కష్టాలు తీర్చే మొక్కలు


మనస్సులో తెలియని ఆలోచనలా.... అనుకున్న పనులు పూర్తి కావడం లేదా... ఉద్యోగ అవకాశాలు చేజారి పోతున్నాయా? ఆర్థిక సమస్యలు పట్టిపీడిస్తున్నాయా.... ఆర్థిక పరంగా ఎదుగుదలలో ఏవైనా అడ్డంకులా.... ఇలాంటి సమస్యలతో సతమతమయ్యే వారు ఇకపై దిగులు పడాల్సిన అవసరం లేదు. సాధారణంగా మనస్సు ప్రశాంతత కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఏ రకమైన బాధలు, కష్టాలు ఉన్నప్పటికీ తగిన పరిష్కారపు మొక్కలు ఇంట్లో పెంచుకున్నట్టయితే మీ కష్టాలు తొలగిపోయి జీవితంలో సంతోషం కలుగుతుందంటున్నారు మన వాస్తు నిపుణులు చెబుతున్నారు.

క్రోటన్స్‌, ఒకే రోజా, పసుపు, అరలీ, వాడామల్లి, అలమండా పువ్వు అనే రకరకాల చెట్లను పెంచడం ద్వారా సమస్యలకు చెక్‌ పెట్టవచ్చునని చైనా వాస్తు సూచిస్తోంది.. ఒక్కో మొక్క ఒక్కో కష్టం తీర్చే శక్తిని కలిగివుంటుందట...అవేమిటో తెలుసుకుందామా...


* క్రోటాన్స్‌ - చెడు ఆలోచనలను తరిమేస్తుంది.


* నందివర్థిని- మనస్సుకు ప్రశాంతతను కలుగజేస్తుంది. 


* తులసి- భక్తిని పెంచుతుంది.


* మందారం- ఉత్సాహకరమైన శక్తిని కలిగిస్తుంది.


* వైట్‌ గనేరా - మనస్సు ప్రశాంతతను పొందుటకు సహాయపడును.


* రెడ్‌ గనేరా - తప్పులను సరిచేయును.


* ఒపంటియా - కీర్తి, సంపదలను ప్రసాదించును.


* పేపర్‌ పువ్వు- భగవంతుని పూర్తి ఆదరణలను ఇచ్చును.


* ఆల్‌మండ్‌ ఫ్లవర్‌ - అన్ని అడ్డంకులను తొలగించును. 


* మల్లెపువ్వు - మరణ భయాన్ని తొలగిస్తుంది. 


* రోజా పువ్వు- దీనిని పెంచడం ద్వారా కోరుకున్న ఉద్యోగము లభిస్తుంది