Pages

గుడిలో ప్రదక్షిణ ఫలమేమిటి



గుడిలో ప్రదక్షిణ ఫలమేమిటి



ఆది పూర్వంలో ‘ గణఆదిపథ్యం ‘ విషయంలో వినాయకుడు తన తల్లి తండ్రులైన పార్వతీ పరమేశ్వరుల
చుట్టూ తిరిగి’ విశ్వ ప్రదక్షిణ ‘ చేసిన ఫలితాన్ని పొందాడని పురాణాలు చెపుతాయి .
‘ ప్రదక్షిణం’ లో ‘ ప్ర’ అక్షరం పాపనాశనం , ‘ద’ అంటే దైవాన్ని ధర్మమైన కోరికలు తీర్చమని విన్నవించటం , ‘ క్షి’ అన్న అక్షరం మరుజన్మ కి మంచి పుట్టుకను ఇవ్వమని ,’ణ’ అంటే అజ్ఞానము ను తరిమేసి సుజ్ఞానం అనగా ఆత్మ జ్ఞానం ఇవ్వమని గుడి లో భగవంతుని చుట్టూ తిరిగేప్రదక్షిణ లో ఉన్న అర్దం . కావున గుడి లో దైవం చుట్టూ చేసే ప్రదక్షిణ ‘ విశ్వ ప్రదక్షిణ ‘ అవుతుంది , ‘ ఆత్మ ప్రదక్షిణ ‘ అవుతుంది .