సబ్బు పొడి తయారీ
కావలసిన వస్తువులు:
సోడాయాష్ మూడుకేజీలు, సోడియం కార్బనేట్ 100 గ్రాములు, సోడియం మెట సల్ఫేట్ 100 గ్రా., సోడియం టెర్రిఫాలి ఫాస్పేట్
100గ్రా. సోడియం సల్ఫేట్ 100గ్రా. టెర్రి సోడియం ఫాస్పేట్
100గ్రామ. ఇండస్ట్రీరియల్ డిటర్జంట్ పౌడరు 100గ్రా. జియోలైట్ 250గ్రా. రాణిపాల్ 50 గ్రా. కొరలాక్స్ మిథైల్ సెల్యూస్ ఒకకేజీ,
యాసిడ్ స్లెర్రి కేజీ, సోడియం లారల్ సల్ఫేట్ 200గ్రా. గ్రాన్యూల్స్ 100గ్రా. పర్‌ఫ్యూమ్ 5ఎంఎల్, బోరాక్స్ 100ఎంఎల్. ముందుగా
పైన తెలిపిన వరుసలో ఒకటి నుండి పది వరకు గల పౌడర్లను అన్ని ఒక డబ్బాలో కలపాలి. తర్వాత దానిలో యాసిడ్ స్లెర్రి, సోడియం
లారల్ సల్ఫేట్‌లు కలుపుకోవాలి. తర్వాత పర్‌ఫ్యూమ్‌ను కలిపి మొత్తాన్ని జెల్లించుకోవాలి.
తర్వాత చివరగా గ్రాన్యూల్స్ కలపాలి.
గమనించదగ్గ విషయాలు:
పెద్ద టబ్‌ను ఉపయోగించాలి. యాసిడ్ స్లెర్రిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్త వహించాలి. పిల్లలకు దూరంగా ఉంచాలి. తయారు
చేసేటప్పుడు ముక్కు మాస్క్ పెట్టుకోవాలి. అదేవిధంగా చేతులకు
గ్లౌసులు తొడుక్కోవాలి. మార్కెట్‌లో దీనికి సంబంధించిన వస్తువులన్ని ఒకే దుకాణంలో దొరుకుతాయి. మంచి క్వాలిటి ఉన్న సబ్బుపొడి ఐదుకిలోలకు కావలసిన ముడి పదార్థాలు 300 రూపాయలకు
లభిస్తాయి. ఒకకేజీ మనకు 60రూపాయలకు లభిస్తుంది. దీనిని సుమారు మార్కెట్లో వంద నుండి 120రూపాయల వరకు అమ్మవచ్చు. అంటే కేజీకి తప్పనిసరిగా 40 నుంచి 60మధ్య లాభం ఉంటుంది.