Pages

99 కార్లతో బయలుదేరిన బాలకృష్ణ ... ఎక్కడికో తెలుసా ..!

నందమూరి నటసింహం బాలయ్య, శ్రీవాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న డిక్టేటర్ ఆడియో వేడుకకు రంగం సిద్ధమైంది. ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతిలో డిక్టేటర్ ఆడియో వేడుక జరగనుండగా ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేసారు. అయితే సాయంత్రం జరగనున్న ఈ పాటల వేడుకకు ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరుకానున్నట్టు సమాచారం.

బాలయ్యకు డిక్టేటర్ 99వ సినిమా కాగా అభిమానులు భారీ ఎత్తున అమరావతికి తరలి వస్తున్నారు. అంతేకాక బాలయ్య కూడా ఇప్పటికే అమరావతికి పయనం కాగా 99 కార్లతో అక్కడికి బయలు దేరినట్టు సమాచారం. యూనిట్‌తో కలిసి బయలు దేరిన బాలయ్యకు అక్కడ అభిమానలు ఘన స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. ఇంక థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా పాటలు చిత్రానిఇకి స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారనుందని యూనిట్ భావిస్తోంది. ఇంక ఈ చిత్రంలో హీరోయిన్లుగా అంజలి, సోనాల్ చౌహన్, అక్షలు నటించనుండగా శ్రద్ధా దాస్ స్పెషల్ డ్యాన్స్‌తో మెరవనుంది.