మంగళవారం పనిని మొదలు
పెట్టకూడదా?
ఏదైనా శుభకార్యం తలపెట్టే సమయాల్లో మంచి రోజు చూసుకునే పద్ధతి ఆనవాయితీగా వస్తోంది. మనం ఎంచుకునే రోజులో ఏ సమయం బాగుంటుందని పురోహితుల సూచనమేరకు ఏ కార్యాన్నైనా ప్రారంభించడం అలవాటు. ఎందుకంటే? తలపెట్టిన కార్యం విజయవంతంగా పూర్తి కావాలని అందరూ కోరుకుంటారు. అయితే మంగళవారం ఎలాంటి పనులను మొదలుపెట్టడం అంత మంచిది కాదని జ్యోతిష్కులు అంటున్నారు. పెళ్లి, వ్యాపారం ప్రారంభించడం, గృహప్రవేశం చేయడం వంటి శుభకార్యాలను మంగళవారం చేయకూడదని వారు చెబుతున్నారు. అయితే మంగళవారం నాడు కూడా శుభ కార్యాలు ప్రారంభించేందుకు మంచి సమయాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం అంటోంది.
ఇందులో భాగంగా.. మంగళవారం ఉదయం 6.00 గంటల మొదలు 6.24 వరకు ధనలాభం, కార్యసిద్ధి, క్రొత్త ప్రయత్నాలకు శుభం. 6.24-6.48 వరకు ప్రయాణానికి శుభం, సుఖము. 6.48-7.12 వరకు బంధనము, భయము, నష్టము, దుఃఖప్రాప్తి. 7.12-7.36 వరకు భూత భయము. 7.36-8.00 వరకు వాహనప్రాప్తి, మిత్రప్రాప్తి. 8.00-8.48 వరకు కార్యలాభము, అలంకార వస్త్ర ప్రాప్తి, సుఖం సిద్ధిస్తుంది. అలాగే ఉదయం 8.48-9.36 వరకు ప్రయాణానికి నష్టము, హాని. 9.36-10.48 వరకు వ్యవహార హాని, వివాదం, కార్యహాని. 10.48-12.00 వరకు ప్రవేశమునకు కష్టము, జంతువుల వల్ల కష్టము, శతృత్వం. 12.00-1.12 వరకు సర్వ ప్రయత్నాలకు శుభం, పుత్ర లాభము, కార్యసిద్ధి. 1.12-2.00వరకు ప్రయాణానికి శుభం, యాత్రసిద్ధి కల్గుతుంది.
వీటితోపాటు 2.00-3.12 వరకు కార్యభంగం, వ్యర్ధం, దుఃఖము, అపజయం. 3.12-4.00 వరకు ప్రయాణలాభము, ఉద్యోగముకు హాని, స్థాననాశనము. 4.00-4.48 వరకు శుభకార్యాలకు శుభము, జయప్రదము, కార్యజయము. 4.48-5.36 వరకు కార్యసిద్ధి, క్షేమము, శుభకర్మలకు జయము... ఇలా మంగళవారం వివిధ సమయాల్లో వివిధ ఫలితాలు సంభవిస్తాయని జ్యోతిష్కులు అంటున్నారు.