మలబద్ధకం - ఆయుర్వేదం

మలబద్ధకం (Constipation).. ప్రమాదకరం


నిర్ణీత సమయంలో క్రమబద్ధంగాలేక, కష్టతరమైన మలవిసర్జనను మలబద్ధకం (Constipation) అంటారు. ఇది వ్యాధి కాదు లక్షణం మాత్రమే. చిన్నపిల్లలో, 60 సంవత్సరాలు పైబడిన వారిలో దీనిని ఎక్కువగా గమనించవచ్చు. వీరు తీసుకొనే ఆహారం తక్కువ పరిమాణంలో వుండటం మూలకారణం.
వారంలో మూడుసార్లు మాత్రమే మలవిసర్జన జరగడం, మలవిసర్జన సమయంలో బాధ కలిగి వుండటం, సంపూర్తిగా మలవిసర్జన కలగకపోవడం మలబద్దకంగా పరిగణించాలి.
గతంలో చిన్న పిల్లలకు సెలవు రోజుల్లో విరేచన కార్యక్రమం కొన్ని ఇళ్ళల్లో విధిగా ఉండేది. శిశువులలో ‘ఉగ్గు’ సంప్రదాయంగా వుండేది. ఆ అలవాట్లు ఇపుడు పూర్తిగా మారిపోయాయి. తరచు ఆసుపత్రి సందర్శన అలవాటు అయింది.
శిశువులలో 4-5 సార్లు ద్రవంగా మలవిసర్జన వుంటుంది. కొందరిలో స్తన్యం తీసుకోగానే విరేచనం అవుతుంది. ఫార్ములా పాలు తీసుకొనే శిశువులలో తక్కువ సార్లు అయ్యే అవకాశం వుంది. రెండవ సంవత్సరంలో రోజుకు రెండుసార్లు, నాలుగవ సంవత్సరం వచ్చేప్పటికి ప్రతిరోజు ఒక్క పర్యాయం మాత్రమే మలవిసర్జన వుంటుంది.
అనేక వ్యాధులకు మూలకారణం మలబద్ధకం. పెద్దప్రేగు ద్వారా విసర్జితం కావాల్సిన మలం పరిమితకాలానికి మించి అక్కడ నిల్వ ఉన్నప్పుడు అందులోని ద్రవపదార్థాలు పెద్దప్రేగు గోడల్లోకి పీల్చబడతాయి. దానితో మలంలోని ద్రవం పాలు తగ్గడంతో మలం తన మృదుత్వాన్ని కోల్పోయి మలబద్ధకం ఏర్పడుతుంది. అంతేకాక మలంలోని మరలా రక్తప్రసరణలో కలవడంవలన రక్తప్రసరణ వ్యవస్థ కలుషితం కావడం, మూత్రపిండాల మీద భారం పడటం జరుగుతుంది. దానితో అనేక వ్యాధులకు అది మూలకారణం అవుతుంది.
ప్రస్తుత నాగరిక సమాజంలో పాలు, పాల ఆధారిత పదార్థాలు, నూడుల్సు, కేకులు, పిజ్జాలు, జంక్‌ఫుడ్ పదార్థాలు తినడం సర్వసాధారణమయింది. వీటిలో పీచు పదార్థాలు తక్కువ. జీర్ణం అయ్యాక మిగిలిన పదార్థాన్ని చిన్న ప్రేగులోంచి పెద్దపేగులోకి ముందుకు నెట్టివేయడానికి ఆహారంలోని పీచు పదార్థం ఉపకరిస్తుంది.
అందులోబాటులో ఉండే ఆహార పదార్థాలు ఆహారపు అలవాట్లు ఆయా ప్రాంతాలను బట్టి వేరువేరుగా ఉంటాయి. పల్లె ప్రాంతాలలో నివసించే వారిలో గతంలో దంపుడు బియ్యం, ముడిగోధుమలు, ఇతర ఆహార ధాన్యాలు, జొన్నలు, సజ్జలు, వరిగలు, కర్రలు వాడకం విరివిగా వుండేవి. వాటిలో వుండే పీచు కణాలు మలం ఫ్రీగా వెడలటానికి వీలు వుండేది.
వాత పిత్త కఫ దోషముల ప్రకోప ప్రాధాన్యతలతో, వాతమువలన మలము గట్టిపడి బాధ కలిగించును. అపాన వాత ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. పిత్తదోష ప్రాధాన్యతలో మలద్వార మంటతో కూడి మలబంధము వుంటుంది. కఫ దోష ప్రకోపంలో జిగట, బంకతో కూడి (Mucus) వుంటుంది. ఆమ్ల దోషము కూడి పిచ్ఛిలముగా వుంటుంది.
నిర్థారణ
సాధారణ పరీక్షల ద్వారా అనగా సాధారణ రబ్బరు తొడుగుతో మలద్వార పరీక్ష, మలంలో రక్తము కూడి (Occuct blood), Sigmoidoscopy, డజయౄజజ్యూఒష్యఔక ధ్వారా కొన్ని విషయాలు తెలుస్తాయి. ప్రేగులలో ఏమైనా అడ్డంకులు (intestinal Obstruction) వున్నాయేమో, హైపోథైరాయిడజమ్, ఎలక్ట్రోలైట్ ప్రొఫైల్ తేడా, రక్తంలో కాల్షియం శాతం అధికంగా వుండటం కొలొనోస్కోపి వంటి పరీక్షల ద్వారా మూలకారణాన్ని నిర్థారించుకొనవచ్చును.
ఇవికాక రోగి ఆహారపు అలవాట్లు, ఇతర మందుల వాడకం, శారీరక శ్రమ, నిద్ర వ్యక్తిగత హాబీలు కొంతవరకు కారణమవుతాయి.
బేరియం ఎనిమా ద్వారా ఎక్స్‌రే కూడా నిర్థారణకు తోడ్పడుతుంది.
చికిత్స
మూలకారణం, ఉద్ధృతి, సమయము స్పష్టంగా తెలిస్తే చికిత్స సులువుగా వుంటుంది. ఆహారపు అలవాట్లు జీవన సరళి ఇందుకు బాగా ఉపకరిస్తాయి. కోష్ఠశుద్ధికి నెలలో ఒకసారి (ద్రవ ఆహారంతో) ఉపవాసం బాగా ఉపయోగపడుతుంది.
రాత్రివేళ పడుకోబోయేముందు గ్లాసు పాలలో బ్రాహ్మీఘృతం, లేక ఇందుకాంతఘృతం 1 టీస్పూనును కలిపి తీసుకొంటే లేక వేడినీటితోనైనా తీసుకొంటే శ్రోతస్సు శుద్ధి అయి మలబద్ధకం నివారించబడుతుంది.
విరేచన క్రియ
ఆయుర్వేద శాస్తర్రీత్యా, క్రూరకోష్ఠము మద్యమ కోష్ఠము, మృదుకోష్ణము అనిమూడు రకాలుగావుంటుంది. వారి వారి వ్యక్తిగత ప్రవృతిని బట్టి ఓషధుల నిర్ణయం వుంటుంది. కొందరిలో త్రిఫలాచూర్ణము, స్వాదిష్ట విరేచన చూర్ణము, పంచసకార చూర్ణము, త్రివృతాది లేహ్యము, రోజా పుష్పలేహ్యం బాగా ఉపయోగపడతాయి.
వస్తిక్రియ
అనువాసన వస్తి, నిముష లలేక కషాయ వస్తి బాగా ఉపయోగిస్తుంది. సాధారణ బలహీనత వున్నపుడు బృంహణవస్తి ఉపయోకరం.
విరేచనగణ ద్రవ్యములతో కూడిన స్నేషము ఒక నెలపాటు ప్రతిరోజు వర్థమాన పద్ధతిలో ఘృతముతో 2-4-6 చెంచాల చొప్పున తీసుకొంటే తప్పక మంచి ఫలితమిస్తుంది.
శరీరంలో ఎలక్టొలైట్ స్థితిని పరిగణనలోకి తీసుకొనవలసి వుంటుంది.
త్రిఫల చూర్ణముతో రెండు చెంచాల నేయిని కల్పుకొని తీసుకోవడం, అలోవిరా జ్యూస్ రెండు చెంచాల చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకోవడం ఉపయోగం.
ముడిబియ్యం (దంపుడు బియ్యం, ముడి గోధుమలు, ఇతర ధాన్యాలతో చేసిన ఆహార పదార్ధాలు, తాజాకూరలు, ఆకుకూరల వంటివి తీసుకొనే వారిలో ఈ సమస్య చాలా తక్కువ. బియ్యం తవుడు, గోధుమ తవుడులలో పీచు పదార్థం ఎక్కువ కాబట్టి మిగతా ఆహార పదార్థాలతో కలిపి రోజూ మూడు టీస్పూన్ల తవుడు తీసుకుంటే మలబద్ధకాన్ని నివారించవచ్చును.
ప్రతిరోజు రెండు చెంచాల ముడి మెంతులు నమలకుండా మంచి నీటిలో తీసుకొనవలెను. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటంవలన మృదు విరేచనకారిగా పనిచేస్తుంది.
సునాముఖి ఆకుల చారు (రసం)తో కలిపి తీసుకొంటే ప్రయోజనం వుంటుంది. పండ్లలో పీచు పదార్థం అధికంగా వుండే బొప్పాయి, బత్తాయి, నారింజ, పనస, ద్రాక్ష, జామ మొదలయిన వాటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది.
ఏదైనా ఒక ప్రక్రియను శరీర సాత్మ్యతను గుర్తించి కనీసం నెల రోజులు ఆచరించాలి.
ఆమవాలము (రుమాటిజమ్) రోగులలో మలబద్ధకం అధికంగా వుంటుంది. వీరు రోజూ 2 చెంచాల చొప్పున ఆముదం (Castor oil) మంచి ఫలితాన్నిస్తుంది. దీనికితోడు గంధర్వ హస్తాది కషాయము, సుఖవిరేచనవటి, రోజా పుష్పలేహ్యం, తివృత్‌లేహ్యం, మృదువిరేచనకారిగాను, ఇచ్ఛ్భాదిరసం, ఎరండ తైలం తక్షణ విరేచనకారిగాను వుంటుంది.