ఇంటి ఓనర్స్ పైన ఉండాలా? కింద ఉండాలా?







ఇంటి ఓనర్స్ పైన ఉండాలా? కింద ఉండాలా?




houseవీలుని బట్టి, అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వాళ్ళ శారీరక స్థితిగతులను బట్టి దీనిని నిర్ధారించుకునే అవసరం ఉంది. యజమాని అనగానే పెద్దవాడు అని, పైనే ఉండాలని అనేది నిజం కాదు. పై భాగం అనేది స్థలానికి వర్తిస్తుంది. దక్షిణం, పడమరలు పై భాగాలు అవుతాయి. ఆ కోవలో పెద్దవాళ్ళు ‘దక్షిణ, పడమరలో ఉండాలి’ అనేది శాస్త్రం. నిజానికి కింది నుండి పైకి చూసినప్పుడు పై భాగం ప్రాధాన్యం నేలకు వర్తిస్తుంది, తప్ప మేడలకు కాదు. చెట్టుకు ఆధారం భూమి. చెట్టులో కాండం భూమిని ఆనుకొని ఉంటుంది కదా! ఆ కోవలో ఇంటికి కాండం అయిన యజమాని నేలమీద ఉండటమే శ్రేష్టం. ఐతే, ఫస్ట్ ఫ్లోర్‌లో, సెకండ్ ఫ్లోర్‌లో ఉండకూడదనే నియమం లేదు. అనువైన, ఇష్టమైన చోట ఉండొచ్చు. కాని, ఆ ఉండే ఇల్లు ఏదైనా పరిపూర్ణ రూపమై ఉండాలి.

హాలులో మూడవ బెడ్‌రూం కట్టుకోవచ్చా? :- రమణి, శ్రీనగర్ కాలనీ
స్థలం వుంటే నాలుగు గదులు, ఐదు గదులు ఇలా ఎన్నైనా గదులతో వాస్తుకు సరైన విభజన చేసి కట్టుకోవచ్చు. సమస్య వచ్చేది ఎక్కడంటే స్థలం లేనప్పుడే! రెండు గదుల నిర్మాణం గల ఇంటిలో మూడవ పడకగది పెట్టాలంటే ఉత్తరం వైపు స్థలం ఉన్నట్లయితే అటువైపు వాయవ్యం నుండి ఈశాన్యం వరకు గృహాన్ని పెంచి కట్టుకొని ఉత్తర, వాయవ్యంలో బెడ్‌రూం కట్టుకోవచ్చు. హాలులో ఏ నిర్మాణం రాకుండా ఉండేనే మంచిది. ఇంటికి గర్భం అనేది ప్రధానాంశం. అలాగే, గృహానికి కూడా గర్భం కావాలి. అదే ఇంటి మధ్యలోని హాలు, దానికి ఎన్ని పేర్లు పెట్టుకొని పిలిచినా అదే మూలం. భోజనం కోసం ఉన్న ఖాళీని పడకగదిగా వాడుకోవచ్చు. ఐతే, హాలులోకి భోజనం బల్ల వస్తుంది. డైనింగ్ హాలులోకి ఉన్న కిచెన్ ఎంట్రీని మూసివేయాలి. ఉత్తర ఈశాన్యంలో లేదా ఉత్తరంలో కిచెన్ ఎంట్రీ పెట్టి వాడుకోవాలి. ఇల్లు కట్టకముందే పడక గదుల రచన అవసరం. తదనుగుణంగా ఇంటి ప్లాను వేసుకోవచ్చు. రెండు పడక గదుల స్థలమే ఐనప్పుడు ‘డూప్లెక్స్’ కట్టుకుంటే చాలా మంచిది.

మా ఇంటికి ఉత్తర, వాయవ్యం మెట్లు అంటుకొని ఉన్నాయి. ఏం చెయ్యమంటారు? : - భవాని, హైదరాబాద్
ఇంటి చుట్టూ ఖాళీ ఉండాలన్నది వాస్తులో ప్రధానాంశం. దానికి విరుద్ధంగా వాయవ్యాన్ని మూస్తూ మెట్లు వేయడం సరైంది కాదు. ఇంటికి ఉత్తరం వైపు హద్దుమీద నిర్మాణం రాకూడదు. ఉత్తరాన్ని ఏ చోట మూసినా సమస్య లొస్తాయి. ముక్కు మూసేస్తే శ్వాసక్షికియ సమస్యలు వచ్చినట్లు ఉత్తరం బంధించబడితే గృహాలలో ఉండే స్త్రీలపైన దోషాలు కలుగుతాయి. ఉత్తరం మాతృస్థానం కాబట్టి, దానిని ఎప్పుడు ఉత్తమంగా చూసుకోవాలి. మనుషులకన్నా శక్తియుక్తులు కలిగినవి దిశలు. ఆ కోవలో ఉత్తరం ప్రధానం. కాబట్టి, మీ ఇంట్లో వెంటనే ఉత్తరం హద్దు మీదున్న మెట్లను తొలగించాలి. ఉత్తర ఈశాన్యం నుంచి ఉత్తరం, వాయవ్యం వెళ్ళడానికి కావలసిన ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేయాలి.

నైరుతిలో ఒక బీరువా, వాయవ్యంలో ఒక బీరువా పెట్టవచ్చా? :- స్వర్ణలత, బంజారాహిల్స్
ధనం, ధాన్యం మొదలైన ఆర్థిక సంబంధమైన వాటిని నైరుతిలో పెట్టడం శాస్త్రీయత. అన్ని గదులకన్నా నైరుతి గది యజమాని కనుసన్నల్లో ఉంటుంది. వాటి జమా, ఖర్చులు అన్నీ కూడా యజమాని నేతృత్వంలో జరపడానికి అనుకూలమైన గది. కారణం ఆ గదిని కుటుంబ యజమానులే వాడుకుంటారు కాబట్టి. ఆ కోవలో బీరువాలలో ప్రధానమైంది దక్షిణ నైరుతిలో పెట్టడం మంచిది. లేదా పశ్చిమ నైరుతిలో కూడా పెట్టవచ్చు. రెండు బీరువాలు వచ్చినప్పుడు పక్కపక్కనే లేదా దక్షిణ నైరుతి ఒకటి, పశ్చిమ నైరుతి ఒకటి పెట్టుకోవచ్చు. నైరుతి భాగంలో ఒక్క బీరువా పట్టే స్థలం మాత్రమే ఉంటే మరొకటి దక్షిణ ఆగ్నేయంలో కాని, పడమర వాయవ్యంలో కాని, ఉత్తర, తూర్పు ముఖాలుగా పెట్టుకోవచ్చు. రెండు బీరువాలలో పెద్దది, చిన్నది ఉన్నట్లయితే ఎత్తైనది నైరుతిలోనే ఉండాలి.

ఊరికి ఆలయాలను ఈశాన్యంలోనే కట్టాలా? :- సదాశివరావ్, ఖమ్మం
స్థల నిర్ధారణ ఆలయాలకు ముఖ్యమైంది. స్థలం ఎక్కడ కేటాయించాలన్నది ప్రధానం. ఊరి మధ్యన కూడా ఆలయాలను నిర్మించిన ప్రాంతాపూన్నో. నదీ ప్రవాహాలకు దగ్గర, పర్వతాలపైన, యోగులు నివసించే ప్రాంతాలలో, జన సమర్థం గల ప్రదేశాలలో, జలపాతాల దగ్గర, చెరువుల దగ్గర ఇలా అనువైన ప్రదేశాలలో గుళ్ళను కట్టుకోవచ్చు. ప్రత్యేకంగా ఊరిని తీసుకున్నప్పుడు స్థలం ఏర్పాటుచేశాక దానిచుట్టూ నలువైపుల రోడ్లు ఏర్పాటు చేయాలి. వాటిని ‘మాడ వీథులు’ అంటారు. అప్పుడు ఆ వీథులకు పై భాగంలో ఇండ్లు కట్టుకుంటే దోషం ఉండదు. 


ఆలయాల ఎత్తు ఎంతో ప్రశస్తమైంది, అవసరమైంది. కాబట్టి, శిఖరాలు లేకుండా, ధ్వజ స్తంభాలు లేకుండా ఆలయాల ప్రాధాన్నాన్ని కోల్పోకుండా వాటి పవివూతతను కాపాడేలా ప్రాకారాలతో పాటుగా చుట్టూ వీథులు అవసరం. మాడా వీథులు లేకుండా నిర్మించే ఆలయాలకు దక్షిణంలో, పడమరలో గృహాలు ప్రాకారానికి దూరంగా కట్టుకోవలసి వస్తుంది. అది వారి స్వంత స్థలమైనా కొంత వదులుకోవాలి