స్వయం ఉపాధి పధకాలలో C F L బల్బుల తయారీ ఒక లాభదాయకమైన రంగము. ఈ బల్బులకి మార్కెట్ డిమాండ్ కూడా బాగా ఉంది. వీటి గురించి మరియు ఈ బల్బుల తయారీలో వచ్చే లాభాలను గురించి క్లుప్తంగా చూద్దాం.
C F L ( Compact Fluorscent Light ) బల్బుల వలన ఉపయోగాలు:
- ఈ C F L బల్బులు పర్యావరణ సమతుల్యానికి దోహద పడతాయి.
- ఇవి సాధారణ బల్బుల( Incandescent bulb) కన్నా7 నుంచి 10 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి.
- ఈ బల్బులు 6000 నుంచి 15000 గంటలు మన్నితే, సాధారణ బల్బులు 750 నుంచి 1000 గంటలు పని చేస్తాయి.
- ఇవి సాధారణ బల్బుల కంటే 50 % నుండి 80 % వరకు విద్యుత్ ను ఆదాచేస్తాయి.
- ఈ C F L బల్బులు 60 నుంచి 72 lumens per watt అయితే, సాదారణ బల్బుల నుంచి 8 నుంచి 17 lumens per watt వస్తుంది.
- ఈ బల్బులను, సాధారణ బల్బులతో పోల్చితే :
C F L Bulb | Normal Bulb | Min light |
9 – 13 wats | 40 wats | 450 lumens |
25 – 30 wats | 100 wats | 1600 lumens |
30-52 wats | 150 wats | 2600 lumens |
ఈ C F L బల్బుల వలన వినియోగదారులకు ఇన్ని ఉపయోగాలు ఉండబట్టే వీటి ధర సాధారణ బల్బుల కన్నా ఎక్కువ అయినా వీటికి మంచి మర్కెట్ ఉంది.
C F L బల్బుల తయారీ సంస్ధ కు వచ్చే లాభాలు:
25000 బల్బుల తయారీ సంస్థ కు సాధారణ పరిస్థితులలో కావలసిన పెట్టుబడి మరియు వచ్చే లాభాలు:
- భవనం - 300 to 400 Sq.mts
- విద్యుత్ - 5 Kw
- తయారీ ప్లాంట్ - 1,50,000/- to 2,00,000/-
- మిగిలిన ఖర్చులు- 1,00,000/-
ప్రతినెలకు అయ్యే ఖర్చులు:
- ముడి సరుకులు( Glass Tubes,Plastic body, caps, etc...), జీతభత్యాలు, విద్యుత్, మొదలైనవి- 1,80,000/-
C F L బల్బులు అమ్మడం వలన వచ్చే ఆదాయం ( ఒక్కొక్కటి Rs.100/- చొప్పున )- Rs. 26,25,000/-
సంవత్సరానికి వచ్చే నికర లాభం
ఈ తయారీలో బల్బులను 5 నుంచి 6 స్టేజి లలో పరిక్షిస్తారు. మరియు పై న చెప్పిన పెట్టుబడి, లాభాలు సాధారణ పరిస్థితులలో వచ్చేవి. సంస్థ ఎక్కడ పెడుతున్నామో ఆ ప్రదేశం ను సర్వే చేసుకుని సంస్థ ని ప్రారంభించి, ప్రమాణాలను పాటిస్తే సంస్థ ను మంచి లాభాల బాటలో నడిపించవచ్చు.