కుక్కకాటు


కుక్కకాటు



వీధుల్లో తిరిగేటప్పుడు, గానీ, పిల్లలు పెంపుడు కుక్కలతో ఆడుకు నేటప్పుడుగానీ సాధారణంగా కుక్కకాటుకు గురవుతుంటారు. కుక్కకాటు ఒక్కో సారి ప్రాణాంతకమయ్యే అవకా శముంది. కుక్కకు ‘రేబిస్‌’ వ్యాధి ఉంటే అది కరచినప్పుడు మనిషికి సోకుతుంది. ‘రేబిస్‌’ మాత్రమే కాకుండా ఇతర ‘ ఇన్‌ఫెక్షన్లు’ వచ్చే ప్రమాదం కూడా ఉంది.
రేబిస్‌ వ్యాధి లక్షణాలు
తలనొప్పి, జ్వరం, గొంతు నొప్పి, అలసట, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఫిట్స్‌, హైడ్రోఫోబియా ఉంటాయి. నీళ్లు చూస్తే గొంతు దడ, ఫారింక్స్‌, లారింగ్స్‌ కండరాలు విపరీతంగా సంకోచిస్తాయి. దీంతో దప్పిక అవుతున్నా నీళ్లు తాగలేక రోగి తీవ్ర భయాందోళనకు గురవతాడు. దీన్నే హైడ్రోఫోబియా అంటారు. ఆ తర్వాత రోగి కోమాలోకి వెళ్లిపోవడం, మృత్యువాతపడే అవకాశాలున్నాయి.

ప్రథమ చికిత్స
కుక్క కరచిన భాగాన్ని సబ్బునీళ్లతో కడగాలి. ఎక్కువగా పోస్తూ ఐదు నిమిషాలు కగడాలి.
కడిగిన తర్వాత గాయంపై బెటాడిన్‌ లోషన్‌ వేయాలి.
కరచిన కుక్కను కట్టేసి 10 రోజులపాటు పరిశీలనలో ఉంచాలి. 10 రోజుల్లో కుక్క చనిపోతే ఆ కుక్కకు రేబీస్‌ ఉన్నట్లు పరిగణించి, ఏంటి రేబిస్‌ వ్యాక్సిన్‌ ఇంజక్షన్లు చేయించుకోవాలి
డా|| ఇటి రామ్మూర్తి