సింగపూర్ సాయంతో మనం చిటికెలో రాజధాని కట్టేస్తాం.. సింగపూర్ కంటే బ్రహ్మాండంగా కడతాం.. సింగపూర్ లో అవినీతి అనేది చూశారా ఎక్కడైనా.. సింగపూర్ మనకు ఉత్తి పుణ్యానికే పైసా తీసుకోకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇచ్చింది.. ఇవీ చంద్రబాబు రాజధాని నిర్మాణం గురించి ఇప్పటివరకూ చెప్పిన కబుర్లు.. అవి ఎల్లో మీడియాలో వినీ.. వినీ.. ఎల్లో టీవీల్లో కనీ కనీ జనం కూడా సింగపూర్ నే తమ రాజధానిగా కలలు కన్నారు.
బాబు తమపై విపరీతంగా ఆధారపడ్డ విషయం అర్థం చేసుకున్నాయో ఏమో కానీ.. రాజధాని నిర్మాణానికి సవాలక్ష షరతులు పెడుతున్నాయి. ఆ షరతులు వింటే ఎవరికైనా కళ్లు తిరగడం ఖాయం.
ఆ షరతుల హైలెట్స్ ఏంటంటే.. సింగపూర్ కంపెనీలు కేవలం 300 కోట్లు మాత్రమే ఖర్చు పెడతాయట. ఆ మాత్రం దానికి వాళ్లకి 4 వేల ఎకరాల భూమి అప్పజెప్పేయాలట. మామూలుగా కాదు.. ఇక ఆ భూమిని వాళ్లేం చేసుకున్నా అడగకూడదట. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కూడా కావాలట. రాజధాని సెంటర్ పాయింట్ నుంచి పాతిక కిలోమీటర్ల మేర పోటీదార్లకు భూములివ్వకూడదట.
చివరకు భూములిచ్చిన రైతులకు కూడా కోర్ కేపిటల్ బయటే స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. సింగపూర్ సర్కారు కంపెనీల డిమాండ్లతో ఏపీ సీఎం చంద్రబాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఉంటుందని పొలిటికల్ పండిట్స్ చెబుతున్నారు.