ఆరోగ్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆరోగ్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

నాన్న కావాలనుకుంటున్నారా?

అనేక మంది దంపతులకు వివాహమై కొన్నేళ్లు గడుస్తున్నా సంతానలేమి వారిని వేధిస్తూ ఉంటుంది. సంతాన భాగ్యం కోసం వారు చేయని పని  ఉండదు. పూజలు పునస్కారాల , మరోవైపు సంప్రదించని వైద్యులంటూ ఉండరు. 
  యాంత్రిక జీవనంలో భార్యా భర్తల మధ్య శృంగార సమయం చాలా తక్కువ. పని ఒత్తిడి వల్ల సెక్స్‌ను ఎక్కువగా ఎంజాయ్ చేయలేక పోతున్నారు. అనేక మంది దంపతులు వారానికో, పదిరోజులకో మొక్కుబడిగా సెక్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఇలాంటి వారికి సంతానం కూడా ఆలస్యంగానే కలుగుతోంది. 

దంపతులు సెక్స్‌ కార్యక్రమానికి ఎక్కువ రోజులు దూరంగా ఉండటం కూడా ఒక కారణంగా చెపుతున్నారు. 
ఇలాంటి సమయంలో కూడా నిర్ణీత సమయంలో సెక్స్ చేయడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం ఉందని వైద్యులు చెపుతున్నారు. 

రుతుక్రమం మొదలైన పదో రోజు నుంచి 20వ రోజు వరకు ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొనాలి. అలా కలవక పోయినట్టయితే పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువేనంటున్నారు. అలాగే, సెక్స్ తర్వాత వీర్యం సరిగా రాకపోయినా వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే మంచిదని వారు చెపుతున్నారు.

Related articles: 

మగ పిల్లలు పుట్టడానికి మునులు చెప్పిన రహస్యం...

మెంతులు తింటే ఇక మీ ఆవిడకు వాంతులే ?

బాహుబలి లో మీరు చూసిన వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉందో మీకు తెలుసా?

వ్యభిచారం: రోజుకి 5 లక్షలు అంటున్న హీరోయిన్ చెల్లెలు...







మెంతులు తింటే ఇక మీ ఆవిడకు వాంతులే ?




భారత దేశ సాంప్రదాయ వంటకాల్లో ఉపయోగించే వస్తువులలో అతి ముఖ్యమైనవి మెంతులు. అందువలనే మన పూర్వికులు మన ఆహార పదార్థాల్లో మెంతులకు ముఖ్యత్వం ఇచ్చి ఉన్నారు. మెంతులను ప్రతి రోజూ ఆహారంలో తీసుకుంటూ వస్తే పురుషులకు సెక్స్ కోరికలు పెరుగుతాయి. మెంతులు పురుషుల సెక్స్ హార్మోన్‌లను రెచ్చగొట్టేందుకు సహకరిస్తాయి. మెంతుల్లో ఉన్న సపోనిన్ అనే పదార్థం పురుషుల సెక్స్ హార్మోన్ టెస్టోస్టిరన్‌ పనితీరును మెరుగుపరుస్తుంది.

ఈ విషయం తాజాగా జరిపిన అధ్యయనం ద్వారా మరోసారి రుజువైంది. ఇందుకోసం పరిశోధకులు ఇటీవల  25 ఏళ్ల వయస్సు నుంచి 55 ఏళ్ల వయస్సులోపు గల 60 మంది పురుషులను పరిశోధించారు. వారికి రోజుకు రెండు సార్లు వంతున మెంతులు, మెంతుల రసం ఇచ్చారు. ఆరు వారాల తర్వాత వారికి సెక్స్ కోరికలు అత్యధికంగా పెరిగినట్లు గుర్తించారు. 
 
అదే సమయంలో మెంతులు తినని కొందరిని పరిశోధించగా వారికి సెక్స్ కోరికలు తక్కువగానే ఉన్నట్టు తెలిసింది. దీంతో మెంతులను సెక్స్ ప్రియులకు వరప్రసాదంగా వైద్యులు అభివర్ణిస్తున్నారు. ఇక బయట మెడికల్ షాపుల్లో అడ్డమైన మందులను కొని, డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని వృధా చేసుకోకుండా, ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో మెంతులు చేర్చుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

పచ్చకర్పూరం - ఆరోగ్య విషయంలో పచ్చకర్పూరం మేలు - పచ్చకర్పూరం చరిత్ర




పచ్చకర్పూరం కోసం చిత్ర ఫలితం

తీపి పిండివంటల్లో సువాసనకు వాడే పచ్చ కర్పూరంతో శారీరక రుగ్మతలను తగ్గించుకోవచ్చునంటున్నారు ఆరోగ్య నిపుణులు.
- పచ్చకర్పూరం నూనెలో నానబెట్టి, ఆ నూనెను పడుకునే ముందు ఛాతీపైన బాగా మర్దన చేస్తే ముక్కు దిబ్బడ, దగ్గు నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
- నోటిలో పిప్పిపన్ను నొప్పితో బాధపెడుతుంటే కొద్దిగా పచ్చకర్పూరం పొడిని చిన్న ఉండలా చేసి, ఆ రంధ్రంలో ఉంచితే వెంటనే బాధ తగ్గుతుంది.
- పచ్చ కర్పూరం నూనెతో మర్దన చేయించుకుంటే కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పుల నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
- ఒక స్పూన్‌ కర్పూరం పొడిని కొబ్బరి నూనెలో కలుపుకుని ప్రతిరోజూ తలకు మసాజ్‌ చేసుకుంటే జుట్టు తెల్లబడకుండా వుంటుంది.
- పచ్చకర్పూరంలో ఉండే త్వరగా చొచ్చుకుపోయి, నొప్పిని హరించే గుణం వలన దీనిని మన మందుల తయారీలో (చర్మ దురదలకు, నొప్పులకు, దగ్గుకు, గొంతు నొప్పికి, తలను, కళ్ళను చల్లపరిచే నూనెలలో) వాడుతున్నారు. అంతేకాకుండా మన టూత్‌ పేస్ట్‌ తయారీలో కూడా ఇది ముఖ్యపదార్థంగా వుంటుంది.
- పల్చటి తెల్లని బట్టలో కొంచెం బియ్యం, కొంచెం పచ్చకర్పూరం కలిపి మూటకట్టి వాసన పీల్చితే ముక్కు దిబ్బడ, జలుబు తగ్గుతుంది.
- చిటికెడు ఉప్పు, చిటికెడు పచ్చకర్పూరం కలిపి పళ్ళు, చిగుళ్ళు రుద్దితే చిగుళ్ళ వాపు, పంటి నొప్పులు తగ్గుతాయి. పళ్ళు తెల్లగా మెరుస్తాయి.



అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామీ వారి గడ్డం క్రింద కుడా పచ్చ కర్పూరం పెడతారు ఎందుకంటే?

పచ్చకర్పూరం కోసం చిత్ర ఫలితం
స్వామికి ప్రతిరోజూ గడ్డం దిగువన ఒకటిన్నర తులాల మేలిరకం పచ్చకర్పూరం ముద్దను అద్దాలి! దీని కథ ఏమంటే, రామానుజాచార్యులు వారి కోరిక మేర తిరుమలపై నివాసం ఉంటూ, పూలతోట పెంచుతూ, నిత్యం స్వామి వారికి నవనవలాడే నాజూకు పూలు, పూల దండలను శ్రద్ధతో సమర్పించే ఆప్తశిష్యుడైన అనంతుడు ఒకనాటి ఉదయం సతీసమేతంగా పూలతోటలో నీళ్ళు పోస్తుంటాడు. దంపతుల భక్తిభావానికి, నిస్వార్థ సేవకు మురిసిపోయిన శ్రీనివాసుడు బాల వటువురూపంలో వచ్చి వారికి సహాయ పడబోగా – ఆ అల్లరి పిల్లవాడు తమ పనులకు అడ్డు తగులుతున్నాడని భ్రమించి ఆగ్రహించిన అనంతుడు అతడిపై గడ్డిపార విసురుతాడు. ఆ గడ్డపార కొన ఆ బాలుని గడ్డం క్రిందుగా రాచుకుంటూ వెళుతుంది. వెంటనే ఆ బాలుడు ఆలయంవైపు పరుగిడుతూ అంతర్థానమవుతాడు!
పచ్చకర్పూరం కోసం చిత్ర ఫలితం
తీరా, అనంతుడు పూలు తీసుకుని సాయంకాలం గర్భగుడికి వెళ్ళి చూడగా స్వామివారి గడ్డం దిగువన గాయం కనిపిస్తుంది. అతడికి వెంటనే ఉదయం జరిగిన సంఘటన గుర్తుకి వస్తుంది. పట్టరాని పశ్చాత్తాపంతో, ప్రేమాభిమానంతో అతడు తక్షణమే అక్కడ ఉన్న పచ్చకర్పూరం ముద్ద తీసుకుని గాయంపై గట్టిగా అడుముతాడు. దాంతో క్షణాలలో చిత్రంగా గాయం మాయమై – అక్కడ గుర్తుగా మచ్చ మాత్రం మిగిలిపోతుంది. అదిగో…అప్పటినుంచి స్వామివారి గడ్డంపై ఈ పచ్చకర్పూరం అద్దడమనే ఆచారం ఏర్పడింది. ఈ మచ్చ మనకు విగ్రహంలో అగుపించడం ఒక మహావింత!

అటుకులతో శరీరానికి కావలసిన పోషకాలు మీకు తెలుసా...?


మీకు తెలుసా...? చాలామంది అల్పాహారంగానో, బ్రేక్‌ఫాస్ట్‌గానో తీసుకునే 
అటుకులు కూడా ఆరోగ్యానికి శక్తినిస్తాయి. మనిషి శరీరానికి కావలసిన పోషకాలు 
ముఖ్యంగా ఇనుము (ఐరన్‌) అటుకుల్లో ఉంటుందట. అయితే వీటిని విడిగా 
తినడం కంటే... బ్రేక్‌ఫాస్ట్‌ తయారు చేసుకుని తినటంవల్ల రుచి, రుచి, పోషకాలు 
రెండూ అందుతాయి.

పోహా చేయడంలో 5 అంకాలు
1.అటుకులు నీళ్లల్లో 3, 4 నిమిషాలు నానబెట్టాలి.

2.నీరు వంపేసి, దాంట్లో తగినంత ఉప్పు, ఒక స్పూన్‌ కారం, ధనియాల పొడి 
ఒక స్పూన్‌, ఒక చిటికెడు ఇంగువ కలపాలి.

3.మూకుడులో తగినంత నూనె పోసి, ఆవాలు, పల్లీలు, కరివేపాకు, పచ్చి 
సెనగపప్పు వేయించాలి.

4.తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, సన్నగా తరిగిన ఆలూ 
ముక్కలు వేసి వేయించాలి.అందులో రెండు స్పూన్‌ల చింతపండు రసం వేసి 
రెండు నిమిషాలు కలపాలి.5.అందులో అటుకులు వేసి బాగా అడుగుకి, పైకి 
కలిపి ఐదు నిమిషాల పాటు సన్నని సెగపై ఉంచాలి. ఇక పోహా తయారు.

ఎక్కువ సేపు ఒకటే చోట కూర్చొని పనిచేసేవారికి పొట్ట తగ్గించడానికి వ్యాయామాలు ?


  ఎక్కువ సేపు ఒకటే చోట కూర్చొని పనిచేసేవారికి సాధారణంగా పొట్ట ఎక్కువగా 
ఉంటుంది. ఒక చిన్న వ్యాయామంతో పొట్టను తగ్గించుకోవచ్చు. ఈ వ్యాయామాలు
 పొట్టను తగ్గించడానికి ఎంతో ఉపయోగపడతాయి. అవి ఏమిటంటే:

మొదటి వ్యాయామం: నేల మీద వెల్లకిలా పడుకొని కాళ్ళు, చేతులు నిటారుగా నేలకు
 ఆనించాలి. తర్వాత రెండు కాళ్ళనూ కొద్ది అడుగులు పైకి లేపాలి. అలా 10 అంకెలు 
లెక్కపెట్టే వరకు ఉండండి. తర్వాత నెమ్మదిగా కాళ్ళను కిందికి దించాలి. ఇదే విధంగా 
మూడు, నాలుగు సార్లు చేయాలి. ఇలా కాళ్ళను పైకి లేపి ఉంచడం వల్ల పొట్టపై ఒత్తిడి
 పెరుగుతుంది. అలా కౌంటింగ్‌ను పెంచుకుంటూ ప్రతిరోజూ చేస్తుంటే పొట్ట తగ్గడం ఖాయం.

రెండో వ్యాయామం: నేల మీద పడుకొని, పాదాలు నేలకు ఆనే విధంగా కాళ్ళను 
ముడుచుకోవాలి. చేతులను మెడను పైకి నెడుతున్నట్లుగా అదిమినట్లు ఉంచి, 
శరీరభాగాన్ని సగం కూర్చున్నట్లుగా పైకి లేపాలి. 

కొద్దిసేపు అలాగే ఉండి తర్వాత శరీరాన్ని దించాలి. ఇలా మూడు, నాలుగు సార్లు 
చేయడం వల్ల కూడా పొట్టను తగ్గించవచ్చు.