Pages

పడుకునే ముందు ఆ సన్నివేశాలు చూస్తే నొప్పి ఉండదట!

నవ్వు నాలుగు విధాల చేటు అన్నది పాత మాట. నవ్వుతో నలభై రకాల లాభం అన్నది ఇప్పటి మాట! నవ్వుతో మానసిక ప్రశాంతత కలుగుతుంది, టెన్షన్‌ తగ్గుతుంది. పలుపరిశోధనల్లో ఈ విషయాలు రుజువయ్యాయి. ఇటీవలి పరిశోధనల్లో నవ్వు స్పాండిలైటిస్‌ను తగ్గిస్తుందన్న విషయం రుజువైంది. 

ప్రతిరోజూ రాత్రి భోజనం చేసిన తరువాత ఓ పదిహేను నిమిషాల పాటు కామిక్‌ సీరియల్స్‌ లేదా హాస్యం మేళవించిన సన్నివేశాలు చూస్తే రెండు గంటల పాటు నొప్పి లేకుండా నిద్రపోవచ్చన్న విషయం వీరి పరిశోధనల్లో తేలింది. స్పాండిలైటిస్‌ నొప్పితో బాధపడుతున్న సుమారు వందమంది మీద కొన్ని వారాల పాటు పరిశోధనలు నిర్వహించారు. 

వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపుకు హాస్య సినిమాలు రాత్రి పడుకోబోయే ముందు తప్పనిసరిగా చూపించారు. మరో గ్రూప్‌కి ఎలాంటి సినిమాలు చూపించలేదు. హాస్య సన్ని వేశాలు చూసిన గ్రూపు సభ్యులు నొప్పి లేకుండా గాఢనిద్రపోయిన విషయాన్ని వీరు గమనించారు. అయితే నవ్వుకీ, నొప్పికీ ఉన్న సంబంధం మీద వీరు పరిశోధనలు నిర్వహిస్తున్నారు.