Pages

అంగారకుడి మీద అమ్మాయి?

అంగారకుడి మీద జీవం ఉందా.. లేదా అన్న విషయం మీద ఇప్పటికి లెక్కలేనన్ని పరిశోధనలు జరిగాయి.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. శాస్త్రవేత్తలు ప్రతిసారీ ఏదో ఒక ఆకారాన్ని చూపించి అది మనిషే కావచ్చని చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. 
angaarakudi mida ammaayi?
తాజాగా అంగారకుడి మీద ఓ అమ్మాయి లాంటి ఆకారం నాసా శాస్త్రవేత్తలకు కనిపించింది. అచ్చం అమ్మాయి లాంటి ఓ ఆకారం.. అది కూడా జీవం ఉన్నది కావచ్చు.. దాన్ని క్యూరియాసిటీ రోవర్ సాయంతో నాసా కనుగొంది. అది ఏమైనా గ్రహాంతర వాసి ఫొటో కావచ్చని కొందరు భావిస్తున్నారు. ఆ ఫొటో చూస్తే అచ్చం అమ్మాయిలాగే అనిపిస్తోంది. 

అయితే, అది రాయి కూడా కావచ్చని మరికొందరు వాదిస్తున్నారు. అది ఏదైనా కానీ.. ప్రస్తుతం ప్రపంచం నలుమూలలా అందరి దృష్టినీ మాత్రం ఆకర్షిస్తోంది. ఈ ఆకారం గురించి, ఆ అమ్మాయి గురించి ఇంకెన్ని వివరాలు బయటకు వస్తాయో చూడాలి మరి!!