వామ్మో.. నాగార్జున కొడుకు అఖిల్ ఇరగదీసేట్టే కనిపిస్తున్నాడు. ఫస్ట్ పోస్టర్‌లోనే విశ్వరూపం చూపాడు. అతని మొట్టమొదటి సినిమా పోస్టర్ రిలీజ్ కాగానే అక్కినేని ఫ్యాన్స్ థ్రిల్ అయిపోయారు.
'అఖిల్' అనే టైటిల్‌తోనే వి.వి. వినాయక్ తీస్తున్న చిత్రం టీజర్ ఆగస్టు 29న రిలీజవుతోంది. ట్యాగ్‌లైన్ 'ద పవర్ ఆఫ్ జువా' పేరుతో హీరో నితిన్ తీస్తున్న ఈ చిత్రానికి పవర్‌ఫుల్ లుక్‌లో అఖిల్ మాంచి పోజిచ్చాడు. తన తొలిచిత్రంతోనే భారీ అంచనాలు పెంచేట్టు కనిపిస్తున్నాడు. అనూప్, థమన్ మ్యూజిక్‌ను కంపోజ్ చేస్తున్న 'అఖిల్' సినిమా కుర్ర హీరోల సినిమాల్లో టాప్‌గా ఉంటుందని ఆశించడంలో తప్పేమీ లేదేమో !
అన్నట్టు ట్యాగ్‌లైన్‌లోని 'జువా' అంటే అది ఇంగ్లీషు పదమో తెలుగో కాదు.. దక్షిణాఫ్రికాలో ఓ తెగవారు మాట్లాడే స్వాహిలి భాషలోని పదమని చెబుతున్నారు. 'జువా' అంటే సూర్యుడని అర్థం.
అఖిల్ సినిమాకు ఈ ట్యాగ్‌లైన్ పెట్టారంటే అతనికి సూర్యునికి ఉన్నంత పవర్ ఉన్నట్టేగా అని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. దక్షిణాఫ్రికాలోని కీలక ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఈ సినిమా షూటింగ్ జరిగిందని తెలుస్తోంది. సూర్యభగవానుడి అంశగా, శక్తిమంతుడిగా అఖిల్ ఇందులో కనిపిస్తాడేమో చూడాలి.