ఆద్యాత్మికం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆద్యాత్మికం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మహిమాన్విత దివ్య క్షేత్రం పొలతల

రాయలసీమ జిల్లాల్లో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన క్షేత్రం పొలతల. కడపజిల్లా పెండ్లిమర్రి మండలంలోని గంగనప్లలె పంచాయతీ పరిధిలోని శేషాచల పర్వతశ్రేణుల్లోని కొండ కోనల నడుమ ఈ పోలతల క్షేత్రం విరాజిల్లుతోంది. ఈ శివక్షేత్రంలో శ్రీ పొలతల మల్లికార్జునస్వామి వెలసివున్నారు ఇంకా అక్కదేవతలు, పులిబండెన్నలు కూడా వెలసి ఉన్నారు.

ఈ క్షేత్రంలో సీతమ్మరాకను అన్వేషిస్తూ ఇచ్చట రామలక్ష్మణులు కొలనులో స్నానం చేసి శివుని దర్శించి పునీతులైనారని పురాణాలు చెప్తున్నాయి. తర్వాత పాండవులు వనవాస కాలంలో అర్జునుడు కందమూలములతో, మల్లెపూలతోను పూజించినందున మల్లికార్జును ప్రసిద్ధి పొందారని పురాణాలు చెబుతున్నాయి. ఇచ్చట కొలువైన మల్లికార్జునికి లోక కల్యాణార్థం శివపార్వతులు సంచరిస్తూ ఇచ్చట కాలుమోపగా కొతం భూమి కుచించు పోయిందని భక్తులు చెబుతుంటారు. కావున పునితలు పొలతలగా ప్రసిద్ధి చెందినది.

చరిత్ర :
ఈ పొలతల మల్లికార్జునస్వామి దేవస్థానానికి ఎంతో మహనీయమైన ధార్మిక చరిత్ర వుంది. దాదాపు 800 సంవత్సరాల క్రితం పొలతల గ్రామం దాన్ని చుట్టుపక్కల ఏడు చిన్న ఊర్లు వుండేవని, ప్రజల జీవనం పంటసిరి, పాడిసిరితో సాగేదని పెద్దలు చెబుతుంటారు. ఈ ఊర్లకు చెందిన ఆవుల మందను కాసే ధార్మిక మానవుడు రామయ్య. ఆయనకు ఒక శిష్యుడు. ఆయన పేరు పిలకత్తు. తాము కాసే ఆవుల మందలో ఒక ఆవు శూలుకట్టడం కానీ, ఈనడం కానీ లేకుండా చాలా ప్రత్యేకంగా ఉండేది. ఆ విషయం గుర్తించి దాని రాక పోకలపై దృష్టి పెట్టాడు పిలకత్తు. ఒకరోజు అందరి కన్ను గప్పి ఆవు మందకు అడ్డంగా బిగించిన కంచెను అవలీలగా ఎగిరి అవతలికి దూకింది. వడివడిగా ఎక్కడికో పోసాగింది. పిలకత్తు దాని వెనుకగా చేత గొడ్డలి పట్టుకుని అనుసరించాడు. అలా ఆవు కొంతదూరం వెళ్లింది. ఓ ముళ్లపొద గొడుగులా పైకి లేచింది. దాని కింద ఒక దివ్యపురుషుడు పరుండి ఉన్నాడు. ఆ ఆవు తన పొదుగునుంచి క్షీరాన్ని ఆ దివ్యపురుషుని నోటి లోనికి వదలసాగింది. ఈ ఘటన చూసిన పిలకత్తు అగ్రహోదగ్రుడై ఎవరో అగంతకుడు ఆవుపాలు ఇలా దొంగచాటున జుర్రుకుంటున్నాడని తలపోశాడు. ముందు వెనుక ఆలోచించకుండా చేతిలోని గొడ్డలితో ఆ దివ్య పురుషుని మడిపై మోదాడు. చివ్వున రక్తం పైకి చిమ్మింది. నెత్తురు చూసిన పిలకత్తు కంగారుపడి పోయాడు. తన గురువు రామయ్య వద్దకు పరుగున వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. రామయ్య వృత్తాంతం అంతా విని జరిగిన పొరబాటు విని ఎంత బలీయమైనదోనని ఆందోళన చెందుతుండగానే పిలకత్తు క్షణాలలో పూనకం వచ్చినట్లు వూగిపోయాడు. వెంటనే పిలకత్తును ఆవహించింది సాక్ష్యాత్తు పరమశివుడే అన్నది తెలిసిపోయింది. అనంతరం జరిగిన అపరాధాన్ని క్షమించమని పరిహారంగా గుడికట్టి భక్తి శ్రద్ధలతో పూజించుకుంటామని కన్నీరు మున్నీరై సాష్టాంగ దండ ప్రమాణాలు చెల్లించాడు రామయ్య. అనంతరం ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి మల్లికార్జునస్వామి భక్తుల కోర్కెలు తీరుస్తున్నారు.


అక్కదేవతలు- పులిబండెన్నల ఆగమనం :
ఒకప్పుడు పొలతల ప్రాంతంలో 101 కోనేర్లు పులివింజ మానులు, విశాలమైన ప్రకృతి పచ్చదనాలతో అలరారేది.. ఆ ప్రశాంత ప్రకృతి వాతావరణంలో మహిమాన్విత మధుర జలాలతో ప్రాణకోటికి జీవనాధారమైన 101 కోనేర్లకు సమీపంలోనే మబ్బుకోన అనే ఒక గని ఉండేది. ఆగనిలో దివ్య పురుషుడు అయిన తులశ బ్రహ్మ తపోదీక్షలు ఉండేవారు. అలాగే గనిలో పునీత మహిమలైన అక్కదేవతలు ఏడుగురు కూడా ఉండేవారు. అక్కదేవతల బాషణలు లేని తులశ బ్రహ్మకు అవరోధంగా మారాయి. కన్నీయమనులైన అక్క దేవతలను తులశబ్రహ్మ తన తపోసమాధికి ఎదురవుతున్న ఆటంకాన్ని తెలిపి సమీపంలోని కోనేర్లకు ఆధార భూతంగా చేసుకుని జీవించమని కోరారు. మేని మాటలను మన్మించి ఆ కన్నియలు గవి విడచి కోనేరు వద్దకు చేరి జలక్రీడలలో ఆనందించసాగారు. ఒకరోజు ఒక ఓం కారశద్దంతో ఒక సుడి తాటిచెట్టంత ఎత్తులేచింది. దీంతో ఆ కన్నియలు పారిపోయి బంగాళా బోడు దగ్గర వెలిసివున్న శివుని గుడిలో ప్రవేశించి శివుని శరణువేడారు. పరమశివుడు ప్రత్యక్షమై కన్యకలను దుమ్ము, ధూలి రూపంలో వెంబడిస్తున్న శక్తిని నిలువరింపచేశారు. శివుని దర్శనంతో ఆ అప్రకటిత శక్తి తన నిజస్వరూపంలో శివుని ఎదుట నిలువక తప్పిందికాదు. నీవు ఓం శక్తివి కావు పులి బండైవున్న నీ శక్తి యుక్తులు ఇకపై లోక కళ్యాణార్థమై వెచ్చించు. అలాగే మహిమాన్వితులైన ఈ ఏడుగురు కన్నేలు కూడా భక్తాదుల మనో కామి తలను సిద్దింప చేస్తారు. ఇకపై మొదటిపూజ అక్కదేవతలైన కన్నేలకు, పిమ్మట తనకు ఆ తరువాత పులిబండెన్నకు పూజలు జరుగుతాయని చెప్పి పరవ శివుడు అదృశ్యమయ్యాడు. అదేవిధంగా నేడు కూడా తొలి పూజలు అక్కదేవతలకు జరుగుతున్నాయి.



మహిమలు:
కదిరిలోని నరసింహస్వామి దేవాలయ గోపురర శిఖరం ఒకసారి ఉన్న ఫలంగా ఒక వైపునకు ఒరిగింది. ఈ పరిస్థితిని గుర్తించిన ధార్మిక జనులైన భక్తాదులు అపచారం జరిగిందని ఏదో అరిష్టం ముంచుకుని రాబోతుందని తీవ్ర ఆందోళన చెందారు. ఆలయ శిఖరం ఒక వైపునకు ఒరిగిపోయిన విషయం తెలిసి అరవై ఆరు మంత్రవేత్తలైన పూజారులు తమ శక్తి యుక్తులను ప్రయోగించారు. కాని వారి మంత్రాలకు వొరిగిన ఆలయ శిఖరం ఎంత మాత్రం సరికాలేదు. ఈ పరిస్థితి ఆనోటా ఈ నోటా విన్న పొలతల లోని మల్లికార్జున ఆలయ పూజారి రామయ్య తన వద్ద ఉన్న దేవర ఎద్దును మరో వంద మందిని వెంటబెట్టుకుని కదిరి నరసింహస్వామి ఆలయానికి వెళ్లాడు. దేవరఎద్దు ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేసి మంత్ర మహిమాన్వితమైన తన కొమ్ముతో ఆలయాన్ని కుమ్మింది. మరుక్షణం ఒరిగిన శిఖరం సరిగా కుదురుగా నిలబడింది. అయితే గోపురం పై నుంచి ఒక కప్పు దేవర ఎద్దుపై పడటంతో ప్రాణాలు వదిలింది. ప్రతిఫలంగా ఇరవై ఎకరాల మాన్యాన్ని పొలతల మల్లికార్జునస్వామి ఆలయానికి కదిరి నరసింహ ఆలయం వారు ఇచ్చారు.
polatala కోసం చిత్ర ఫలితం
పొలతల ప్రాంత ప్రజలు తరచు దివిటి దొంగల బారిన పడేవారు. దివిటీ దొంగలు సర్వం దోచుకుని వెళ్లేవారు. అంతేగాక కలరా వ్యాధితో చాలామంది మృత్యువాత పడ్డారు. ఈ కారణాలతో పొలతల ప్రాంతంలోని ప్రజలు గ్రామాలు వదలిపెట్టి వెళ్లడం ప్రారంభించారు. దీంతో చాలాకాలం మల్లికార్జున స్వామికి ధూప దీప నైవేద్యాలు కరువయ్యాయి. ఇదిలా వుండగా వేంపల్లె తూర్పున గండి ఆంజనేయ క్షేత్రం ఉంది. ఆ క్షేత్రానికి మూడు మైళ్ల దూరంలో ఏక దంతనాయుడు కోట ఉండేది. ఆ కోటలో దొంగతనాలు చేసి జీవించే 50 కుటుంబాల వారు జీవించేవారు. వీరు పరాక్రమవంతులు. వీరిని ఏకల వీరులు అని కూడా పిలిచేవారు. ఏకదంత నాయుడితో పాటు ఏకల దొరలు కొందరు ఒకరోజు వేటకు వెళ్లి పొలతల ప్రాంతాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆ పిమ్మట పొలతల మల్లికార్జున స్వామి ఆలయాన్ని బంగాళా బోడు నుంచి పక్కనే గల మరోబోడు పైకి మార్చి సర్వాంగ సుందరంగా ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి పరచి తమ భక్తి ప్రవుత్తులను చాటుకున్నారు. దివిటి దొంగలలో మానసిక మార్పు తెచ్చి భక్తి మార్గానికి మల్లించిన పొలతల మల్లికార్జునస్వామి మహిమలు అనంతం..ఇక్కడికి వచ్చే స్ర్తి, పురుషులు తమ కోర్కెలు తీరాలని ముడుపులు కడుతుంటారు. ఇక్కడ స్వామికి కొబ్బరికాయ కొట్టినా ఇక్కడే వదలిపెట్టి వచ్చే సంప్రదాయం ఉంది.
మహాశివరాత్రి, కార్తీకమాస, వారోత్సవాలకు జిల్లా నుంచే కాక ఇతర రాష్టాల్ర నుంచి వేలాది వాహనాల్లో భారీగా భక్తులు తరలివస్తారు. ప్రతి సోమవారం జిల్లాతోపాటు దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పొలతల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటూ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అలాగే ఆర్టీసీ యాజమాన్యం ప్రతి సోమవారం ప్రత్యేక బస్సును కూడా పొలతల క్షేత్రానికి నడుపుతున్నారు.

Related :
ఒంటిమిట్ట ( ఏకశిలా నగరము )
ఏడు కొండలు - వాటి చరిత్ర
అధిక మాసం..అంటే!
యంత్రాలతో ప్రయోజనం ఉందా లేదా ?













వినాయక చవితి పూజ ఎలా చేయాలో తెలుసా?


ఏకదంతాయ విద్మ హే వక్రతుండాయ ధీమహి
తన్నో దంతి: ప్రచోదయాత్ |

తత్కరాటాయ విద్మ హే హస్తిముఖాయ ధీమహి
తన్నో దంతి : ప్రచోదయాత్ |

లంబోదరాయ విద్మహే మహోదరాయ ధీమహి 
తన్నో దంతి: ప్రచోదయాత్ | 


అంటూ విఘ్నేశ్వరుని నమస్కరించుకుని వినాయక చతుర్థి నాడు పూజ ఎలా చేయాలో చూద్దాం..!. భాద్రపద శుద్ధచవితి రోజున వచ్చే వినాయక చవితి నాడు ఉదయం ఐదింటికే నిద్ర లేవాలి. శుచిగా అభ్యంగనస్నానమాచరించి పూజా మందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులతో అలంకరించుకోవాలి. ఆకుపచ్చరంగు పట్టు వస్త్రాలు ధరించి.. పూజకు ఉపయోగపడే వస్తువులు, పటములకు గంధము, కుంకుమతో అలంకరించుకోవాలి. 

ఆకుపచ్చ రంగు వస్త్రమును కప్పిన కలశమును, వినాయకుడి ఫోటో లేదా శ్వేతార్క గణపతి ప్రతిమను పూజకు సిద్ధం చేసుకోవాలి. పసుపురంగు అక్షతలు, కలువ పువ్వులు, బంతి పువ్వులు, చామంతి మాలలతో గణపతిని అలంకరించుకోవాలి. నైవేద్యానికి ఉండ్రాళ్ళు, బూరెలు, గారెలు, వెలక్కాయ వంటివి తయారు చేసుకోవాలి. 

దీపారాధనకు రెండు కంచు దీపాల్లో ఏడు జిల్లేడు వత్తులను ఉంచి, కొబ్బరినూనెతో దీపమెలిగించాలి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల లోపు పూజను పూర్తి చేయాలి. 

విగ్రహాన్ని పూజకు ఉపయోగించిన పక్షంలో... మండపంపై విగ్రహం ఉంచి పవిత్ర జలంపై పాదాల్ని కడగాలి. తర్వాత పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లంతో పంచామృత స్నానం చేయించాలి. ప్రతి అమృతానికి నడుమ నీటితో శుభ్రం చేస్తుండాలి. తర్వాత వినాయక ప్రతిమకు గంధం, అద్ది, ఎరుపులేదా, పసుపు పువ్వులతో అలంకరించుకోవాలి. అలాగే చతుర్థినాడు మట్టితో తయారు చేసిన బొమ్మను పూజలో ఉంచడం శ్రేష్ఠం.

కర్పూర హారతులను సమర్పించేందుకు ముందు గణపతి అష్టోత్తరము, ఋణవిమోచక గణపతి స్తోత్రమ్, గణపతి సహస్రనామం, శ్రీ గణేశారాధనలతో స్తుతించడం లేదా "ఓం గం గణపతయే నమః" అనే మంత్రమును 108 సార్లు జపించాలి.తర్వాత నేతితో పంచహారతులివ్వడమో, లేదా కర్పూర హారతులు సమర్పించుకోవాలి.

ఇకపోతే.. ఇంట్లో పూజకోసం ఉంచిన మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేసేవరకు ఉదయం, సాయంత్రం రెండు పూటలా నైవేద్యం పెట్టి, హారతి ఇస్తుండాలి. పూజ పూర్తయ్యాక అక్షతలు జల్లి, విగ్రహాన్ని కదిలించాలి. తప్పుల్ని క్షమించమని కోరుతూ పూజ ముగించాలి. 

వినాయక చతుర్థి నాడు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని, అయినవల్లి విఘ్నేశ్వరుడిని దర్శించుకోవడం శ్రేయస్కరం. అలా కుదరని పక్షంలో సమీపంలోని వినాయక ఆలయాలను సందర్శించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు. 

అలాగే ఆలయాల్లో 108 ఉండ్రాళ్లతో పూజ, గణపతి ధ్యానశ్లోకం, గరికెతో గణపతి గకార అష్టోత్తరం, గణేశ నవరాత్రి ఉత్సవములు నిర్వహిస్తే వంశాభివృద్ధి, సకలసంపదలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.

అలాగే మీ గృహానికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలముతో పాటు గణపతి స్తోత్రమాల, గరికెతో గణపతి పూజ, శ్రీ గణేశారాధన, శ్రీ గణేశోపాసన వంటి పుస్తకాలను అందజేయడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని పురోహితులు చెబుతున్నారు

కష్టాలను తొలగించే శని త్రయోదశి

కష్టాలను తొలగించే శని త్రయోదశి

భారతీయ ఖగోళశాస్త్రం ప్రకారం నక్షత్ర, గ్రహకూటములు ఓ వ్యక్తి పుట్టుక మెుదలు అతని జీవిత పర్యంతం ప్రభావితం చేస్తారుు. గ్రహాల స్థితిని అనుసరించి అతని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ గ్రహాలన్నింటికన్నా శని గ్రహం ప్రభావం మానవులపై ఎక్కువగా ఉంటుంది. 

విశ్వాన్ని గ్రహాలు ప్రభావితం చేస్తున్నా... శనీశ్వరుడి ప్రభావం చాలా తీవ్రమైనదని చెప్పవచ్చు. మానవులకు ఎదురయ్యే కష్టసుఖాలకు, వారి వారి కర్మల అనుసారంగా ఫలితంగా ప్రసాదించేది శనిదేవతనే! సాధారణంగా శనిదేవతపై అనేకమందిలో చాలా రకాలైన అపోహలున్నాయి. శనీశ్వరుడి పేరు చెప్పగానే ఉలిక్కిపడతాం. నామాన్ని ఉచ్ఛరించడానికి సైతం వెనకాడతాం. ఆయనకు ఆగ్రహం కలిగే పనుల్ని చేయరాదని తీర్మానించుకుంటాం. శనీశ్వరుడిని ఆహ్వానించినట్టవుతుందని తైల పదార్థాలు వేటినీ చేతులతో అందుకోం. ఆయన దృష్టి మనపైకి సోకరాదని పదే పదే కోరుకుంటాం. కొన్ని ప్రాంతాలవారైతే శనివారంనా డు తిలా సంబంధిత వస్తువులేవీ కొనరు, తినరు. అంత భయం ఆయనంటే. శనీశ్వరుడు కేవలం క్రూరత్వానికి, పీడించడానికి మాత్రమే ఉద్దేశించబడలేదు.

ేగ్రహరూపంలో ఉండే భగవంతుడు:
సృష్టి, స్థితి, లయ కారకులు త్రిమూర్తులు. మనం చేసిన కర్మల ఫలితాలనివ్వడానికి భగవంతుడే గ్రహాల రూపంలో అవతరించాడు. ఒక్కో గ్రహానికి ఒక్కో దేవత మూల పురుషుడు. సూర్యుడు, చంద్రుడు, మార్స్‌, మెర్క్యు రీ,బృహస్పతి, వీనస్‌, శని గ్రహాలకు వరుసగా శ్రీరాము డు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, బుద్ధుడు, వామనుడు, పరశురాముడు, కూర్మావతార విష్ణువు, వరాహస్వామి, మత్స్యావతార స్వామి ఆవహించి ఉన్నారు. అందువల్ల గ్రహాలు దైవాంశసంభూతులని అర్థంచేసుకోవాలి. గ్రహకూటములు రాజ్యాలను కూల్చడానికే కాక మొత్తం ప్రపంచం ఉనికికే మూలం.

పూర్వజన్మ కర్మ ఫలం:
ఓ వ్యక్తి పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితాలనే ఈ జన్మలో అనుభవిస్తాడు. అందుకే ప్రతి వ్యక్తీ తన మహర్దశ, అంతర్దశలను తెలుసుకోవలసిన అవసరం ఉంది. జీవితంలో ఎదు రయ్యే చేదు అనుభవాలనుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అవసరం. శని మంచి దృష్ట్టితో ఉంటే జీవితం నందనవనమవుతుంది. అదే శనిదేవుడు వక్రదృష్టి పడిందంటే అంతే సంగతులు. ఆయన అనుగ్రహముంటే రాజ్యాలేలే చక్రవర్తులవుతారు. ఆయన గనుక పట్టుకు న్నాడంటే అమీరులయినా బికారులవడం ఖాయం. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవలసిన అంశం. చెడు కార్యాల్లో నిమగ్నమైనవారినే శనీశ్వరుడు పీడిస్తాడు.

ఫలితం అనుభవించాల్సిందే:
ఎంత దైవాంశసం భూతులైనా వారి వారి కర్మలననుసరించి ఫలితాలను అనుభవించి తీరాలి. చెడుకార్యాలకు పాల్పడినవారిని శనిదేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. పురాణాల ప్రకారం సూర్యభగవానుడు కర్మలకు సాక్షి అయితే, శనిదేవుడు వాటి ఫలితాలను నిర్దేశిస్తాడు. ఆయా ఫలితాలను మాతృగర్భంనుంచి వెలువడిన మరుక్షణం నుంచీ అనుభవించడం మొదలవుతుంది. మంచి కార్యాలు చేసినవారికి శనిదేవుడు చల్లగా చూసి అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాడు. ఇది అర్థం చేసుకోనివారు శని భగవానుని క్రూరాత్మునిగా భావిస్తారు. ఇది కేవలం మూర్ఖత్వం. శని దేవుడికి భయపడడం అవివేకం. ఆయన మానవ కర్మలకు ఫలితాలనిచ్చే దైవం. అలుపు సొలుపూ లేకుండా బిజీగా ఉండే లైఫ్‌లో కొంచెం సమయాన్ని సత్కార్యాలకు కేటాయించాలి. నిజాయితీగా జీవించాలి.

భయపెట్టే దేవుడు కాదు:
భగవంతుడు శనిదేవుణ్ణి జీవరాసుల కర్మల ఫలితాలను ఇచ్చే వర్రపదాయినిగా బాధ్యతలు అప్పగించాడు. ఆయన తన బాధ్యతలను నిజాయితీగా, ఖచ్చితత్వంతో సమవర్తిగా నిర్వహిస్తాడు. ఇందులో ఎటువంటి పక్షపాతబుద్ధి లేదు. దీనికోసం ఆయనను పూజించాలే కానీ, భయపడకూడదు. ప్రకృతి నియమాలను అనుసరించి ఏ జీవి అయినా తన వంశపారంపర్య లక్షణాలను వదులుకోడు. శని భగవానుడు మహర్షి కశ్యపునకు మనవడు. కశ్యపాత్మజుడైన సూర్యభగవానుడికి కుమారుడు. ఈ చుట్టరికమే ఆయనను మిగతా దేవతలకన్నా ప్రత్యేకమైనవాడిగా చేసింది. శనిదేవుడు మంచి మార్గంలో నచిచే మానవులకు సేవకుడిలా, ముక్తిధామానికి కొనిపోయే మార్గదర్శిలా కూడా పనిచేస్తాడు. శనిదేవుని బంధుగణమంతా గొప్ప అధిదేవతలు. సూర్యునికి కుమారుడు, విష్ణువు అంశ అయిన శనీశ్వరుడికి సంధ్య, ఛాయలు మాతృమూర్తులు. మను సౌవర్ణి, యమధర్మరాజులు సోదరులు. యమున, భద్ర నదులు సోదరీమణులు. వీరందరిలోని దైవాంశలు కలిగిన శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఎన్నో మార్గాలున్నాయి.

ఓర్పు, సహనం ముఖ్యం:
మంచికన్నా చెడు రాజ్యమేలే కలియుగంలో శని అనుగ్రహం సంపాదిం చాలంటే, ఓర్పు సహనం ఉండాలి. అవినీతి, అపసవ్య మార్గాలలో పనులు సాధించుకోవాల నుకునేవారు, ధనార్జన చేసేవారు తొలుత విజయం పొందగలిగినా చివరకు దక్కించుకునేది అశాంతినే! తాత్కాలిక విజయాలు సాధించినవారు శనిమహరాజు కోర్టులో తప్పక శిక్షించబడతారు. ఆయన కోర్టులో లంచాలకు, రికమెండేషన్లకు తావులేదు. మానవులు తాము చేసిన ప్రతి దుష్కర్మకు జవాబు చెప్పి తీరాల్సిందే! అక్కడ ఏ దేవుడూ శనీశ్వరుడి బారినుంచి తప్పించలేరు. ఆయన ఒక్కసారి తీర్పు ప్రకటిస్తే దానికి తిరుగులేదు. త్రిమూర్తులలో ఎవరూ దానిని సరిచేయలేరు. కనీసం అడ్డుకోలేరు. ఆయన ముందు మంచిపనులు, ప్రార్థనలు, భక్తియుతులనే పిటిషన్లు తప్ప ఏవీ పనిచేయవు. శనిభగవానుడి తీర్పు సుప్రీంకోర్టు తీర్పేనని గుర్తుంచుకోవాలి. శనిదేవుడు చెడ్డవారిని, తప్పులు చేసినవారిని పట్టి పీడించడంద్వారా వారిలో పశ్చాత్తాపాన్ని కలుగజేస్తాడు. మోక్షం దిశగా వారి ఆలోచనలను పురిగొల్పుతాడు. గర్వంతో విర్రవీగేవారిని నేలకు దించుతాడు. స్వర్ణకారుడు పుటం వేసి బంగారాన్ని కాల్చి నగలను తయారు చేసినట్లుగా...శనీశ్వరుడు మానవుల్లోని మాలిన్యాన్ని కడిగేస్తాడు. 

శని దండనాధికారి: 
జ్యోతిష్య శాస్తర్రీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకౄఎత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాతగా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది. బౌతిక దృష్టిలో శని క్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.. ఈశ్వర శాసనంలో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిష్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలా శని దండన విధిస్తాడు.

శనికి ప్రీతిపాత్రమైన రోజు:
శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి, త్రయోదశికి అధిపతి కామదేవుడు. అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలకు శని అధిప తి అయ్యాడు. అందుకే శనిత్రయోదశి శనికి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది. క్షీరసాగర మదనం జరిగి అమృ తం ఉద్భవించిన తరువాత, హాలాహలాన్ని దిగ మింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతఙ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్లారు. అది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ సమయంలో శివుడు, మన గణాల ప్రకారం 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద తాండవం చేసాడట. ఆ శివ తాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది. ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోషమంటే మునిమాపు వేళ దోషం అంటే రాత్రి అని అర్ధం చంద్రున్ని దోషాకరుడు అని అంటారు, రాత్రికి కారణమయ్యేవాడనే అర్ధం ప్రదోషమంటే దోష ప్రారంభకాలం అంటే రాత్రి ప్రారంభ సమయం.


ప్రదోషకాలంలో దానదర్మాలు:

ప్రదోష కాలంలో చేసే పూజాపునస్కారాలు దానధర్మాలు మామూలు సమయం లో చేసే వాటికంటే అధిక శుభఫలితాలనిస్తాయి, అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలనిస్తాయి. శని త్రయోదశి ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయడం చాల విశేషంగా లాభిస్తుంది. ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలనిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతక రీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్న వారు. ఏలిననాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని వలన ఎవరైతే పీడింప బడుతున్నారో అటువంటివారు ఈ రోజు శని పరిహారాలు అంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం, ఉపవాసం ఉండడం, రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టడం, నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెని దానం చేయడం. నల్ల కాకికి అన్నం పెట్టడం, నల్ల కుక్కకి అన్నం పెట్టడం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుము దానం చేయడం మంచిది. ఈ విధంగా శనిని పూజించి ఆరాధిస్తే్త బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషం, దారిద్య్రం తొలగుతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహంలో ఆటంకాలు, శత్రు భయం, కోర్టు సమస్యలలో ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయి.

సుబ్రహ్మణ్య షష్ఠి


సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి దీపావళి పండుగ తర్వాత జరిగే ఉత్సవం. దీనినే సుబ్బరాయషష్టి అని, స్కందషష్టి అని కూడా అంటారు. సుబ్రమణ్యేశ్వరుడు జన్మించిన రోజును ఈ పండుగగా జరుపుకుంటాము. ముఖ్యముగా తమిళనాడు లోను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు, కుమారస్వామివార్ల దేవాలయాలు కల ప్రతి చోటా ఈ రోజు విశేష పూజలు జరుపుతారు. ఆలయ సమీపంలో తిరునాళ్ళు వినోద కార్యక్రమాలు జరుపుతారు. 


జన జీవనంలో పలు రకాలుగా ప్రచారంలో ఉండి భక్తుల పాలిట కల్పవల్లిగా ఈ పర్వదినం అలరారుతుంది. తెలుగునాట ఈ పండుగ వల్లనే సుబ్బమ్మ, సుబ్బారాయుడు, సుబ్బి, సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, బాల సుబ్రహ్మణ్యం లాంటి పేర్లు విస్తృతంగా పెట్టుకోవటం జరుగుతోంది. శివుడి రెండో కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామిని ఆరోజున ఆరాధిస్తారు. ఈ స్వామినే కార్తికేయుడు అని, స్కందుడు అని, షణ్ముఖుడు అని, గుహుడు, కుమారస్వామి అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. తారకాసుర సంహార నేపథ్యం ఈ కుమారస్వామి జననానికి సంబంధించిదే. మహా బలిష్టుడైన తారకాసురుడిని కుమారస్వామి జయించగలిగాడు కనుక జయాన్ని కోరి ముందుకు నడిచేవారు ఈ స్వామిని పూజించుకోవటం, తలచు కోవటం కన్పిస్తుంది. అతి సామాన్య ప్రజల నుంచి ఉన్నత కులీనుల దాకా సంతానం కోసం, శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠినాడు ప్రత్యేకంగా పూజిస్తుంటారు. సంప్రదాయకంగా పాము మంత్రాలను సాధన చేసేవారు ఈ రోజున ఉపవాసం ఉండి ఆ మంత్రాన్ని మరింతగా జపిస్తుంటారు.



సుబ్రహ్మణ్య స్వామికి ఉన్న పేర్లు 

షణ్ముఖుడు + ఆరు ముఖాలు గలవాడు

స్కందుడు + పార్వతి పిలచిన పదాన్ని బట్టి
కార్తికేయుడు + కృత్తికా నక్ష్త్ర సమయంలో అవతరించాడు
వేలాయుధుడు + శూలము ఆయుధంగా గలవాడు
శరవణభవుడు + శరములో అవతరించినవాడు
గాంగేయుడు + గంగలోనుండి వచ్చినవాడు
సేనాపతి + దేవతల సేనానాయకుడు
స్వామినాధుడు + శివునకు ప్రణవ మం్తమ్రు అర్ధాన్ని చెప్పినవాడు
సుబ్రహ్మణ్యుడు + బ్రహ్మజ్ఞానము తెలిపినవాడు
మురుగన్‌ + తమిళంలో పిలుస్తారు



పండుగ విశేషాలు: 

ఆనాడు ఉదయాన్నే స్నానం చేయటం, ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాలలాంటివి అక్కడ అర్పిస్తుంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. పురాణాలలో సుబ్రహ్మణ్యస్వామి వివాహితుడుగా కనిపిస్తాడు. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను అందుకే ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది. సుబ్బరాయుడి పెళ్లి చూచి వద్దాం రండి అన్న పాట పిల్లలు ఈ సందర్భంగానే పాడేవారు.



బ్రహ్మచారికి భోజనం: 

అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి (కొన్ని ప్రాంతాల్లో ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు) పూజ చేయటం, వసా్తల్రు సమర్పించి భోజనం పెట్టి గౌరవించటం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో, షష్టి నాటి ఉపవాసం ఉండి మరుసటి సప్తమి నాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కూడా ఆనావయితీ.



తమిళనాట కావడి మొక్కులు: 

తమిళ ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడి పంచదారతోనూ, పాలతోనూ అనేది మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ బాగా ప్రసిద్ధికెక్కింది. సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్ళగానే వానలు కూడా వెనక్కు తగ్గుతాయని కొందరి నమ్మకం. అలా వానలో తగ్గాక చేసుకోవలసిన పనులను చేసుకోవటానికి అనువైన కాలంగా రైతులు దీన్ని భావిస్తారు. సుబ్రహ్మణ్య ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం ప్రజల్లో ప్రచారంలో ఉంది. ఉపవాసం ఉండి సర్ప మంత్రాన్ని ఈ రోజున దీక్షగా చేస్తే మళ్ళీ సంవత్సరం వరకూ గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని కూడా ఓ నమ్మకం ఉంది.



సామాజిక అంశం: 

సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం వల్ల సామాజిక ప్రయోజనం ఏమిటి? అని అనేవారికి ఈ వ్రత విధిలోని దానాలే సమాధానం చెబుతుంటాయి. మార్గశిర మాసమంటే చలి పులిగా మారి పీక్కుతినే మాసం. ఈ మాసంలో చలి బాధను తోటివారు పడకుండా చూడమని సందేశం ఇస్తుంది. ఈ వ్రతం అందుకే ఉత్తరీయాలు, కంబళ్ళు, దుప్పట్లు లాంటివి వత్రంలో భాగంగా దానం చేయాలని పెద్దలు చెబుతుంటారు. మార్గశిర షష్ఠినాడే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి లాంటి వ్రతాలను కూడా చెయ్యాలని వ్రత గంథాలు పేర్కొంటున్నాయి. సుబ్బరాయుడు బాలుడైన బాల సుబ్రహ్మణ్యంగా పెద్దవాడైన సుబ్రహ్మణ్యంగా, స్కందుడుగా, షణ్ముఖుడుగా ఇలా అనేక రకాలుగా, అనేక రూపాలలో ఈ షష్ఠినాడు పూజలందుకోవటం జరుగుతుంది.



పండుగల విశిష్టత: 

సాంప్రదాయాలు, ఆచారాలు, శాంతిసహృద్భావాల మేలు కలయికే పండుగ. సాధారణముగా పండుగలన్నీ ఏదైనా దేవుడు లేదా దేవతకు సంబంధించి, జాతి మతపరంగా జరుపుకుంటారు. సంవత్సరం పొడవునా వచ్చే పండుగల్లో దేని ప్రాముఖ్యత , విశిష్టత దానికే వుంది. భాష లేదా ప్రాంతాన్ని బట్టి పండుగలు జరుపుకొనే విధానములో స్వల్ప తేడాలు వున్నప్పటికీ వాటిలోని ఏకసూత్రత మాత్రము చెడదు. సంవత్సరం పొడవునా చైత్ర మాసముతో మొదలిడి ఎన్నో పండుగలు వున్నాయి. భారతీయ ఆధ్యాత్మికాచారాలలో పండుగలకున్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. పండుగను అభిమానించని భారతీయుడు ఉండడు. ప్రత్యేకంగా పండుగను చేసుకోని నాస్తికులు సైతం పండుగ దినాలను మాత్రం ఖచ్చితంగా సంతోషంగా అనుభవించే తీరతారు. అది పూజతో నిమిత్తం లేనిది. సంతోష ఉత్సాహాలకు నిలయమైనది. కాబట్టే పండుగ అనే భావన ఎటువంటివారిలోనైనా అలౌకికానందాన్ని పంచుతుంది. ఒక్కో పండుగ ఒక్కో ప్రత్యేకమైన శోభను చేకూరుస్తూ మానసికోల్లసాన్నిస్తూ గృహాలకు కొత్త అందాలను ఇస్తుంది. అందుకే చిన్నా, పెద్దా అందరూ వీటికోసం ఎంతో ఆర్తిగా ఎదురుచూస్తుంటారు. పండుగల సంబరాలు చిన్న పిల్లలవే అయినప్పటికీ ఆ ముచ్చట్లను పెద్ద్లలు కూడా ఎంతో సంతోషంగా అనుభవిస్తారు.



శోభాయమాన తిరునాళ్లు: 

సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి దీపావళి పండుగ తర్వాత జరిగే ఉత్సవం. ముఖ్యముగా తమిళనాడు లోను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు మరియి కుమారస్వామివార్ల దేవాలయాలు కల ప్రతి చోటా ఈ రోజు-దీపావళి అమావాస్య తరువాత షష్టి నాడు.. విశేష పూజలు జరుపుతారు. ఆలయ సమీపంలో తిరునాళ్ళు వినోద కార్యక్రమాలు జరుపుతారు...తెలుగునాట దీపావళి పండుగకి ముందే వచ్చే మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్బరాయుడి షష్ఠి అని, సుబ్రహ్మణ్య షష్ఠి, అని, స్కంద షష్ఠి అని అనేక రకాలుగా పిలుచుకోవటం కనిపిస్తుంది.

ఆరాదన అంటే ఏమిటి ?



మనకు ప్రియమైన స్నేహితుడు మన ఇంటికి వస్తాడు అని తెలిసిందనుకోండి, మనం ఎంత సంతోషిస్తాం. విషయం తెలిసినప్పటి నుండే ఇంటిని శుభ్రపరచుకుంటాం, మంచిగా అలంకరించుకుంటాం. రాగానే తనకి ఇష్టమైన ఆహారా న్ని ప్రత్యేక శ్రద్ధతో, స్వయంగా మనమే వండి రుచిగా తయారుచేస్తాం. మన స్థాయిని బట్టి వీలైతే వెండి కంచంలో వడ్డిస్తాం. ఏదో మనం చూపే అభిమానం. ఆ వ్యక్తికి అసలు అవసరం కేవలం ఆహారం మాత్రమే కానీ వెండి కంచం కాదు. ఆ వ్యక్తి మనం చేసిన పదార్థాన్ని స్వీకరిస్తాడు తప్ప కంచాన్ని కాదు. మన వెండి పాత్రలు బాగున్నాయి అని తీసుకేళ్తానంటే ఒప్పుకుంటామా, ఒప్పు కోనే ఒప్పుకోము. అది పద్ధతే కాదు. అట్లానే మనం భగవంతునికి అర్పించేవి పాత్రల వంటివి, భగవంతుడు మన ప్రేమను మాత్రమే స్వీకరిస్తాడు. భగవంతుడు కోరేది మన నుండి కృతజ్ఞత, ప్రేమ కానీ వస్తువులు కాదు. నేను కేవలం ప్రేమను మాత్రమే ఇస్తాను అంటే తగదు. అట్లాంటిది నిద్రాహారాలు మాని తపస్సు ఆచరించే ఋషులకు వర్తించవచ్చు కానీ మనకు సరిపడదు. 

శ్రీవారి పచ్చకర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటన ధరిస్తే..? 
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రతి నిత్యం పూజారులు పచ్చ కర్పూర తిల కాన్ని పెడుతుంటారు. ఈ పచ్చ కర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటన ధరిస్తే సాక్షాత్తు వెంకన్న స్వామి అనుగ్రహం లభిస్తుందని పురోహితు లు అంటున్నారు. ఇంకా స్వామివారి ప్రసాదమైన పచ్చకర్పూరాన్ని పాలల్లో వే సుకుని తాగితే స్వామివారి ప్ర సాదం సేవించినంత ఫలితం ఉంటుంది. అలాగే వెంకన్న పచ్చకర్పూరాన్ని కుంకుమపువ్వు రెంటినీ కలిపి డబ్బుల డబ్బాలో పెట్టుకుంటే ధనలాభం కలుగుతుంది.వ్యాపారాలు ప్రతిరోజూస్వామివారి పచ్చక ర్పూ ర కుంకుమను నుదుటికి పెట్టుకుంటే వ్యా పారం అభివృద్ధి చెందుతుందని తితిదే అర్చకులు అంటున్నారు. ఇంకా స్వామివారి పచ్చకర్పూరంతో హోమం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని వారు చెబుతున్నారు. స్వామివారి పచ్చకర్పూరాన్ని నీటిలో కలిపి ముక్కు, ఎద, నుదుటికి రాసుకుంటే తలనొప్పి, జలుబు నయమైపోతాయి. 

స్వామివారి పచ్చకర్పూరాన్ని కొబ్బరినూనెలో కలిపి తలకు పెట్టుకుంటే జుట్టు సుగంధమయం అవుతుంది. అలాగే స్వామివారి పచ్చకర్పూరాన్ని తీపి పదార్థాలతో కలిపి దేవునికి నైవేద్యంగా పెట్టిదానం చేస్తే ఆ యింట శుభకార్యాలు త్వరగా జరుగుతాయి. స్వామివారి పచ్చకర్పూరాన్ని దే వాలయానికి దానం చేస్తే రాజసన్మానం, సంఘంలో గౌరవమర్యాదలు లభిస్తాయని తితిదే ప్రధాన అర్చకులుఅంటున్నారు.స్వామివారి పచ్చకర్పూరం,పాలతోమంగళవారం సుబ్ర హ్మణ్యస్వామికి అభిషేకం చేసి ఆపాలను తాగుతూ ఉంటే అన్ని రకాల గర్భదో షాలు నివృత్తి కలిగి సంతానం లేని వారికి సంతానం యోగం కలుగుతుంది. 
కుంకుమ, ఎర్ర చందనం కలిపిన రాగిపాత్రలోని నీటితో స్నానం చేయడం వలన సూర్య గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే కుంకుమ, గంధం కలిపిన నీటిని శంఖంతో పో సుకుంటే చంద్రగ్రహ దోషాలు దూరమవుతాయి. గంధం, తిలలు కలిపిన రజిత పాత్రలోని నీటితో స్నానమాచ రించడం వలన కుజదోషాల తొలగిపోతాయి. ఇక నదీ సాగర సంగమంలోని నీటిని మట్టిపాత్రలో పోసి స్నానం చేసి నట్లయితే బుధగ్రహ దోషాలు తొలగి పోతాయి. మర్రి, మారేడు కాయలను బంగారు పాత్రలోని నీటిలో వేసి స్నానం చేస్తే గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. శుక్రుడిని ధ్యానిస్తూ రజిత పాత్రలో ని నీటితో స్నానం చేయడం వలన శుక్ర గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుం ది. ఇక నువ్వులు, మినువులు కలిపిన లో„హ పాత్రలోని నీటితో స్నానం చేయడ ం వలన శనిగ్రహ ప్రభావం తొలగిపోతుంది. ఇక గేదె కొమ్ము (డొల్ల)తో స్నానం చేయడం వలన రాహు గ్రహ దోషాలు తొలగిపో తాయి. పవిత్రమైన మట్టిని కలుపుకుని స్నానం చేయడం వలన కేతు గ్రహ దోషాలు తొల గిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

వినాయకునికి తులసీ పత్రమంటే అస్సలు ఇష్టముండదట! 
వినాయకునికి తులసీపత్రమంటే అసలుఇష్టముండదట! ఎందుకో తెలుసా?
అయితే ఈ కథనం చదవండి. వినాయకచవితినాడు అనేక పత్రాలు, పుష్పా లతో పూజిస్తాం. అయితే తులసి పత్రం మాత్రం వినాయక పూజకు నోచుకోదు అంటున్నారు పండితులు సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడక పోవటానికి కారణమేమిటంటే ఒకసారి గంగాతీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణ యం చేసుకోమని కోరింది. దానికి వినాయకుడు కాదనటంతో ధర్మధ్వజ రాజపుతక్ర కోపించి, దీర్ఘ కాలం బ్రహ్మ చారిగా ఉండమని శపించింది. ప్రతి గా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకా లం ఉండమని ప్రతిశాపమిస్తాడు. వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాకుమార్తె స్వామి ని మన్నించమని వేడుకోగా, వినాయకుడు శాంతి ంచి,రాక్షసుని చెంత కొంతకాలంఉండి,ఆపై పవిత్ర… మై న తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు. అందు కే వినాయకుడు తులసిని తన పూజాపత్రిలో ఇష్ట పడడని పండితులు అంటున్నారు.

పూజ గదిలో దేవీ-దేవీతల ఫోటోలు ఎలా అమర్చుకోవాలి? 
పూజ గదిలో దేవీ-దేవీతల ఫోటోలు ఎలా అమ ర్చుకోవాలో తెలుసా? పూజ గదిని సాధ్య మైనంత వరకూ ఈశాన్య లేదా తూర్పు లేదా ఉత్తర దిక్కున ఏర్పాటు చేయాలి. దీనికికారణం తెల్లవారు జాము నే సూర్యుడు ఇంటికి ఈశాన్య దిక్కున ఉంటాడు. పూజగదిలో ఆదిదేవుడైన గణపతి దేవుని విగ్రహ ము లేదా చిత్రముమధ్యలో అమర్చుకోవాలి. పురు ష దేవతలు గణపతికి విగ్రహానికి కానీ ఫోటోకి కాని కుడి వైపున, స్త్రీ దేవతలు గణపతికి ఎడమ వైపున వచ్చేవిధంగా అమర్చుకోవాలి. సీతారాము డు, లక్ష్మీనారాయణడు వంటి ఫోటోలను గణపతి దేవునికి కుడి వైపు వచ్చే విధంగా అమర్చుకోవాల ని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

నల్లమలకొండల్లో ఉన్న మాధవి దేవి శక్తిపీఠం! 
108 శక్తి పీఠాల్లో శ్రీశైలం మాధవి దేవి ఆల యం సుప్రసిద్ధమైనది. సతీదేవి కంఠభాగం ఇక్కడ పడినట్లుగా చెపుతారు. అరుణాసురడనే రాక్షసుని అమ్మవారు ఈ ప్రదేశంలో వధిం చినట్లు ప్రతీతి. ఇదే శ్రీశైలం. దీనిని దక్షిణ కైలాసమని, దక్షిణ కాశి అని అభివర్ణిస్తారు. ఈ శక్తిపీఠ క్షేత్రములో, శ్లోకం ప్రకారం (భ్రమరాంబ అనబడే) మాధవీదేవి ఆరాధించబడుతున్నది. ఆదిశంక రాచార్యులు ఇక్కడ తపస్సు చేసినట్లు, సౌందర్యలహరీ స్త్రోత్రం ఇక్కడే రచించిన ట్లు, దీనిని కనకధారా స్తోత్రంగా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాలో నందికొట్కూరు తాలూకాలో ఉంది శ్రీశైల దేవీ పీఠం. ఇది నల్లమలకొండల్లో ఉంది. మాచర్ల దాకా రైల్లో వెళ్లవచ్చు. డోర్నాల నుండి ఘాట్‌ రోడ్డులో 51 కి.మీ. హైదరాబాద్‌ నుంచి బస్సుల్లో నేరుగా వెళ్ళొచ్చు. ఇకపోతే అహోబిలము 160 కి.మీ స్వామివారు మల్లికార్జునుడు. ఈ లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలల్లో ఒకటి రాష్ట్రంలోని అన్ని పట్టణాల నుండి బస్సుల్లో ఇక్కడకు చేరవచ్చును.

మంగళవారం దుర్గమ్మ తల్లికి దీపమెలిగిస్తున్నారా.. 
మంగళవా రం పూట దుర్గమ్మ తల్లికి నేతితో దీపమెలిగిస్తే సకల సంపదలు చే కూరుతాయని పురోహితులు అంటున్నారు. మంగళవారం రాహుకాలంలో దుర్గమ్మ తల్లికి దీపమెలిగించే మహిళలు నిష్ఠతో అమ్మవారిని దుర్గాష్టకంతో స్తుతిస్తే ఈతిబాధలు తొలగిపోయి, సుఖసంతోషాలు చేకూరుతాయి. ఇంకా మం గళవారం ఉదయం సూర్యోదయానికి ముందే లేచి శుచిగా తలస్నానమాచ…రిం చి ఇంటిని, పూజామందిరమును శుభ్రం చేసుకుని పువ్వులు, ముగ్గులతో అలం కరించుకోవాలి. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 4.30 వరకు ఆలయాల్లో జరిగే రాహుకాల పూజను ముగించుకోవాలి.అనంతరం సాయంత్రం ఆరు గం టల ప్రాంతంలో గృహంలో దీపమెలిగించి పాయసం నైవేద్యంగా సమర్పించ కోవాలి. దీపమెలిగించే సమయంలో దుర్గా స్తోత్రాన్ని 9 తొమ్మిదిసార్లు పఠిస్తే అనుకున్నకార్యాలుదిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు. 

వెండి దీపాలతో ఆరాధన - ఫలితాలు,
నమ్మకము ప్రధానము నమ్మకము మూఢనమ్మకము కాకూడదు.
-వెండి ప్రమిదల్లో నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూనెతో కా నీ, పొద్దుతిరుగుడు నూనెతో కానీ, దీపారాధన చేస్తే వారికి వారి ఇంట్లోవారికి అష్ట నిధులు కలుగును. గణపతిని లక్ష్మీనారాయణ స్వామికి లలితా త్రిపుర సుందరీదేవీకి, రాజ రాజేశ్వరీ అమ్మవారికి సాలగ్రామాలకు శ్రీగాయత్రీ మాత కు గానీ, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తారో వారు అనుకున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తపుతాయి. ఇవేకాకుండా వివిధ గ్రహాదిదేవత లు, దైవాలకు వెండి దీపాలతో ఆరాధన చేస్తే ఈ క్రింది ఫలితాలు పొందవచ్చు.

రుద్రుని ప్రతిరూపాలు రుద్రాక్షలు 
రుదక్ష్రలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాము. రుదక్ష్రలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుదక్ష్రలు ధరించడంవల్ల అనుకున్న పనులు నెరవేర తాయి. ఎలాంటి కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేం దుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుక రుదక్ష్ర. ఆత్మసాక్షాత్కారాన్ని పొందడా నికి రుదక్ష్ర అసలైన మార్గం చూపుతుం ది. రుదక్ష్రను ఋషులు భూమికీ, స్వర్గానికీ మధ్య వారధిగా భావిస్తారు.తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు. అనారోగ్య సమస్యలతో జారిపోతున్నవారు రుదక్ష్రలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమవుతా యి. అంతేకాదు, ఏవైనా వ్యసనాలకు లోనయినవారు తమ అలవాటు మంచిది కాదని తెలిసి, అందులోంచి బయట పడలేకపోతున్నట్లయితే రుదక్ష్రమాలను ధరిస్తే చాలా మంచి ఫలితముంటుంది. నొసటన విభూతి, కంఠాన రుదక్ష్రమాల ధరించి శివనామ జపం చేస్తున్న వ్యక్తిని దర్శించుకుంటే త్రివేణీ సంగమ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది. రుదక్ష్రలను సర్వపాపములనూ నశింపచేసే సరస్వతీ నదితో పోల్చారు మునులు. మెడ, చే తులు, చెవులకు, రుదక్ష్రలను ధరించినవారు ఏ అపజయాలు లేకుండా తిరుగులేనివారిగా భాసిస్తారు. ఎవరి మెడలో రుదక్ష్ర ఉంటుందో వారు ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారని పురాణాలు చెబుతున్నాయి. రుదక్ష్రలపై ఉండే ముఖాల ఆధారంగా రుదక్ష్రలను ఇరవ య్యొక్క రకాలుగా విభజించారు.

రుదక్ష్రలను ధరించిన వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి,
1. రుదక్ష్రమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు.
2. రుదక్ష్ర మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు.
3. కుటుంబసభ్యులు అయినప్పటికీ ఒకరి రుదక్ష్రమాలను మరొకరు ధరించకూడదు.
4. రుదక్ష్రమాలను ఉంగరంలో ధరించకూడదు.
5. రుదక్ష్రమాలను ధరించి నిద్రపోకూడదు.
6. రుదక్ష్రమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు.
7. స్త్రీలు రుతుసమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు.

రుదక్ష్రమాల ధారణవిధి : 
సోమవారం లేదా పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభసమయంలో రుదక్ష్రలను శుద్ధిచేసి శివపూజచేయాలి. ఆతర్వాతే రుదక్ష్రనుదరించాలి. రుదక్ష్ర ను ధరించినవెంటనే ఏదో అద్భుతం జరిగిపోతుంది అని ఎదురుతెన్నులు చూస్తే ఫలితం ఉండదు. సత్వర ఫలితాన్ని ఆశించేవారు, రుదక్ష్రల పూర్తిసమాచారాన్ని సేకరించి,సిసలైన పద్ధతిప్రకారం, గురువుసమక్షంలో ధరించి, సాధన చేయాలి.

రుదక్ష్రమాలను ధరించవలసిన తిథులు : 
పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి నాడు ఈశ్వరుని రుదక్ష్రలతో పూజించడం మహాశ్రేష్టం. రుదక్ష్రలను ధరిస్తే సర్వ దుఃఖాలు తొలగిపోతాయి. సకల సంపదలూ ఒనగూడుతాయని స్కాందపూరా ణం చెబుతోంది. జావా, సమత్రా, ఇండోనేషియా, నేపాల్‌ మొదలైన చోట్ల, ఇండియాలో చాలా కొద్ది ప్రదేశాల్లో రుదక్ష్ర చెట్లు పెరుగుతాయి.