని తిరస్కరించి ప్రస్తుతం బాహుబలి సెకండ్ పార్ట్ మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.