అధిక మాసం..అంటే!
ఆకాశాన్ని గమనిస్తూ, కాలగమనాన్ని గుర్తించే భారతీయ సిద్ధాంత గణితాన్ని ‘పంచాంగము’ అని అంటారు. ‘పంచ’ అనగా అయిదు. ‘అంగము’ అనగా భాగము. ఐదు విభాగాలుగా ఉన్న ఈ సిద్ధాంత గణితంలో మొదటిది. ‘తిథి’ మిగిలినవి వారము, నక్షత్రము, యోగము, కరణము అని నాలుగు.
ఆధునికంగా వాడబడుతున్న ‘తేదీ’ అనే మాట ఈ తిథి అనే శబ్దం నుంచి పుట్టినదే. తిధి తేదీగా, తేదీదేతీగా; దేతీ డేటీగా ఇలా మార్పులు చెంది చివరికి, ‘డేట్’ అనే ఇంగ్లీషూ పదంగా రూపాంతరం చెందిందన కొందరు భాషాశాస్త్రవేత్తల అభిప్రాయం కూడా.సూర్యుడు ఉదయించి అస్తమించే వరకు గడిచేకాలాన్ని ‘అహ స్సు’ (పగలు) అనీ, ఇలా గడిచే ఒక ‘అహోరాత్రి’ కాలాన్ని ‘దినం’ అనీ లేదా ‘వారం’ అనీ పిలుస్తాం.అయితే తూర్పున కనిపించే సూర్యుడు, నిత్యం దిగంతరేఖలో ఒక బిందువులో ఉదయించాడు. సూర్యోదయ బిందువు విన దినం మారుతూ ఉంటుంది. ఆ మారటం కొంతకాలం దక్షిణం వెైపుకీ, కొంతకాలం ఉత్తరంవెైపుకీ జరుగుతూ వుంటుంది. అవే ఉత్తర దక్షిణాయనాలు. దక్షిణపు చివరి బిందువు మీద ఉదయించిన సూర్యుడు ఉత్తరంగా జరిగి, తిరిగి వెనక్కి మళ్ళి, మళ్ళి అదే బిందువు దగ్గర ఉదయించడానికి మొత్తం 360 (180+180) బిందువుల కాలంపడుతుంది. ఇది ఒక వృత్తం లోని కోణాల సంఖ్యకి సమానం. కానీ ఉత్తర అంత్య మిందు వుల దగ్గరవెనక్కి మళ్ళడానికి పట్టే కాలాన్ని కూడాగుణిస్తే, ఒక ప్రమాణం పూర్తయి. మరో ప్రమాణం ప్రారంభం కావడానికి 365 హోరాలు (అహోరాత్రాలు) నడుస్తాయి. (ఇంకా సూక్ష్మ దశాంశస్థానాలు కూడా గుణింపబడ్డాయి) దీనిని ఒక సంవత్సరం (సౌర) అన్నారు.
ఇలా అహోరాత్రాలు అనంతంగా సాగిపోయే ఈ సూర్య గమనం ఒక్కొక్క దినం ఒక్కొక్క గ్రహాధిపత్యంతో ప్రారంభిస్తుందనీ, అవి సప్త గ్రహాలనీ, అవే తిరిగి తిరిగి వస్తున్నాయనీ గుర్తించి, ఆయా దినాలకు ఆయా గ్రహాల పేర్లు పెట్టారు. అవే ఆది, సోమ, మంగళ మొదలెైనవారాలు.
ఇలా అహోరాత్రాలు అనంతంగా సాగిపోయే ఈ సూర్య గమ నం ఒక్కొక్క దినం ఒక్కొక్క గ్రహాధిపత్యంతో ప్రారంభిస్తుం దనీ, అవి సప్త గ్రహాలనీ, అవే తిరిగి తిరిగి వస్తున్నాయనీ గుర్తించి, ఆయా దినాలకు ఆయా గ్రహాల పేర్లు పెట్టారు. అవే ఆది, సోమ, మంగళ మొదలెైనవారాలు.
ఇలా వారంతో పాటు మరొక గుర్తుకూడా ఏర్పడితే, జరిగినది నాల్ని విడివిడిగా ప్రత్యేకంగా గుర్తించడం తేలిక, ఆకాశంలో సూర్యుడితోపాటు ప్రస్ఫుటంగా కనిపించే మరొక గోళం చంద్రుడు. మార్పు త్వరితంగా విస్పష్టంగా కనిపించే ఆ చంద్ర గమనమే చంద్రకళ. దానినే వాడుకలో ‘తిథి’ అన్నారు.చంద్రకాంతి అర్థవలయరేఖగా కనిపించే దిసం నుంచి పూర్ణబింబంగా కనిపించే దినం (పౌర్ణమి) వరకూ పదిహేను తిధులు. అక్కడి నుంచి తిరిగి శూన్య బింబంగా భాసించే దినం (అమావాస్య) వరకు పదిహేను తిధులు.
అది శుక్ల, పక్షం, ఇది కృష్ణపక్షం. మొత్తం ముఫ్పై తిధులూ కలిసి ఒక మాసం. ఏడు వారాలూ ఏడు హారల్లో ఎలా తిరుగుతుంటాయో - ఈ చంద్రగమునం కూడా ప్రతి పౌర్ణమికీ ఒక నిద్దిష్టమైన నక్షత్రమునందే జరుగుతుంది. ఆ నక్షత్రాలే వరసగా చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వ ఉత్తరాషాఢలు, శ్రావణం, పూర్వ ఉత్తరాభాద్రలు, ఆశ్వని, కృత్తిక, మృగశిర, పుష్యమి, మఖ, పూర్వ, ఉత్తర ఫల్గుణీ నక్షత్రాలు. ఆ కారణంగా నే ఆయా నెలలు చెైత్రం, వెైశాఖ, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపద, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం అయినాయి.
ఈ పన్నెండు మాసాలూ కలిపితే మొత్తం 3012=360 తిథులెైనాయి. ఇవి వృత్తంలోని 360 కోణాలకి సమానమే.
అయితే సూర్యగమనంలో ఏర్పడే అహస్సు ప్రమాణం ఖచ్చితంగా 60 ఘడియలు (గంటలు) ఉంటుంది. కాని చంద్రభ్రమణము ఏర్పడితే, తిధిప్రమాణం అలా ఉండదు. ఒక సారి ఎక్కువా, ఒక్కొక్కసారి తక్కువా ఉంటుంది ఇది ఏకపక్షానికి, ఋతువుఋతువుకీ హెచ్చవు తంది. మొత్తం మీద సూర్యసంవత్సరము 365 రోజులలో చంద్రసంవత్సరం లోనికి సరితూ గవు. ఆ సంవత్స ప్రమాణం.... సంవత్సర ప్రమాణంవేరు. కాని ఈ రెండూ 2-3 సంవ త్సరాల కొకసారి సర్దుకుం టాయి. సర్దుబాటే రెండు మూడు సంవత్సరాలకొకసారి వచ్చే అధికమాసం - మరియు యభై అరవైఏళ్ళ కొకసారి వచ్చేక్షయమాసం. క్షయమాసం దీనిని తర్వాత చర్చిద్దాం. ముందు ఈ అధికమాస సంబంధించిన ఉదాహరణ గమనించండి.
శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీక ఈ నాలుగునెలలూ వరసగా ఒకదానితో ఒకటి రావాలిగదా! రావాలంటే పౌర్ణమినాడు, శ్రావ ణం, భాద్రపద, అశ్వని, కృత్తికపక్షానికి ఉండాలి గదా. శ్రావణమాసంలో ...శ్రవణానక్షత్రం లోనే ఉంది. అంటే చంద్రుడు నక్షత్రంలో సమరేఖలో ఉన్నడ న్నమాట. కాబట్టి దాని తర్వాత పౌర్ణమి పూర్వాభాద్రలోగాని, ఉత్తరాభాద్రలోగాని, ఉం డాలి. అలాగే ఆ తర్వాత పౌర్ణమి అశ్వనిలో ఉం డాలి. కాని అలా జరగడంలేదు. ఈ శ్రావణ పైర్ణమి తర్వాత పౌర్ణమి ఎక్కువభాగం శతభిషం లోనూ ఆ ఆర్వాత పౌర్ణమి ఉత్తరాభాద్రలోనూ ఉండి, ఆపై పౌర్ణమికి గాని అశ్వనికి చేరడంలేదు.
ఆ తర్వా వరస కుదిరి కృత్తికలో పౌర్ణమి యధాతథంగా జరిగిపోయింది.ఈలోగా శ్రావణం, శతబిషం, ఉత్తరాభాద్ర, అశ్వని నక్షత్రాలలో శతభిషం అధికంగా పెరి గింది - భాద్రపదం అవతలికి జరిగింది. ఇది ఒక విధంగా అధిక భాద్రపదం అనిపిస్తుంది. కాని వరుసలో అశ్వనిస్థానంలో వచ్చింది. కాబ ట్టి దీన్ని అధిక ఆశ్వయుజం అన్నారు. పౌర్ణమి అశ్వనిలో జరగడానికి ఈకాలం అధికంగా పట్టింది కాబట్టి యిది అధిక ఆశ్వయుజం. అశ్వ నిలో వచ్చింది నిజ ఆశ్వయుజం. ఇదికాక మరొక ప్రసిద్ధ మైన పద్ధతికూడా ఉంది. ప్రతినెలా సూర్యుడు ఒక రాశినుండి మరొక రాశికి మారుతూ ఉంటాడు. ఈ మారడం ముఫ్పైరోజులూ ఒకరాశిలో ఉంటాడన్న మాట.మరొకరాశిలోకి మారేటప్పుడు చాంద్ర మానం లోని పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉన్న తిధులలో ఏదో ఒక తిధిలో మారతాడు. దాన్నే సంక్రమణ దినం అంటాము అలా మారే దినం ఒక చంద్రమాసంలో ఏ తిధిలోనూ పడకపోతే అదే అధికమాసం.
ఉదాహరణకి:
2004 సెప్టెంబరు 17 అనగా భాద్రపద అమా వాస్యనాడు సూర్యుడు కన్యాసంక్రమణం చేశాడు. అనగా కన్యారాశిలోకి ప్రవేశించాడు. మళ్లీ తులా సంక్రమణం అక్టోబరు 17న జరి గింది. ఆరోజు పాడ్యమి అయింది. అంటే మరో అమావాస్యదాటి పాడ్యమి వచ్చిందన్నమాట. కన్యాసంక్రమణం జరిగిన తర్వాత ఒక శుద్ధపాడ్యమి తులా సంక్రమణానికి ముందు రోజున ఒక అమావాస్యా మొత్తం ముఫ్పయి రోజులు గడిచాయి. ఈ రోజులలో (అనగా చంద్రమాసంలో) సూర్యసంక్రమణం జరగలేదు. కాబట్టి ఈ ముఫ్పైరోజుల్ని అధికమాసం అని వ్యవహరించారు. వ్యవహరించి దీన్ని అధిక ఆశ్వయు జం గానూ, సంక్రమణం జరిగిన తిధినుంచి నిజ ఆశ్వయుజంగానూ వ్యవహరించారు. ఈ విధం గా సూర్యగమనంలోని ఒకరోజు, చంద్రగమ నంలోని ముఫ్పయిరోజులికి దారి తీసిందన్న మాట