బాహుబలి లో మీరు చూసిన వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉందో మీకు తెలుసా?
బాహుబలి సినిమా చూశారా? ఆ మూవీలో వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి కదా. శివుడు క్యారెక్టర్ ప్రబాస్ శివలింగం ఎత్తుకొని వాటర్ ఫాల్స్ దగ్గర పెట్టడం, తమన్నా(అవంతిక) కోసం కొండపైకి ఎక్కడం అదంతా అతిరపల్లి వాటర్ ఫాల్సే. కేరళలో ఉన్న ఈ వాటర్ ఫాల్స్ కేరళలోనే పెద్ద వాటర్ ఫాల్సట.
దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే సినిమాలో చూశారుగా ఆ వాటర్ ఫాల్స్ అందాలను. గుట్టలు, కొండలు, ప్రకృతి అందాలతో పాటు వాటర్ ఫాల్స్ ను వీక్షించొచ్చు. ఎప్పుడైనా కేరళకు వెళ్తే అతిరపల్లి వాటర్ ఫాల్స్ ను కూడా ఓ సారి చూసేయండి.