పెద్ద బావిని పూడ్చినప్పుడు చాలా రాళ్ళు వచ్చాయి? వాటిని ఇంటి పునాదులకు వాడవచ్చా?





పెద్ద బావిని పూడ్చినప్పుడు చాలా రాళ్ళు వచ్చాయి? వాటిని ఇంటి 
పునాదులకు వాడవచ్చా?


రాళ్ళు వాడేముందు బావినుండి తీసిన ఆ రాతి కుప్పపైన నీరు పోసి అలా శుభ్రపరిచిన రాళ్ళను ఏ నిర్మాణానికైనా వాడుకోవచ్చు. కర్రసామానే కొత్త ఇంటికి వాడటంలో తప్పులేనప్పుడు రాళ్ళు వాడితే దోషం లేదు. బావి అనగానే మన దృష్టి భయానకమైన భావన కలుగజేస్తుంది. అది కేవలం మన స్వభావానికి సంబంధించింది. రాళ్ళు కూడా ఒక్కోసారి తొందరగా విరిగిపోయే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అలాంటివి ఎట్లాగో బావి నిర్మాణాలకు వాడరు. ఐనా, ఒకసారి ఆ రాళ్ళను మరొక రాయిపైన విసిరి వాటి నాణ్యతను గుర్తించి ఇంటి పునాదులకు వాడవచ్చు. దీనిలో ఏ దోషం లేదు.