Pages

పూజగదికి గోపురం ఉండకూడదా?





పూజగదికి గోపురం ఉండకూడదా? 



గోపురం ప్రధానంగా పూజగదులకే అవసరం. రోజూ నిష్టతో అభిషేకాలు, అర్చనలు మరింత నిష్టతో చేసేవారికి ఇది ప్రేరణ కలిగిస్తుంది. దేవుని గదిలోని వాతావరణాన్ని ఆరోగ్యకరంగా మలుస్తుంది. లోపలి విగ్రహాలకు చల్లదనాన్ని, వాటి నిగనిగలను పోకుండా కాపాడుతుంది. అంతేకాదు, ఆ చిన్న పూజగదిలో పెట్టే నైవేద్యాలు, పూలు సాయంత్రం వరకు తాజాదనాన్ని కోల్పోకుండా ఉంటాయి. నెత్తి మీద టోపి పెట్టుకుంటే తలపైన మనకు తెలియకుండా చల్లదనాన్నిస్తుంది. నీటి ఆవిరి ఆవరణం టోపి లోపల ఏర్పడుతుంది. తద్వారా ఎండలో ప్రయాణిస్తున్నప్పుడు శరీర భాగాలకు తెలియకుండా ఒక రక్షణ ఏర్పడుతుంది. కారణం, తల కేంద్రం కాబట్టి. అందుకే, మన పెద్దలు తలకు రుమాలు చుట్టుకునేవారు. నేపథ్యంలో దినమంతా చైతన్యవంతంగా ఉండేలా, రకరకాల వ్యవహారాలతో సతమతమయ్యే మనిషి మనసును ప్రసన్నం చేసేలా ఇంట్లోని పూజగది ప్రేరణ దాయకమౌతుంది. అందుకు గుడి స్వరూపాన్ని గూటిలో పెట్టుకోవడం సముచితం. 

వాయవ్యంలో మెట్లమీద ట్యాంకు పెట్టుకోవచ్చా? :- లక్ష్మీనారాయణ, ఖమ్మం
నీళ్ళట్యాంకు పెట్టుకోవడానికి దాని బరువు మోయడానికి మెట్లు ఉండే చోట బలమైన ఫిల్లర్స్ వస్తాయి. కాబట్టి ఆ చోట నీళ్ళ ట్యాంక్‌ని ఏర్పాటు చేస్తుంటారు కొందరు. డూప్లెక్స్ ఇండ్లకు దక్షిణంలో, పడమరలో మెట్లు వచ్చినప్పుడు వాటిపైన కూడా నీళ్ళ ట్యాంక్‌లను కడుతూ ఉంటారు. ఐతే, ఈ చోట్లలో వాటర్ ట్యాంక్‌ను పెట్టడం నిషేధం కాదు. కానీ, స్లాబ్‌పైన నైరుతి భాగంలో లేకుండా మిగతా చోట్ల ఎత్తులు ఏర్పడతాయి. ఇవి సరైనవి కావు. వీటిని నిలుపుకోవాలంటే తప్పనిసరిగా నైరుతిలో వీటికన్నా ఎత్తు వచ్చేలా ఒక గదిని కట్టుకోవాలి. అప్పుడు వాయవ్యం మెట్లమీద ఉండే వాటర్‌ట్యాంక్ తొలగించాల్సిన పని లేదు.

నైరుతిలో నీరు నిలువ చేసుకునే తొట్లను కట్టుకోవచ్చా? :- రాజేశ్, మూసాపేట
చాలామందికి ఒక సందేహం వెంటాడుతూ వుంటుంది. ఈశాన్యంలోనే నీరు ఉండాలి అని మిగతా చోట్ల నీరు ఉండకూడదు, తడికూడా ఉండకూడదు అనుకుంటారు. అందుకే, కొందరు దక్షిణం వైపు, పడమరవైపు నీటిని నిలువ చేసుకోరు. కానీ, నైరుతిలోనే నీళ్ళ ట్యాంకు ఉండాలంటారు. విశాలమైన భూమిలో ఎక్కడ బోరు వేసినా నీళ్ళు పడతాయి. ప్రకృతిలో నీటికి, గాలికి, వెలుతురుకు, ఆకాశానికి ‘ఈ దిశలో నీరు దొరకదు’ అనే నియమం లేదు. ఇక్కడ మనం కాస్తా లోతుగా ముచ్చటించుకుంటున్నాం.
భూమిలోంచి వచ్చిన నీరు వినియోగించుకునే విధానం వేరు. వాటర్ కోసం భూమిని వినియోగించుకునే విధానం వేరు. గొయ్యితో కూడుకున్న నీరు నైరుతిలో పనికి రాదు. కానీ, గొయ్యి లేకుండా నీటి నిలువ దక్షిణ, పశ్చిమ, నైరుతి, వాయవ్యాలలో తప్పు కాదు. భూమి మీద కట్టేవి దక్షిణ, పశ్చిమాలలో పెట్టుకోవచ్చు. ఐతే, వాటిపైన తప్పనిసరిగా మూతలు ఉండాలి. ఓపెన్‌గా ఎప్పుడు ఉంచరాదు.

మూలల్లో కిటికీలు పెట్టవచ్చా? :- దశరథ, హన్మకొండ
పాతకాలం నిర్మాణాలకు ఇప్పటి నిర్మాణాలకు ఎంతో తేడా ఉంది. అప్పుడు జీవించడానికి కడితే ఇప్పుడు చూపించుకోవడానికి కడుతున్నారు. ఈ పోకడలో వచ్చినవే మూల కిటికీలు. కిటికీలు ఎక్కడ పెట్టాలో అనే దానికన్నా ఎందుకు పెట్టుకోవాలో తెలుసుకోవాలి. ప్రాణవాయువులను ప్రసారం చేసేవి కిటికీలు. ఈశాన్యం మూలలు తప్ప మిగతా మూలల్లో ఈ మూల విండోలు పనికిరావు. ఎలా నిర్మించినా ఇంటి మూలలో తప్పనిసరిగా పైకప్పును నేలను తాకుతూ ఒక కోణం అవసరం. అది ఎంత పరిమాణంలో ఉంది అనేది వదిలేస్తే మిగతా మూలల్లో మాత్రం చాలా ముఖ్యం. ముక్కు దూలం లేకుండా రెండు వైపులా ముక్కు రంధ్రాలు ప్రకృతి ఏర్పాటు చేయలేదు. అలా మూల కోణాలు ఉండి, తెరవాల్సిందే.

రాష్ట్ర సరిహద్దులు వాస్తు ప్రభావాన్ని సూచిస్తాయా? :- కె.వి.శర్మ, మునుగోడు

వాస్తుశాస్త్రంలో నిర్మాణ విషయం, పరిసరాల విధానం లెక్కలోకి వస్తుంటాయి. వీటిల్లో పరిసరాలకు సంబంధించిన విధానమే సరిహద్దుల విషయం. దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఐతే, అది ప్రధానంగా సామాన్య ప్రజలపై కన్నా రాష్ట్రాన్ని పాలించే నాయకుల పైన ఉంటుంది. ఐతే, ప్రజల భాగస్వామ్యం లేకుండా పోదు. సరిహద్దుల విషయానికి వచ్చినప్పుడు సమువూదాలు, ఎత్తైన పర్వతాలు, ఎక్కువ ప్రాధాన్యాలను కలిగిఉంటాయి. ఉదా: ముంబైకి పడమరలో అరేబియా సముద్రం. ఆంధ్రవూపదేశ్‌లో తూర్పున బంగాళాఖాతం. ఈ రెండు ప్రాంతాల జీవన విధానాలలోను పాలిత వ్యవహారాల్లోను లోతుగా ఆలోచిస్తే ఎన్నో వ్యత్యాసాలు కనబడతాయి. ఐతే, వాస్తులో, దాని ఫలితాలలో యాభై శాతం మేరకే ఈ సరిహద్దు వాస్తులను లెక్కించడం జరుగుతుంది. ఇది దేశాలకు వర్తిస్తుంది. హిమాలయాలు పుట్టక పూర్వం, అవి పుట్టిన తర్వాత భారతదేశపు స్థితిగతులలో ఎన్నో బలీయమైన మార్పులు జరగడం చరివూతను అధ్యయనం చేస్తే తెలుస్తుంది.