గృహ వాస్తు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గృహ వాస్తు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

కష్టాలు తీర్చే మొక్కలు


మనస్సులో తెలియని ఆలోచనలా.... అనుకున్న పనులు పూర్తి కావడం లేదా... ఉద్యోగ అవకాశాలు చేజారి పోతున్నాయా? ఆర్థిక సమస్యలు పట్టిపీడిస్తున్నాయా.... ఆర్థిక పరంగా ఎదుగుదలలో ఏవైనా అడ్డంకులా.... ఇలాంటి సమస్యలతో సతమతమయ్యే వారు ఇకపై దిగులు పడాల్సిన అవసరం లేదు. సాధారణంగా మనస్సు ప్రశాంతత కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఏ రకమైన బాధలు, కష్టాలు ఉన్నప్పటికీ తగిన పరిష్కారపు మొక్కలు ఇంట్లో పెంచుకున్నట్టయితే మీ కష్టాలు తొలగిపోయి జీవితంలో సంతోషం కలుగుతుందంటున్నారు మన వాస్తు నిపుణులు చెబుతున్నారు.

క్రోటన్స్‌, ఒకే రోజా, పసుపు, అరలీ, వాడామల్లి, అలమండా పువ్వు అనే రకరకాల చెట్లను పెంచడం ద్వారా సమస్యలకు చెక్‌ పెట్టవచ్చునని చైనా వాస్తు సూచిస్తోంది.. ఒక్కో మొక్క ఒక్కో కష్టం తీర్చే శక్తిని కలిగివుంటుందట...అవేమిటో తెలుసుకుందామా...


* క్రోటాన్స్‌ - చెడు ఆలోచనలను తరిమేస్తుంది.


* నందివర్థిని- మనస్సుకు ప్రశాంతతను కలుగజేస్తుంది. 


* తులసి- భక్తిని పెంచుతుంది.


* మందారం- ఉత్సాహకరమైన శక్తిని కలిగిస్తుంది.


* వైట్‌ గనేరా - మనస్సు ప్రశాంతతను పొందుటకు సహాయపడును.


* రెడ్‌ గనేరా - తప్పులను సరిచేయును.


* ఒపంటియా - కీర్తి, సంపదలను ప్రసాదించును.


* పేపర్‌ పువ్వు- భగవంతుని పూర్తి ఆదరణలను ఇచ్చును.


* ఆల్‌మండ్‌ ఫ్లవర్‌ - అన్ని అడ్డంకులను తొలగించును. 


* మల్లెపువ్వు - మరణ భయాన్ని తొలగిస్తుంది. 


* రోజా పువ్వు- దీనిని పెంచడం ద్వారా కోరుకున్న ఉద్యోగము లభిస్తుంది



తలుపుల రెక్కలు ఎన్ని ఉండాలి ?




తలుపుల రెక్కలు  ఎన్ని ఉండాలి ?



ఎన్నివున్నా ఏమి తిన్నా మన్నులోనికి ప్రయాణం
కన్నులకు పొరలెక్కి తిరిగితే లెక్క చేయదు ప్రకృతి
రాజుకైనా, పేదకైనా మంచి ఒకటే ప్రమాణం
మనిషి జాతికి మంచి నొసగుటె వాస్తు నిర్మిత ప్రధానం!


ఈ విషయం భద్రతకు సంబంధించింది. అపార్ట్‌మెంట్‌ల నిర్మాణాలు వచ్చినప్పటి నుంచి ఒక్క రెక్క తలుపులు పుట్టుకొచ్చాయి. రెండు తలుపులు చిన్న గృహాలకు ఒదిగినట్టుగా ఉంటాయి. అంటే గృహస్థలం తక్కువగా ఉన్నప్పుడు గుమ్మాల దగ్గర తలుపులు తీసి పెట్టినప్పుడు అవి అటు ఇటు కదులుతున్నప్పుడు వాడుకునే స్థలం తక్కువగా ఉంటుంది. పెద్ద రెక్కలు పెట్టినప్పుడు దాని వాడుక స్థలం ఎక్కువగా ఉంటుంది. ‘ఇవి ఏవి ఎక్కడ పెట్టాలి?’ అనేది ఆయా స్థలాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. హాలుకు వచ్చే తలుపునకు రెండు రెక్కలు పెట్టడం మంచిది. డ్రాయింగ్ రూమ్‌కు వచ్చే తలుపులకు ఒక్క రెక్క పెట్టడం మంచిది. ఒకే రెక్క పెట్టే చోట ఆ డోరు ఒక గోడవైపు రెస్ట్ అయ్యేలా చూసుకోవాలి. ఇంటి నిర్మాణంలో ప్రతి అంశం ప్రధానమే. ప్రతి గృహ వసతిలో వ్యత్యాసాలు ఉండవు.


ఇంటికి ఎన్ని పిల్లర్స్ ఉండాలి?



ఇంటికి ఎన్ని పిల్లర్స్ ఉండాలి?




vasthuuu
చాలామంది ఈ పిల్లర్‌ల అల్లరిలో మునిగి పోతున్నారు. ఇంటి నిర్మాణానికి ఇంటిని సరిగ్గా మోయడానికి నాలుగు మూలల నాలుగు పిల్లర్లు వచ్చిన తర్వాత ఇంటి పొడవు, వెడల్పులను బట్టి మధ్యలో పిల్లర్స్‌ని కలుపుతూ ఇంటి కప్పును నిలుపుతారు. ఈ విధమైన నిర్మాణ శైలిలో ఫిల్లర్ల సంఖ్య కన్నా ఇంటి స్థిరత్వం ముఖ్యం. అందులో భాగంగానే కొన్ని పెద్ద పిల్లర్‌లు, సన్న పిల్లర్‌లు వాడుతూ ఉంటాం. అన్నీ సన్నయి వాడాలి, అన్నీ లావువి వాడాలి అనడం ఎలాగైతే కరెక్టు కాదో, అందరూ కిలో అన్నమే తినాలనడం ఎలా ఐతే నవ్వు తెప్పిస్తుందో, ఎంత తెలియని తనాన్ని చూపిస్తుందో సంఖ్య కోసం పిల్లర్లను పెంచడం కూడా అంతే. ఎన్ని వేర్లమీద చెట్టు నిలుస్తుంది? దానికి సంఖ్య ఉన్నదా? కాబట్టి, ఇంటి నిర్మాణంలో పిల్లర్ల లెక్క అవసరం లేదు.

దక్షిణ స్థలం పెరిగితే ఏమౌతుంది? :~ రాజయ్య, శారాజీపేట
‘ముక్కు పొడవుగా పెరిగితే ఏమౌతుంది?’ అందం సంగతి పక్కన పెట్టండి. ముందుగా అది నోటికి అడ్డం అవుతుంది. ప్రతి సారి పక్కకు జరిపి భోజనం చేయాలి. ఇది ఎంత ఇబ్బందికరం? ఎందుకు చెబుతున్నానంటే ప్రకృతి నిర్మితమైన శరీరంలో ప్రతి అవయవానికి ఒక కొలమానం ఉంది. చెవి కింది భాగానికి ముక్కు కొసకి ఒక గీత గీస్తే సమంగా ఉంటాయి. చేయి మలిస్తే మోచేతి కొస నుండి బొడ్డు వరకు ఒక సరళరేఖ గీయవచ్చు. ఇలా సృష్ట రచనకు స్పష్టమైన కొలత ఉంది. మనిషే తను సృష్టించే వాటికి కొలతలు పాటించడంలో అవకతవకలు చేస్తూ అవస్థలు పడుతున్నాడు. అంతెందుకు, పెట్రోలు పోయకుండా నడిచే సైకిల్ ఒక చక్రం చిన్నగా పెడితే నడుస్తుందా. ఇవన్నీ కూడా కొలతల నిర్మాణానికి, ఖాళీస్థలానికి ఒక నియమం ఉంది. ఆ కోణంలో ఉత్తరం కన్నా దక్షిణ స్థలం పెరిగినప్పుడు గృహం ధనధ్రువం నుంచి గృహ స్థలంలో రుణధ్రువంలోకి పడిపోతుంది. 

అప్పుడు ఇంటి పీఠం ఒకవైపు వంగిపోతుంది. ఒక బండిమీద బస్తాలు వేసినప్పుడు ఎద్దుల మెడమీద ఎక్కువ బరువు పడకుండా ఉండాలి. అలాగే, బండి వెనుకకు బరువు ఎక్కువ అయితే బండి పోలు లేస్తుంది. కాబట్టి, సమస్థితిలో బర్తిని పెడతారు. బండి లేవడి అయినప్పుడు బండిని తోలె మనిషి బండి తొట్టిలో ముందుకు వెనుకకు జరిగి కూర్చుంటూ బండి బరువును సమతూకంలో పెడతాడు. ఇది అతి సహజమైన అద్భుతమైన గరిమనాభి సూత్రం. ఎంత దూరమైనా ఎద్దులకు బరువు కాకుండా బండి సాగుతుంది. అలాగే, గృహ గరిమనాభి స్థానం దెబ్బ తినకుండా దక్షిణ స్థలాన్ని తెంచేసుకోవాలి. వాస్తు నియమాలతో గృహం రూపొందించుకోవాలి.

కిచెన్‌లో స్టోర్ రూం ఎక్కడ పెట్టాలి? :~ ధర్మమూర్తి, పాలంపేట
కిచెన్ ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకున్న తర్వాత కిచెన్ గది వైశాల్యాన్ని స్టోర్‌ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే పెంచుకోవాలి. స్టోర్ రూమ్‌ను కిచెన్‌కు నైరుతి భాగంలో పెట్టడం శ్రేయస్కరం. లేదా కిచెన్ దక్షిణ భాగం మొత్తం స్టోర్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే, కిచెన్‌కు ఆగ్నేయంలో యుటిలిటి వచ్చినప్పుడు అందులోకి ద్వారాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మూడు అడుగులు వదిలి మిగతా దక్షిణ నైరుతి భాగాన్ని స్టోర్‌గా మార్చుకోవాలి. అలాగే, పడమర భాగంలో ఉత్తర, దక్షిణాలుగా కిచెన్‌లో స్టోర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. కిచెన్‌లోకి పడమరవైపు నుంచే ద్వారం పెట్టుకోవాల్సి వస్తే పడమర, వాయవ్యంలో ద్వారం ఏర్పాటు చేసుకొని మిగతా పడమర నైరుతిలో స్టోర్ కట్టుకోవాలి.

బీముల కింద పడుకోవచ్చా? : ~ రాజిరెడ్డి, వరంగల్

ఏ వస్తువైన బరువు ఎక్కువగా ఉంటే దాని గురుత్వాకర్షణ శక్తి అంత ఎక్కువగా ఉంటుంది. బీములు ప్రధానంగా ఇంటి పైకప్పును మోస్తూ అధిక బరువుతో ఉంటాయి. వాటికింద పడుకున్నప్పుడు ఆ గురుత్వాకర్షణ ప్రభావానికి మన శరీరంలో అనేక మార్పులే కాక ముఖ్యంగా రాత్రిళ్ళు నిద్ర పట్టకుండా గొంతుపైన ఎవరో కూర్చున్నట్టు, ఊపిరి ఆడనట్టు, తల బరువుతో కలత నిద్రగా ఉంటుంది. నిద్రకు ఎప్పుడైతే దూరం అవుతామో ఉదయం లేచింది మొదలు పనుల ఒత్తిళ్ళలో, మనసు చేసే కార్యకలాపాలతో మానసిక అస్థిరత ఏర్పడి ఇరిటేషన్ తద్వారా కోపం, అలజడికి లోనై చీటికి మాటికి ఇతరులను దూషించే, ద్వేషంచే సందర్భాలు ఎదురౌతుంటాయి. కాబట్టి, పడక గదులలో, హాలులో పడుకోవాల్సి వచ్చినప్పుడు స్లాబు నుండి కిందకు చొచ్చుకొని వచ్చే బీములు లేకుండా చూసుకోవాలి.

వాస్తు దోషాన్ని ఎలా కనుగొనాలి ?



వాస్తు దోషాన్ని ఎలా కనుగొనాలి ?


Home


వాస్తు దోషాలనేవి ఈ క్రిందివిధంగా ఉంటాయి. అప్పులు చేయడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడం, క్రుంగిపోవడాలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యాప్రయత్నాలు, మానసిక క్షోభ, కుటుంబంలో కలహాలు, పిల్లలు పుట్టకపోవడం, అనేకమైన వ్యాధుల బారిన పడడం, అవమానాలు, ఇతరత్రా స్త్రీలపై విపరీతమైన కామ ప్రకోపాలు ఇతరత్రా సంఘటనలు ఇంట్లో జరిగితే అటువంటి వారికి వాస్తుదోషం ఉందని చెప్పవచ్చు. 


దొంగతనాలు, అగ్నిప్రమాదాలు, అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు, చర్మవ్యాధులు, ఉద్యోగం లభించక పోవడం మొదలగునవి. అదే విధంగా ఆడపిల్లల విషయంలో ఇతరులను ప్రేమించడం, పుట్టింటికి చేరుకోవడం, మెట్టినింట కష్టాలు, భర్త బలవంతంచే పుట్టినింటి వారిని పీడించండం మొదలగునవి అన్నీ వాస్తుదోషాలలోకి వస్తాయని వాస్తు శాస్త్రవేత్తలు అంటున్నారు. అందువలన ఏ నిర్మాణమునైనా వాస్తురీత్యా నిర్మించుకొని అందరూ ఆనందంగా ఉండాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.



ఇంటికి వాస్తు దోషం ఉంటే ఇవి జరుగుతాయట ?


వాస్తు దోషాలనేవి ఈ క్రింది విధంగా ఉంటాయి. అప్పులు చేయడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడం, క్రుంగిపోవడాలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యా ప్రయత్నాలు, మానసిక క్షోభ, కుటుంబంలో కలహాలు, పిల్లలు పుట్టకపోవడం, అనేకమైన వ్యాధుల బారిన పడడం, అవమానాలు, ఇతర స్త్రీలపై విపరీతమైన కామ ప్రకోపాలు ఇతరత్రా సంఘటనలు ఇంట్లో జరిగితే అటువంటి వారికి వాస్తుదోషం ఉందని చెప్పవచ్చు. 


దొంగతనాలు, అగ్నిప్రమాదాలు, అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు, చర్మవ్యాధులు, ఉద్యోగం లభించక పోవడం మొదలగునవి. అదేవిధంగా ఆడపిల్లల విషయంలో ఇతరులను ప్రేమించడం, పుట్టింటికి చేరుకోవడం, మెట్టినింట కష్టాలు, భర్త బలవంతంచే పుట్టినింటి వారిని పీడించడం మొదలగునవి అన్నీ వాస్తుదోషాలలోకి వస్తాయని వాస్తు శాస్త్రవేత్తలు అంటున్నారు. అందువలన ఏ నిర్మాణమునైనా వాస్తురీత్యా నిర్మించుకొని అందరూ ఆనందంగా ఉండాలనేది వారి భావన.







ఐశ్వర్య ప్రాప్తికి ఇలా చేయండి ?




సకల ఐశ్వర్య ప్రాప్తికి ఇలా చేయండి 



"డబ్బు లేదు" , " కీర్తి లేదు", "ఆరోగ్యం లేదు", "ఉద్యోగం లేదు", "ప్రమోషన్ లేదు", " విజయం లేదు", "ఆధ్యాత్మిక చింతన లేదు" ఇలా ఏదైనా లేదు అనుకోవడమే దారిద్ర్యం. వీటిలో ఏది తొలగడానికైనా పారాయణ చేయాలి.

"ప్రకృతి వికృతిం విద్యం " అంటూ ప్రారంభమయ్యే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చాలా ప్రధానమైనది. దీనిని ప్రతినిత్యము మూడు పూటల ఇంద్రియ నియమంతో 6 నెలలు పారాయణ చేస్తే సకల విధములైన లేములు తొలిగిపోతాయి. అందుకే దీనిని "దారిద్ర్యమోచన " స్తోత్రం అంటారు. ఒక సంవత్సర కాలం పాటు నియమాలతో ప్రతి శుక్రవారం 108 పర్యాయాలు పఠిస్తే అన్ని ఐశ్వర్యాలు వరిస్తాయి. శివుడు పార్వతికి ఉపదేశించిన మంత్రమిది.