బ్రూస్ లీ సినిమా స్టోరీ లీక్... ఇదే

తాజాగా చెర్రీ నటిస్తున్న బ్రూస్ లీ స్టోరీ లిక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక లీక్ అయిన స్టోరీ కథనానికి వస్తే.. ఈ సినిమాలో రాంచరణ్ (బ్రూస్ లీ) ఒక స్టంట్ మాస్టర్ గా దర్శనమిస్తాడట.. వాస్తవానికి ఇతను ఒక సీక్రెట్ పోలీస్. తన అక్క (కృతి ఖర్బంద) అనుకోకుండా కొందరు గుండాల చేతుల్లో మరణిస్తుంది.. 
రామ్ చరణ్ బ్రూస్ లీ కోసం చిత్ర ఫలితం
అయితే ఆమె మరణం వేనుక ఒక పెద్ద డాన్ ఉన్నాడని తెలుసుకుంటాడు బ్రూస్ లీ.. దీంతో వారిపై ద్వేశాన్ని పెంచుకున్న ఇక ఆ డాన్ కు సంబంధించి సామ్రాజ్యాన్ని అంచలంచెలుగా పడగొడుతూ డాన్ ని అంతం చేస్తాడట..అసలు ఆ డాన్ బ్రూస్ లీ అక్కను ఎందుకు చంపాడు..అనేది ట్విస్ట్. బ్రూస్ లీ ఫైట్ మాస్టర్ గా ఎందుకు మారాడన్నది సినిమాలో కీలక అంశం అట. మొత్తానికి స్టోరీ బట్టి చూస్తే ఇది ఒక రివేంజ్ డ్రామా అని తెలుస్తుంది. 
రామ్ చరణ్ బ్రూస్ లీ కోసం చిత్ర ఫలితం
ఈ సినిమా విడుదలపై అందరికీ ఉత్కంఠత నెలకొంది ఎందుకంటే ఈ సినిమాలో అగ్రహీరోల సందడి ఉంటుందట..చిరంజీవి, నాగార్జున, మని అబ్బాయి కోసం బాబాయ్ కూడా నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి