ఈ చిత్రంలోని తాలిబన్ ఒంటె మామూలుది కాదు... పైకి చూడడానికి కూల్‌గా కనిపిస్తున్నా.. ఇది అమెరికా సైనికాధికారులకే 'చుక్కలు చూపించింది'! సరదాగా ముట్టుకుందామని ప్రయత్నిస్తే జాడించి తన్నింది. ఆఫ్ఘనిస్తాన్‌లో విధులు నిర్వహిస్తున్న సైనికాధికారి ఫ్రాంక్... తన పక్కనుంచి నడిచివెళుతున్న ఓ ఒంటెను చూసి ముట్టుకునేందుకు ముచ్చట పడ్డాడు.
దగ్గరకెళ్లి అలా టచ్ చేసేలోపే లాగిపెట్టి ఒక్కటిచ్చుకుంది. ఈ తంతు చూస్తున్న మరో సైనికుడు నిన్నేమీ అనదు.. మళ్లి వెళ్లి చూడు అంటూ ప్రోత్సహించాడు... దీంతో రెండోసారి దగ్గరికెళ్లి ఒంటెను చరిచేందుకు ప్రయత్నించాడు. అందరూ ఊహించినట్టు గానే ఒంటె దెబ్బకి మనోడు అంతదూరంలో ఎగిరిపడ్డాడు.
అంతే... 'హమ్మ బాబోయ్ ఇది మనమనుకన్నంత కూల్ కాదు.. ' అని తిట్టు కుంటూ దానిమానాన దాన్ని వదిలేశాడు. దీన్ని వీడియో తీసిన సైనికోద్యోగి ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. చూసిన వారంతా పగలబడి నవ్వుకుంటున్నారు. ఇప్పటికే దీన్ని 80 వేల మంది వీక్షించారు.
పైన తెలిపిన టైటిల్ లో అర్థం ఏమిటంటే
మనకన్నా పెద్ద ఆఫీసర్ కు ముందు మనం నడుస్తే ఆ ఆఫీసర్ నాకన్న ముందు నడుస్తాడు .. వీడికి పొగరెక్కువ అని మన ఉద్యోగానికి ఎసరు పెడతాడు . అదే అడ్డ గాడిద కు వెనకాల నడిస్తే అది వెనుక కాళ్ళతో పళ్ళు రాలగోడుతుంది . అది అర్థం కాకపొతే పైన తెలిపిన ఘటన లో గాడిద కాదు ఒంటె వచ్చింది అంతే తేడా ............
అందుకే : ఆఫీసర్ కు ముందు అడ్డగాడిద కు వెనుకల నడవకూడదు