Pages

ఐటెమ్ గర్ల్‌గా మారిన సోనియా... క్యూ కట్టిన ఆఫర్లు..

ఆ మధ్య 7జీ బృందావనం కాలనీ సినిమాతో వెండితెరపై హీరోయిన్‌గా వెలిగిన అందాల తార సోనియా అగర్వాల్. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన సోనియా దర్శకడు సెల్వరాఘవన్‌ను పెళ్లి చేసుకోవడం, ఆయనతో విడుకులు పొందడం చకచకా జరిగిపోయింది. అందుకు ఫలితం అమ్మడుకు అవకాశాలు నిల్. అయితే అవకాశాలు రాలేదని సోనియా మూలన కూర్చోలేదు. నిత్యం అవకాశాల కోసం పోరాడుతూనే వచ్చింది.
 sonia agarwal
అవకాశాలు వస్తే నటించడం, లేకపోతే ఐటెమ్ గర్ల్‌గా మారడం అని సోనియా డిసైడ్ అయింది. అంతే ఇటీవల హాస్య నటుడు వివేక్ సరసన 'పాలకాట్టు మాధవన్' సినిమాలో నటించింది. అసలు అటువంటి సినిమా వచ్చిందా అని పలువురికి సందేహం. అటువంటి సినిమాలలో నటించడం వలన ఒరిగేదేముంది. అందుకని ఖాళీగా కూర్చోవడం కుదరదు కదా. అందుకే అమ్మడు ఐటెమ్ గర్ల్‌గా మారాలని నిర్ణయించుకుంది.

అంతే సోనియాకు కేరళ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. మలయాళ హీరో కుంచక బోబన్ తాజా సినిమా 'జమ్నా ప్యారీ'లో ఆయన సరసన చిందులు వేసే అవకాశం వచ్చింది. ఆ సినిమా ఆగస్టు 27న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ఆ చిత్ర టీసర్‌లో సోనియా ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణ పొందింది. సోనియా తన కెరీర్‌లో ఆడి మొదటి ఐటమ్ సాంగ్ గ్రాండ్ సక్సెస్ కావడంతో అమ్మడు ఇక ఐటెమ్ గర్ల్‌గా మారిపోయింది.