Pages

అపార్ట్‌మెంట్‌లో ఫ్లోరింగ్ ఎత్తు ఎంత ఉండాలి?




అపార్ట్‌మెంట్‌లో ఫ్లోరింగ్ ఎత్తు ఎంత ఉండాలి?


అపార్ట్‌మెంట్లలో ఇల్లు కొనుకున్నప్పుడు దాని నిర్మాణ శైలిలోనే ఇంటి ఫ్లోరింగ్ ఎంత ఎత్తు వస్తుంది అనేది ముందే నిర్ధారించుకోవాలి. పాసెజ్‌కన్నా కనీసం 4 అంగుళాల ఎత్తు ఉండే విధంగా ఫ్లోరింగ్ నిర్మితమవ్వాలి. గడపకు, బయటి స్థలానికి తేడా తప్పనిసరి ఉండాలి. పరిసర ప్రాంతాలకు, మనిషి వాడుకునే గృహ స్థలానికి ఎత్తు ఎంతో ముఖ్యమైంది. ఇది నీటి పారుదల వసతికే కాకుండా పరిసర ప్రభావాలతో గృహం సహజమైన అనుసంధానం చేసుకోవడానికి ఎత్తు ముఖ్యమైంది. మనిషి శరీరం భౌతికమైన అంశాలతో సహజానుగుణ్యత కలిగి ఉంటుంది. నేలమీద అయినా, అపార్ట్‌మెంట్‌లో అయినా బయటి స్థలం కన్నా ఇంటి ఎత్తు గూటికి ఒక చురుకుదనాన్ని ఇస్తుంది. కాబట్టి, కనీస ఎత్తు అవసరం.