Pages

వాడిన వస్తువులతో గాలి ద్వారా కరెంటు ఉత్పత్తి?మీరు కుడా ఎంకరేజ్ చెయ్యండి బ్రదర్ ?

 అతనో దర్జీ (టైలర్).. పెద్దగా చదివింది లేదు.. కరెంటుపై కాస్తా పరిజ్ఞానం ఉంది.. 20 ఏళ్ల కిందట పరిశ్రమలో పని చేసినప్పుడు కరెంటుపై పట్టు సాధించాడు.. దీంతో గాలిద్వారా కరెంటు తయారవుతుందని చదివిన అతను తాను కరెంటు ఉత్పత్తి చేయాలని నిర్ణయించా డు.. అందుబాటులో ఉన్న వస్తువులతో గాలి ద్వారా కరెం టు ఉత్పత్తిని తయారు చేయడంతో ప్రాథమికంగా విజ యం సాధించాడు. 
vaadina vastuvulato gaali dvaara karentu utpatti
తిమ్మాజిపేట మండలం మారేపల్లి గ్రామానికి చెందిన ఎండీ సలీంకు యాభై ఏళ్లు.. ఇంటర్ వరకు చదివిన అతను యువకుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఒక పరిశ్రమలో పని చేశాడు. కుటుంబ పోషణ భారం కావడంతో గ్రామానికి వచ్చి టైలర్‌గా స్థిరపడ్డాడు. పరిశ్రమలో కరెంటు గురించి కొంత తెలసుకున్న అతను దానిపై ఉన్న ఆసక్తితో మరిన్ని పుస్తకాలు చదివాడు. దీంతో అతను కరెంటును ఇంట్లోనే తయారు చేయొచ్చని భావించి వాడే వస్తువులతో చిన్న ప్రయోగాన్ని చేశాడు. ఇది విజయవంతమై జీ రో బల్బులు వెలగడంతో పెద్ద ప్రయోగానికి సిద్ధమయ్యాడు. కరెంటు తయారీ విధానం ఎయిర్ న్యూ పవర్ ప్లాంట్‌గా పేరు పెట్టుకున్న సలీం ఎలా తయారు చేయొచ్చో వివరించారు. ముందుగా కొంత సేపు కంప్రెషర్ బోర్డును కరెంటుతో నడపాలి. ఒక  కంప్రెషర్ ద్వారా 20 కి.మీ. నుంచి 60 కి.మీ వేగంతో గాలి వస్తోంది. 

ఇలా 9 కంప్రెషర్ల ద్వారా 180 నుంచి 250 దాక వేగంతో గాలి ఉత్పత్తి అవుతుంది. దీన్ని పైపుల ద్వారా స్టోరేజ్ ట్యాంకుకు అనుసంధానం చేసుకుని గాలికి నిల్వ చేసుకోవాలని, అప్పుడు ట్యాంకులో పీడన శక్తి ఏర్పడుతుంది. ఈ గాలిని ఎయిర్ కంట్రోల్ పైపుల ద్వారా టర్బెన్లకు పంపాలి. గాలి వేగానికి టర్బెన్లు జెట్ వేగంతో తిరుగుతాయి. దీంతో శక్తి ఉత్పత్తి అవుతుంది. దీన్ని డై శాఫ్ట్ (అయస్కాంత చక్రాలు) ద్వారా జనరేటర్లకు కలుపుకుంటే కరెంటు ఉత్పత్తి అవుతుంది. దీన్ని రొటేషన్ ద్వారా రోజుల తరబడి కరెంటును ఉత్పత్తి చేయొచ్చని సలీం తెలిపారు. 

దీని కోసం ఆయన అందుబాటులో ఉన్న వస్తువులతో చిన్న ప్రయోగం చేసి జీరో బల్బులను వెలిగించాడు. ఇందుకు సంబంధించిన చార్ట్‌ను తయారు చేసి ప్రదర్శిస్తున్నాడు. త్వరలో ఒక ఇంటికి సరపడా కరెంటును ఉత్పత్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు సలీం తెలిపాడు. ఉత్పత్తి కోసం అవసరమైన వస్తువులు కోనే స్థోమత లేదని, ఎవరైనా ఆర్థిక సాయం అందిస్తే పెద్ద ప్రయోగానికి సిద్ధమని అన్నాడు.