మడమ నొప్పి తగ్గాలంటే ...?



మడమ తిప్పండి ఇలా
మడమ నొప్పి వచ్చిందటే, పాదం అడుగున ఉండే ప్లాటార్‌ ఫేసియా అనే కండర భాగం దెబ్బతింటోందనీ, తక్షణమే జాగ్రత్త పడమని మనల్ని హెచ్చరిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. దానివలన మడమ ఎముక కూడా దెబ్బతినవచ్చు. వాపు, పోటు కలుగుతారుు. ఈ పరిస్థితిని మడమకండర గాయం(ప్లాటార్‌ ఫాసైటిస్‌) గా చెప్పుకోవచ్చు. నడిచే తీరులో వచ్చే బాధని వాకింగ్‌ గైట్‌ డిజార్డర్‌ అని అంటారు దీన్ని. వయోభార, స్థూల కాయం లాటి కారణాలు అనేక ఈ పరిస్థితిని తెచ్చిపెట్టవచ్చు. ప్లాటార్‌ కండరానికి కొద్దిపాటి విశ్రాంతినిచ్చి వత్తిడిని తగ్గించటమే ఇందుకు సరైన నివారణ! 

శరీరంలో ప్రతి అవయవానికీ ఒక శాస్త్రం ఉంది. అలాగే పాదానికి సంబంధించిన శాస్త్రాన్ని పోడియాట్రిక్స్‌ అంటారు. పాదం అడుగున నొప్పి, ఎరుపు, మంట, వాపు ఇలాంటి బాధలు కలిగినప్పుడు పోడియాట్రిక్స్‌ దీనికి సమాధానం చెబుతుంది. శరీరంలోని 26 పెద్ద ఎముకల్లో మడమ ఎముక ఒకటి! మొత్తం 33 ఎముకల పెద్ద జాయింట్‌గా దీన్ని చెప్పుకోవచ్చు. కనీసం వంద కండరాలు ఈ ఎముకల్ని సంధానం చేసి పాదం కదిలేలా చేస్తున్నాయి. వాటివలన నడుస్తున్నా...నాట్యం చేస్తున్నా. ఆడగలుగుతున్నా...ఎగిరి దూకగలుగుతున్నా...పాదం అడుగున ఉండే ండరాలు కుషన్‌ లాగా ఉపయోగపడి పాదంలోని ఎముకలు గాయపడకుండా కాపాడుతున్నాయి.

కండరభాగంలో గాయమే మూలకారకం: 
మొత్తానికి ండరమే గాయపడితే, మన ఆటలు సాగవు. అన్నీ కట్టిపెట్టాల్సి వస్తుంది. మడమ ఎముక చుట్టూ ఆవరించి ఉండే కండరం గాయపడినప్పుడు పాదం వెనుక భాగం లోనూ, మడమ భాగంలోనూ విపరీతమైన నొప్పి కలుగుతాయి. పాదం అడుగున నొప్పి ఏ మూలనైనా రావచ్చు. ఎక్కడ వచ్చినా కారణం అక్కడి కండర భాగం గాయపడటమే!

హీల్‌స్పర్‌ అంటే: 
ఒక్కోసారి మడమ భాగంలో మడమ ఎముక అడుగున ఒక చిన్న ఎముకలాంటిది పెరిగి అది మడమ ఎముకకూ దాని అడుగున ఉండే కండరానికీ మధ్య పెద్ద అగాథాన్ని సృష్టిస్తుంది. దాంతో అటు మడమ ఎముక, ఇటు మడమ కండరం రెండూ గాయపడతాయి. దీన్ని హీల్‌ స్పర్‌ అటారు.

మడమశూల: 
బరువులు లేపటం లాంటివి చేస్తున్నప్పుడు పాదం మీద వత్తిడి ఎక్కువ అవుతుంది. బరువు లేపుతున్నప్పుడు పాదాన్ని నేలమీదకు బలంగా తొక్కి పెట్టి ఉంచుతాం. అంతే బలంతో వ్యతిరేక దిశలో శరీర ండరాలను లోపలికి లాగుతుంది. ఒక గుడ్డముక్కను అటూ ఇటూ లాగితే ఎలా చిరిగి పోతుందో అలాగే, పాదం లోపల బైటకూ, లోపలికీ ఒకేసారి వత్తిడి కలుగుతుంది. దాని ప్రభావం పాదం కండరాల మీద ప్రసరిస్తుంది. దాంతో అవి గాయ పడతాయి. పాదంలో ఎముకలలోపల పగులు వలనకూడా నొప్పి కలగవచ్చు. ఇవి కాక, పాదంలోపలున్న ఎముకలలో కూడా ఆర్థ్రయిటిస్‌, కీళ్ళ వాతం లాంటి ఎముకలకు సంబంధిచిన వ్యాధులు కలగవచ్చు. అవి కూడా పాదం శూల లేదా మడమశూలకు కారణ అవుతాయి. ఎక్స్‌-రే తీస్తే అనుమానాలు తిరతాయి. ఒక్కోసారి అరికాళ్ళు విపరీతగా కారపోసినట్టు మటలు, తిమ్మిరి, స్పర్శ తెలియక పోవటలాటివి కూడా పాదం కండరాలు గాయపడినందువలన కలగవచ్చు.

మందుల అవసరం లేకుండా: 
జాగ్రత్తలు తీసుకోగలిగితే సాధ్యమైనంత వరకూ మందుల అవసరం లేకుడానే నొప్పి తగ్గుతుది. వాతం వ్యాధుల్లో తీసుకొనే జాగ్రత్తలన్నీ దీనికీ అవసరం అవుతాయి. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే ఆంగ్లేయ వైద్యంలో నొప్పి, వాపు తగ్గే ఔషధాలు, అలాగే యాంటీబయటిక్‌ ఔషధాలు ఇందుకు తోడ్పడతాయి. ఆయుర్వేదం అనేక వాతహర ఔషధాలను సూచించింది. ఇవి నిరపాయకరంగా పనిచేస్తాయి.
*మనం కొత్తగా బరువు పెరగక పోయినా, వయసు పెరుగుతున్నకొద్దీ బరువు ఆపగలిగే శక్తి కండరాలకూ, ఎముకలకూ తగ్గినప్పుడు ఇలాంటి బాధలు తప్పక వస్తాయి. అందుకని బరువు తగ్గే ఉపాయాలు కూడా పాటించటం అవసరం అవుతాయి.
* ఉదయం నిద్ర లేచి నేలమీద పాదం మోపగానే నొప్పి మొదలౌతుంటుంది కొందరికి. ఏ రోజు నొప్పులు లేకుండా నిద్రలేస్తానో ఆ రోజు శుభ దినం అంటాడు టెన్నిసన్‌. ఇది మడమ కండరం గాయపడిందని అనటానికి గుర్తు. కొంచెం నడిచేసరికి కండరం ఉత్తేజ పొంది నొప్పి తగ్గినట్టనిపిస్తుంది. నడివయసులో, ముఖ్యంగా ఆడవాళ్ళలో ఇది ఎక్కువగా కనిపించే వ్యాధి. కొద్ది సేపు విశ్రాంతిగా కూర్చుని లేదా పడుకొని లేచిన తరువాత అడుగు నేల మీద పెట్టగానే తేలు కుట్టినంత నొప్పి పుట్టి అడుగు ముందుకు సాగక అవస్థ పడతారు. కొద్ది నిమిషాలు నడవగానే నొప్పి దానికదే తగ్గి బాగానే నడవ గలుగుతారు. విశ్రాంతి తరువాత కలిగే ఈ నొప్పి మడమ భాగంలోనే ఎక్కువగా వస్తుంది. మడమ శూల అనటానికి ఇది ప్రముఖగా కనిపించే లక్షణం.

* మెత్తటి కుషన్‌ చెప్పులనే వాడండి. కటికనేల మీద పాదాన్ని చెప్పులు లేకుండా మోపకండి. ఇంటా, బైటా తిరిగేందుకూ వేర్వేరు చెప్పుల జతలు ఉంచుకోండి. చెక్కలాగా ఉండే చెప్పుల వలనే ముఖ్యంగా ప్లాటార్‌ కండరం గాయపడుతోదని గమనించండి! వాడుతున్న అలాంటి చెప్పులను మార్చటం తక్షణ కర్తవ్యం.
*మడమ కండరం పైన వత్తిడి తగ్గించేందు కోసం గరుకు నేలమీద నడవకుండా ఉండటం అవసరం. ఎక్కువ దూరం నడిచే పనులు పెట్టుకోకండి. వ్యాయావుం కోసం నడక కన్నా సైకిల్‌ తొక్కటం, ఈదటం లాంటి ఇతర మార్గాలు పాటించడి!
*మడమలో తీపు ఎక్కువగా ఉన్నప్పుడు పది నిమిషాలసేపు మంచుముక్కతో పాదానికి కాపడం పెట్టండి. లేదా, ఉంచ గలిగినంత సేపు ఐసుగడ్డమీద పాదం పెట్టి ఉంచండి. ఉప్పుకాపు పెట్టినా ఉపశమనం కలుగుతుంది. ఒకసారి అదీ ఒకసారి ఇదీ మార్చిమార్చి పెట్టుకోవచ్చుకూడా!
* టెన్నిస్‌ బంతి లేదా పిల్లలు ఆడుకొనే రబ్బర్‌ బంతిని పాదం అడుగున ఉంచి దానిమీద గట్టిగా వత్తుతూ పాదాన్ని కదిలించండి. కాలు మీద కాలు వేసుకొని కూర్చుని బంతితో పాదంమీద గట్టిగా వత్తుతూ గుడ్రంగా తిప్పండి నొప్పి ఉపశమిస్తుంది. ఒక తుండు గుడ్డని నిలువుగా జానెడు వెడల్పున మడిచి, దాని రెండుకొనలూ రెండు చేతులతో లాగి పట్టుకొని, బంతిని పాదానికి అదుముతూ, చల్లకవ్వాన్ని తిప్పినట్టు తిప్పుతుటే నొప్పి బాగా ఉపశమిస్తుంది. 

ఒక చేత్తో కొనని మీ వైపునకు లాగుతుంటే, రెండో చేయి పాదం వైపునకు వెళ్ళాలి. టవల్‌ స్ట్రెచ్‌ విధానం అంటారు దీన్ని. ఇవన్నీ ఉపశమన మార్గాలు. వాతపు నొప్పులను పెంచే ఆహార విహారాలన్నీ మడమ నొప్పిని కూడా పెంచుతాయి. వాటికి దూరంగా ఉండటం చాలా అవసరం. పులుపు, దుంపకూరలు, కష్టంగా అరిగే పదార్థాలన్నీ వాతపు నొప్పులను పెంచుతాయి.ఆయుర్వేద చికిత్సపరంగా గగనాదివటి అనే ఔషధం విడవకుండా కొన్నాళ్లపాటు వాడుతూ ఉంటే, మంచి ఫలితాలిస్తున్నట్టు చాలా మంది చెప్పారు. ఎముకలలో వాపు, కండరాల గాయాలు తగ్గి మడమ మళ్ళీ సామాన్య స్థితికి రావటానికి ఈ ఔషధం బాగా తోడ్పడుతోంది. నొప్పి కూడా బాగా తగ్గుతుంది. పైన చెప్పిన జాగ్రత్తలు చక్కగా పాటిస్తూ, గగనాదివటి వాడుకోండి. మడమ నొప్పి త్వరగా తగ్గుతుంది. దీనికి ప్రత్యేకమైన మందులంటూ వేరే ఏమీ ఉండవు. గాయం దానికదే తగ్గే పరిస్థితి దాటిపోతే, శస్త్ర చికిత్స అవసరపడవచ్చు కూడా! మడమ నొప్పి వచ్చిన రోజే జాగ్రత్త పడితే, అది ఆపరేషన్‌ దాకా దారి తీయకుడా ఉంటుదని దీని భావం.

పెరుగుతున్న మడమనొప్పి బాధితులు: 
ప్రస్తుతం మడమ నొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మారిన జీవనశైలి వల్ల, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల, ఊబకాయం వల్ల వివిధ రకాల కారణాలతో చిన్న వయసులోనే మడమనొప్పిని ఎదుర్కొంటున్న వారిని చూస్తున్నాం. నిత్య జీవితంలో ప్రతి కదలికా మడమలోని కీలు సహాయంతో జరుగుతుంది. మడమ ఎముకలో మార్పు రావటం వల్ల మడమ నొప్పితో కదలికలు కష్టంగా మారతాయి.మడమ కింది భాగంలో ఎముక (కాల్కేనియస్‌) పదునుగా పెరుగుతుంది. ఫలితంగా పాదం అడుగు భాగంలో నొప్పి కలుగుతుంది.

లక్షణాలు: 
ఉదయం నిద్రలేచిన తర్వాత మొదటి కదలికలో విపరీతమైన నొప్పి ఉంటుంది. కొద్ది దూరం నడిచిన తర్వాత నొప్పి తీవ్రత తగ్గుతుంది.మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పాదం అడుగుభాగాన నొప్పి వస్తుంది. పరుగెత్తేటప్పుడు మడమ నొప్పి తీవ్రత పెరుగుతుంది. ఎక్కువ సేపు కింద కూర్చొని పైకి లేచినప్పుడు పాదం అడుగు భాగంలో నొప్పి వేధిస్తుంది. మడమ భాగం వాపుతో కూడి ఉండి, నొప్పిగా ఉంటుంది. కాలి మడమకు కింది భాగాన అనుకోకుండా ఏదైనా ఒత్తినట్లయితే భరించలేనంత నొప్పి కలుగుతుంది.


పెయిన్‌ కిల్లర్స్‌తో జర భద్రం: 
మడమ నొప్పికి నాటు వైద్యం తగదు. పచ్చబొట్లు వేయటం చేయకూడదు. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు పాదాన్ని వేడినీళ్లల్లో ఉంచి అడుగు భాగంలో నెమ్మదిగా ప్రెస్‌ చేయాలి. కాలి పాదాన్ని కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి తిప్పుతూ నెమ్మదిగా వ్యాయామం చేయాలి.వ్యాయామాలు చేసే ముందు ఫిజియోథెరపీ వైద్యుల సలహాలు తీసుకోవాలి. నొప్పి ఉన్నప్పుడు అతిగా పెయిన్‌ కిల్లర్స్‌ వాడకుండా డాక్టర్‌ సలహా మేరకు హోమియో మందులను వాడాలి. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. నొప్పి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు బరువులు ఎత్తడం, పరుగెత్తడం, మెట్లు ఎక్కడం, దిగడం చేయకూడదు. ఎక్స్‌రే వల్ల నొప్పి తీవ్రత తెలుస్తుంది.మడమ నొప్పి లక్షణాలను, వ్యక్తిత్వ లక్షణాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులు వాడితే మడమ శూల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.