రామ్ చరణ్ , చిరంజీవి , రాకుల్ ప్రీతి సింగ్ శ్రీను వైట్ల డి.వి.వి. దానయ్య తమన్ అక్టోబర్ 16, 2015 తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5 - మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన బ్రూస్ లీ చిత్రం దసరా కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది..దాదాపు ఆరేళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రం లో కనిపించడం తో మెగా ఫాన్స్ అంచనాలు బాగానే పెట్టుకున్నారు.మరి వారి అంచనాలను ఎంత మాత్రం అందుకుందో ఇప్పుడు చూద్దాం. కథ : మధ్య తరగతికి చెందిన రావు రమేశ్ కు ఓ కొడుకు కార్తి (రామ్ చరణ్ ) , ఓ కుమార్తె (కృతి ఖర్బంద) ఇద్దరు కూడా చదువులలో ఫస్ట్. అయితే చిన్నప్పటి నుండే కార్తి సిస్టర్ కు ఐఎఎస్ కావాలని కోరిక..ఆ కోరిక తీర్చడం కోసం తండ్రి అప్పుల పాలవుతాడు..దీంతో కార్తి ఫైట్ మాస్టర్ గా మారి చెల్లెలి ఫీజు కడతాడు..కానీ తన తండ్రికి కార్తి అలా చదవు మానేసి ఫైట్ మాస్టర్ అవడం ఇష్టం ఉండదు..దీంతో కార్తి ఫై కోపం పెంచుకుంటాడు..అదే టైం లో కృతి ఖర్బంద పెద్ద సమస్య లో చిక్కుకుంటుంది..
ఆ టైం లో కార్తి పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు.. ఫైట్ మాస్టర్ నుండి పోలీస్ ఆఫీసర్ ఎలా అయ్యాడు..? కృతి ఖర్బంద కు వచ్చిన సమస్య ఏంటి..? ఆమె ఎలా బయటపడుతుంది..? అనేది మీరు తెరఫై చూడాల్సిందే.. ప్లస్ : మొదటగా ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అంటే చిరంజీవి అని చెప్పాలి..చేసింది గెస్ట్ రోల్ అయిన సినిమా అంచనాలు పెచ్చింది మాత్రం చిరు అనే చెప్పాలి.దాదాపు ఆరేళ్ళ తర్వాత సిల్వర్ స్క్రీన్ ఫై కనిపించడం తో అందరి దృష్తి బ్రూస్ లీ ఫై పడేలా చేసింది..చిరు ఎంట్రీ తో ధియేటర్ లో కేకలు , అరుపులతో మారుమోగిపోయింది..చిరు చెప్పే డైలాగు "జస్ట్ టైం గ్యాప్ ..టైమింగ్ లో గ్యాప్ వుండదు " అని చెప్పడం తో అందరు 150 వ చిత్రం కోసమే ఈ డైలాగు అని ఫిక్స్ అయ్యారు.. కార్తి పాత్ర లో కొత్త రామ్ చరణ్ ని చూస్తాం..ఇప్పటివరకు యాక్షన్ పాత్రలతో అలరించిన చరణ్ మొదటిసారిగా పూర్తిస్థాయి ఫ్యామిలీ క్యారెక్టర్ లో కనిపించి అందర్ని ఆకట్టుకున్నాడు.. చరణ్ లుక్ చాలా స్టైలిష్ గా ఉంది , అలాగే డాన్స్ గురించి మనం చెప్పనక్కరలేదు, ఆ బ్లడ్ లోనే డాన్స్ ఉంది.