Pages

భార్యను కన్యాదానం చేసిన భర్త...!

సినిమాను తలపించిన ఈ ఘటన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌కి చెందిన చందా అనే యువతి అదే ప్రాంతానికి చెందిన సూరజ్‌లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. 
sinimaalola: nachhina vyaktito bhaaryaku pelli cheshaadu
అయితే, పెద్దల మాటలకు అడ్డుచెప్పలేక చందా అదే ప్రాంతానికి చెందిన ఫూల్ చంద్ అనే వ్యక్తిని వివాహమాడింది. వివాహమైన కొద్ది రోజుల అనంతరం ఫూల్‌ చంద్ ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతానికి వెళ్లాడు. అప్పటికీ చందా తాను ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేక రోజూ కలుస్తూనే ఉండేది. భర్త ఫూల్ చంద్ కొన్ని రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. 

అప్పుడు చందా తన భర్త తనకు కానుకగా ఇచ్చిన కానుకలను తిరిగి ఇచ్చేసి తన ప్రేమ విషయాన్ని వివరించింది. ముందు ఫూల్ చంద్ కోపగించినా.. ఆ తర్వాత ఆలోచించి వారిద్దరినీ ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు. 

అనంతరం ఇరువైపుల పెద్దలతో పాటు ఊరి పెద్దల్ని ఒప్పించి గురువారం చందా, సూరజ్‌ల వివాహం జరిపించాడు. అంతేగాక, నూతన దంపతులకు కానుకలిచ్చి దగ్గరుండి కాపురానికి పంపాడు