మంగళసూత్రం -నల్లపూసలు -ప్రాముఖ్యత ఏమిటి?
హైందవ వివాహంలొ ప్రధానమైన ఘట్టం మంగలసుత్రధారణ, వివాహితుల మెడలో మంగళసూత్రం తప్పని సరిగా ఉంటుంది .దీనికి తోడు నల్లపూసలు కూడా ఉంటాయి. ఇవి దుష్టశక్తుల కన్ను పడకుండా పెళ్ళిరోజున వధువుకు అదృష్టం చేకుర్చుతాయని మన పూర్వికులు చెబుతారు. నల్ల పూసలను వధువు మెడలో కట్టడం వల్ల ఆమెకు, ఆమె భర్తకు, వారి బాంధవ్యానికి, దాంపత్య జీవితానికి ఎటువంటి హాని జరగదని నమ్ముతారు. వివిధ రాష్ట్రాల వారికి మంగళసూత్రం విభిన్న రకాలుగా ఉంటుంది. తమిళనాడులొ మంగళసూత్రాలు ఓ రకంగా టేల్స్ తో, మహారాష్ట్ర మంగళసూత్రాలు పట్టీలతో, ఆంధ్ర ప్రదేశ్ లొ గుండ్రని ఆకృతిలొ, కర్ణాటకలొ సాంప్రదాయ బద్ధమైన పతకాలతో ఉంటాయి. వాటిలో తేడాలు ఎలా ఉన్న దేవుడి చిహ్నంతోను, దేవాలయ గోపురాల మదిరగానే ఉంటాయి. వీటిని సంతాన సౌఫల్యానికి, సంపదలకు గుర్తులుగా పరిగణించాలి. భారతదేశంలొ ప్రతి కమ్యూనిటీ వారూ పాటిస్టారు, గౌరవిస్తారు. ప్రతి స్త్రీ వివాహిక జీవితంలొ ఇవి ప్రధాన భాగం. స్త్రీ లోనీ పదహారు కళల సంపూర్ణతకు ఇవి ఎస్సెన్సువంటివి. వివాహితులు మంగళసూత్రాలు లేదా నల్లపూసలు లేకుండా గడప దాటి బైటికి వెళ్ళరు, వెళ్ళకూడదు.